ఇదీ అయోధ్య చరిత్ర!


అయోధ్యా రామమందిర విషయంలో దేశపు సర్వోన్నత న్యాయస్థానం తీర్పు వెలువరించనున్న (ఈ పత్రిక ప్రచురించినప్పటికి ఇంకా తీర్పు రాలేదు) సమయంలో సుదీర్ఘమైన రామమందిర ఉద్యమం, పోరాటంలో ముఖ్య అంశాలను చూద్దాం.

క్రీ.శ-1528 బాబర్‌ ప్రధాన సేనాధిపతి అయిన మీర్‌ బాకీ అయోధ్యలోని రామ జన్మభూమి మందిరాన్ని కూలగొట్టాడు. 1528 నుండి 1934 మధ్య కాలంలో దీనికోసం 76 యుద్ధాలు జరిగాయి. ఈ యుద్ధాలన్నీ ఎన్నో తరాల హిందువులు అయోధ్య రామజన్మస్థలం కోసం చేసినవే. ఆ తరువాత 90వ దశకంలో ఇది దేశవ్యాప్త ఉద్యమం అయింది. మర్యాదాపురుషోత్తముడైన శ్రీరాముని జన్మస్థలంలో మందిరం కోసం హిందువులు

500ఏళ్లుగా సాగిస్తున్న పోరాటపు సంక్షిప్త వివరాలు చూద్దాం..

-    బాబర్‌ కాలంలో (క్రీ.శ1528-1530) 4 యుద్ధాలు జరిగాయి.

-    హుమాయున్‌ కాలంలో(క్రీ.శ 1530-1556) 10 యుద్ధాలు జరిగాయి.

-    అక్బర్‌ కాలంలో (క్రీ.శ 1556-1606) 20 యుద్ధాలు జరిగాయి.

-    ఔరంగజేబు కాలం లో (క్రీ.శ 1658-1707) 30 యుద్ధాలు జరిగాయి.

-    నవాబ్‌ షాదిత్‌ ఆలీ కాలంలో (క్రీ.శ 1770- 1814) 5 యుద్ధాలు జరిగాయి.

-    నసీరుద్దీన్‌ హైదర్‌ కాలంలో (క్రీ.శ 1814-1836) 3 యుద్ధాలు జరిగాయి.

-    వాజీద్‌ ఆలీషా కాలంలో (క్రీ.శ 1847-1857) 2 యుద్ధాలు జరిగాయి.

-    బ్రిటిష్‌ వారి హయాంలో (క్రీ.శ 1912-1934) 2 యుద్ధాలు జరిగాయి.

-    ఇలా 1934వరకూ హిందూ సమాజం మొత్తం 76 యుద్ధాలు చేసింది.

1528లో బాబర్‌ ప్రధాన సేనాని మీర్‌ బాకీ రామ మందిరం నాశనం చేసిన నాటి నుండి, ఈ వివాదం ఒక ఉద్యమంలా సాగుతోంది. 1528 నాటి నుండి అన్ని తరాల వారు రామ జన్మభూమి కోసం పోరాడుతూనే ఉన్నారు. ప్రతి తరంలో ఈ ఉద్యమాన్ని మరింత ముందుకు నడిపించే ప్రయత్నం చేస్తూ వచ్చారు.

1934 సంవత్సరంలో అయోధ్యలో కొందరు ముస్లిములు ఒక గోవును హత్య చేయడంతో, హిందూ ముస్లిం వర్గాల మధ్య ఘర్షణ జరిగింది. ఆవును చంపిన కసాయి వాళ్ళని తుదముట్టిం చారు. ఆ తరువాత హిందువులు బాబ్రీ కట్టడంపై దాడి చేయడంతో దానికున్న మూడు గుమ్మటాలు దెబ్బతిన్నాయి. హిందువులు కట్టడాన్ని స్వాధీనం చేసుకున్నారు. అయితే, బ్రిటిషు వాళ్ళు హిందువుల నుంచి బాబ్రీ కట్టడాన్ని స్వాధీనం చేసుకుని, దెబ్బతిన్న గుమ్మటాలను బాగుపరచమని హిందువుల మీద జరిమానా విధించారు. 1934 సంవత్సరం నుంచి ఏ ముస్లిం బాబ్రీ కట్టడంలోకి ప్రవేశించలేదు.

రామమందిరం ఉండేదనడానికి ఆధారాలు - పురావస్తు పరిశోధన

విస్తతమైన తవ్వకాల తరువాత పురావస్తు పరిశోధన శాఖ రామ జన్మభూమిలో నిస్సం దేహంగా ఒక గొప్ప ఆలయము ఉండేదని నిర్ధారించింది. అలాగే దానిని కూల్చి ఆ స్థానంలోనే బాబరీ కట్టడ కట్టారని కూడా తేల్చింది.

ఆ ప్రదేశం మర్యాద పురుషోత్తమ శ్రీరామచంద్రుడి జన్మస్థానం. ఆ మొత్తం ప్రదేశమే ఒక పుణ్య తీర్థం. అతి పూజనీయం. కనుక ఆ ప్రదేశం న్యాయపోరాటానికి పూర్తిగా తగినది. ఈ హక్కుని వేల సంవత్సరాల నుంచి హిందూ మత గ్రంధాలు విపులంగా ప్రస్తావించాయి. అలాగే మన న్యాయ స్థానాలు కూడా ఈ విషయాన్ని అంగీకరించాయి.