భారత్‌ మరో విజయం


అంతరిక్ష రంగంలో భారత్‌ మరో విజయం సాధించింది. అత్యాధునిక కార్టోశాట్‌ ఉపగ్రహాన్ని భూకక్ష్యలో ప్రవేశపెట్టింది. ఉపగ్రహ ప్రయోగంలో ఇస్రోకు అనేక విజయాలను అందిస్తున్న పీఎస్‌ఎల్‌వి రాకెట్‌ మన కార్టోశాట్‌ ఉపగ్రహంతోపాటు అమెరికాకు చెందిన మరో 13 ఉపగ్రహాలను కూడా కక్ష్యలో ప్రవేశపెట్టింది. శ్రీహరికోటలోని సతీశ్‌ ధావన్‌ అంతరిక్ష కేంద్రం నుంచి జరిగిన ఈ ప్రయోగం పూర్తిగా విజయవంతమైంది.

గాంధీ బాటలో ఆ గ్రామాలు ...


నగరాలలోనేకాదు గ్రామీణ ప్రాంతాల్లో కూడా పొగాకు, మద్యం అనేక జీవితాలను నాశనం చేస్తున్నాయి. ధూమపానం, మద్యపానాలకు అలవాటైనవారు వ్యక్తిగతంగానేకాక, కుటుంబ పరంగా కూడా ఎంతో నష్టపోతున్నారు. ఇలాంటి అపారమైన నష్టాన్ని కలిగిస్తున్న దురలవాట్లను మాన్పించడానికి కృషిచేస్తున్నారు తమిళనాడుకు చెందిన నాగభూషణ్‌. కృష్ణగిరి జిల్లా నూరున్దుమలై గ్రామాన్ని పూర్తి ధూమపాన, మద్యపాన రహిత మైనదిగా తీర్చిదిద్దడానికి శ్రమిస్తున్నారు. నిజమైన గ్రామ స్వరాజ్యాన్ని సాదించడానికి ప్రజలను ప్రోత్సహిస్తున్నారు.

అమరవాణి


 ముఖం పద్మదళాకారం
 వచశ్చందన శీతలం
 హృత్కర్తరీ సమంచ
 అతివినయం ధూర్తలక్షణం

ప్రముఖుల మాటపార్లమెంట్‌లో మెజారిటీ రావడం వల్లనే 370వ అధికర ణాన్ని తొలగించగలిగాం. ఇప్పుడిక దేశంలో రెండు రాజ్యాంగాలు లేవు. రెండు జెండాలు లేవు. ఉన్నది ఒక్క ప్రధానే.

- రాజ్‌నాధ్‌ సింగ్‌, రక్షణ మంత్రి

ధనుర్మాస విశిష్టత


దక్షిణాయనానికి చివర, ఉత్తరాయణానికి ముందుండే ధనుర్మాసం పవిత్రమైనది. సూర్యుడు ధనస్సురాశి నుంచి మకర రాశిలోకి ప్రవేశించేవరకు అంటే ''భోగి'' రోజు వరకు ధనుర్మాసం కొనసాగు తుంది. ఈ మాసం రోజుల్లో విష్ణు ఆలయాల్లో పండుగ వాతావరణం నెలకొంటుంది. మార్గశిర పౌర్ణమి తర్వాత పాడ్యమి నుంచి వైష్ణవులు ధనుర్మాస వ్రతానికి శ్రీకారం చుడతారు. గోదాదేవి ''మార్గళి'' వ్రతం పేరుతో ధనుర్మాసంలో వ్రతాన్ని చేపట్టి శ్రీ మహావిష్ణువును ఆరాధించింది. ధనుర్మాసం నెలరోజులు సాక్షాత్తు భూదేవి అవతారంగా భావించే ''ఆండాళ్‌'' రచించిన దివ్యప్రబంధం ''తిరుప్పావై'' (పవిత్ర వ్రతం) బ్రహ్మ ముహూర్తంలో పఠించినవారు ధైవానుగ్రహాన్ని పొందుతారని శాస్త్రాలు ఘోషిస్తున్నాయి.

భగవద్గీత ప్రాముఖ్యత


ఒకసారి స్వామీ చిన్మయానందతో ఒక భక్తుడు 'స్వామీ నేను రోజూ భగవద్గీత పారాయణ చేస్తున్నాను. అయినా నా జీవితంలో ఏమార్పు రాలేదు ఎందుకని' అని అడిగాడు. అప్పుడు చిన్మయానంద వెంటనే 'భగవద్గీత గుండా నువ్వు వెళుతున్నావు. నీ గుండా భగవద్గీత వెళ్ళాలి' అంటూ సమాధానం చెప్పారు. కేవలం చదువుతూ పోవడంవల్ల చాలా కొద్ది ప్రయోజనమే ఉంటుంది. చదివినదాని గురించి ఆలోచించి, ఆచరణలోకి తేవడానికి ప్రయత్నించినప్పుడే మార్పు వస్తుందని వివరించారు.

సంతోషం ఎక్కడుంది..?


చాలా మంది సంతోషం బయట నుండి వస్తుందని, భౌతికమైన సంపదలతో ఏర్పడుతుందనీ అనుకొంటారు. నిజంగా సంపదకు అనుగుణంగా సంతోషం కలిగినట్లయితే సంపద పెరుగుతున్న కొలదీ అదీ పెరగాలి. అలాగే సంపద ఏమాత్రం లేనివాడి దగ్గర సంతోషం అనేదే ఉండకూడదు. 

వివాదాస్పద ప్రాంతంలోనే రామమందిరం


అయోధ్య కేసులో సర్వోన్నత న్యాయస్థానం చారిత్రాత్మక తీర్పు
అయోధ్య శ్రీరామజన్మభూమి కేసుకు సంబంధించి సర్వోన్నత న్యాయస్థానం చరిత్రాత్మక తీర్పునిచ్చింది. వివాదిత స్థలం హిందువులకు అప్పగిస్తూ, సున్ని వక్ఫ్‌ బోర్డు కోసం అయోధ్యలోనే విడిగా స్థలం కేటాయించింది. నిర్మొహి అఖాడాకు ఆ స్థలంపై ఎలాంటి హక్కు లేదని స్పష్టం చేసింది. అలాగే శ్రీ రామజన్మభూమి స్థలాన్ని మూడుగా విభజించి శ్రీరామ్‌ లలా, సున్నీ బోర్డ్‌, నిర్మొహి అఖాడాలకు పంచాలని గతంలో అల్హబాద్‌ హైకోర్టు ఇచ్చిన తీర్పును కొట్టివేసింది. ఐదుగురు సభ్యులున్న ప్రత్యేక బెంచ్‌ ఏకగ్రీవ నిర్ణయాన్ని ప్రధాన న్యాయమూర్తి రంజన్‌ గొగోయి ప్రకటించారు.

ఖగోళ విజ్ఞానమయం రామాయణం

 
ఆదికవి, రామాయణ కావ్యాన్ని మనకందిం చిన మహర్షి వాల్మీకి గొప్ప ఖగోళవేత్త అని చాలమందికి తెలియదు. ఆయనకు ఖగోళ విజ్ఞానంపై ఉన్న పట్టు రామాయణ కావ్యంలో మనకు స్పష్టంగా కనిపిస్తుంది. రామా యణంలో పేర్కొన్న ఖగోళ విషయాలు, సందర్భాలు నూటికి నూరుపాళ్లు సరైనవని ఆధునిక శాస్త్రవేత్తలు ప్రత్యేకమైన సాఫ్ట్వేర్ ద్వారా తేల్చారు.

హిందువులకు మానవహక్కులు ఉండవా?

 
అమెరికాలో జరిగిన మానవహక్కుల కమిషన్సమావేశంలో పాల్గొన్న సునందా వశిష్ట్అనే పత్రికా రచయిత, సామాజిక కార్యకర్త 1990లో కశ్మీరీ హిందువులపై సాగిన దారుణ మారణ కాండ, అత్యాచారాలను ప్రపంచం దృష్టికి తీసుకు వచ్చారు. ''తీవ్రవాదం నన్ను నా ఇంటి నుంచి పూర్తిగా దూరంచేయడమే కాదు, నా మూలాల నుంచి పెకిలించివేసింది'' అంటూ కశ్మీరీ హిందు వుల వేదనను వెలిబుచ్చారు.

ఐఎన్‌ఏ స్మారకాన్ని సందర్శించిన భయ్యాజీ


నేతాజీ సుభాష్‌ చంద్ర బోస్‌ మొట్టమొదటి స్వతంత్ర భారత ప్రభుత్వం ఏర్పరచి 76 సంవత్స రాలు పూర్తయిన  సందర్భంగా రాష్ట్రీయ స్వయం సేవక్‌ సంఘ్‌ సర్‌ కార్యవాహ భయ్యాజీ జోషి, సహ సర్‌ కార్యవాహ కృష్ణ గోపాల్‌లు మణిపూర్‌ లోని ఆజాద్‌ హింద్‌ ఫౌజ్‌ స్మారకాన్ని సందర్శించి నేతాజీకి నివాళులు అర్పించారు.

ఆవు - పర్యావరణం


దేశీయ ఆవు మూత్రం, పేడ మురికి ఏమాత్రం కావు. అవి మురికిని శుద్ధిచేసే శక్తి కలిగినవి. అవి పర్యావరణాన్ని కలుషితం చేయవు. కాలుష్యాన్ని నివారిస్తాయి. చెత్త, వ్యర్ధ పదార్ధాలు, ఆకులు మొదలైన కుప్పలపై పేడ, గోముత్రాలను జల్లితే ఈగలు, దోమలు రాకుండా ఉంటాయి. వాటి ఉత్పత్తి ఆగిపోతుంది. పైగా ఆ చెత్తే సేంద్రీయ ఎరువుగా మారి పంటలకు ఉపయోగపడుతుంది. ఇలాంటి ఎరువులో 1శాతం, గోబర్‌ గ్యాస్‌ ప్లాంట్‌ నుంచి వచ్చే వ్యర్ధం ద్వారా తయారైన ఎరువులో 2శాతం నైట్రోజన్‌ ఉంటుంది.

దేశ ప్రజలంతా సమానమే


బంధుభావం లేకుండా సమరసత పరస్పరం సాధ్యం కాదని  భావించి గ్రామ గ్రామాన కుల పెద్దలను కూర్చోపెట్టి చట్టం ద్వారా కాకుండా సంస్కారాల ద్వారా మాత్రమే సామరస్యం వెల్లి విరుస్తుందని తెలంగాణ ప్రాంత సామాజిక సమరసత వేదిక కన్వీనర్‌ శ్రీ అప్పాల ప్రసాద్‌  తెలియచేశారు. మధ్యలో వచ్చిన ఈ దురాచారాలు మన ధర్మంలో  ప్రారంభం నుండి వున్నట్లు కొందరు చాదస్తులు చెప్పినప్పటికీ, వాటిని ఖండించి ఈ కాలంలో వాటి అవసరాలు లేవని అవి మానవ జాతికి తీరని కళంకంగా భావించి వాటిని నిర్మూలించాలని వక్తలు పిలుపునిచ్చారు.

మార్పు కోసం మరో అడుగు


ఒక మనదేశం తప్ప ప్రపంచ దేశాలన్నీ పితృస్వామ్య దేశాలే. మనదేశంలో భార్యలో కూడా తల్లిని చూడగలం. కానీ విదేశీయులు భార్య అంటే భోగవస్తువు మాత్రమే అనుకుంటారు. మనది మాతృస్వామ్య వ్యవస్థ. చరిత్ర చూసుకుంటే ప్రపంచంలోని ప్రతి సంస్కృతిలోనూ మహిళల్ని అణచివేయడం మనం గమనించవచ్చు. సంఘపరంగా అనేక వివక్షతలను వారు ఎదుర్కుంటారు. కానీ భారత దేశంలో మాత్రం స్త్రీకి సంపూర్ణ రక్షణ, గౌరవం లభిస్తుంది. అదేంటీ దేశంలో మహిళలపై ఎన్ని జరగట్లేదు ఇంకా మనదేశంలో మహిళలకి రక్షణ ఎక్కడుంది అని వాదించేవారూ లేకపోలేదు. కానీ మహిళలపై ఇవాళ జరుగుతున్న అక్రమాలకు కారకులు కుటుంబమూ, సమాజమే.

మొక్కలు ఔషధగుణాలు


మన చుట్టుపక్కల లభించే మొక్కలు, పూవుల వల్ల అనేక వ్యాధులు తగ్గించుకోవచ్చును. కొన్ని పూలను కేవలం వాసన చూడటం వల్ల జబ్బులు నయమవుతాయి.

కమ్యూనిస్ట్‌ గ్రామంలో ఐసిస్‌ తీవ్రవాదులు


కేరళతోపాటు పొరుగు రాష్ట్రాల్లో కూడా తీవ్రవాద దాడులకు పాల్పడటానికి, ప్రముఖ వ్యక్తులను హత్యచేయడానికి కుట్ర పన్నిన ఐసిస్‌ తీవ్రవాదు లకు జాతీయ దర్యాప్తు సంస్థ ప్రత్యేక కోర్ట్‌ 14 సంవత్సరాల కఠిన కారాగార శిక్ష విధించింది. కనకమాల కుట్రగా పేరుపడిన ఈ కేసులో మన్‌ సీద్‌ మెహమూద్‌ ప్రధాన నింది తుడు కాగా అతనితోపాటు మరో ఆరుగురిని కూడా కుట్రదారులుగా కోర్టు దృవీకరించింది.

మరోసారి బయటపడ్డ మిషనరీల మోసాలు


పుస్తకాలు, కరపత్రాలు పంచి, డబ్బు ఆశచూపి మతం మారుస్తున్న క్రైస్తవ మిషనరీలు ఇప్పుడు మరో అడుగు ముందుకు వేసి ఏకంగా 'ధర్మసభ' ద్వారా తమ పని పూర్తిచేయాలని ప్రయత్నిస్తున్నారు. ఉత్తర ప్రదేశ్‌లో ధర్మసభ పేరుతో హిందూ పేర్లు పెట్టుకుని మతమార్పిడికి పాల్పడుతున్న క్రైస్తవ మతప్రచారకులను మావు జిల్లాలోని రాణిపూర్‌ గ్రామంలో పోలీసులు అరెస్ట్‌ చేశారు.

టీటీడీ ఉద్యోగుల మతమార్పిళ్లపై విచారణ
ఇటీవల కాలంలో తిరుమల తిరుపతి దేవస్థానంలో క్రైస్తవ ఉద్యోగుల వ్యవహారం ఒక్కొక్కటిగా బయటపడుతోంది. కొందరు క్రైస్తవ ఉద్యోగులు హిందువులుగా చెప్పుకుని టీటీడీలో పనిచేస్తున్నారు. మరికొందరు హిందూ ఉద్యోగులు దేవస్థానంలో చేరాక క్రైస్తవమతం స్వీకరిస్తున్నారు. ఈ రెండు వ్యవహారాల వెనుక చర్చి కుట్ర ఉందని పేర్కొంటూ లీగల్‌ రైట్స్‌ ప్రొటెక్షన్‌ ఫోరమ్‌ కేంద్ర హోంశాఖ కార్యదర్శిని ఆశ్రయించింది.