మరోసారి బయటపడ్డ మిషనరీల మోసాలు


పుస్తకాలు, కరపత్రాలు పంచి, డబ్బు ఆశచూపి మతం మారుస్తున్న క్రైస్తవ మిషనరీలు ఇప్పుడు మరో అడుగు ముందుకు వేసి ఏకంగా 'ధర్మసభ' ద్వారా తమ పని పూర్తిచేయాలని ప్రయత్నిస్తున్నారు. ఉత్తర ప్రదేశ్‌లో ధర్మసభ పేరుతో హిందూ పేర్లు పెట్టుకుని మతమార్పిడికి పాల్పడుతున్న క్రైస్తవ మతప్రచారకులను మావు జిల్లాలోని రాణిపూర్‌ గ్రామంలో పోలీసులు అరెస్ట్‌ చేశారు.

దీర్ఘకాలిక రోగాలను నయం చేస్తామంటూ వీళ్ళు ప్రజలను మోసం చేస్తున్నారని పోలీసులు కేసు నమోదుచేశారు. క్రైస్తవ మిషనరీల సభకు చాలామంది రొగులొచ్చారు. వారితోపాటు వారి బంధువులూ వచ్చారు. ఇలా వచ్చినవారిని మతంమార్చడం మిషనరీల ప్రణాళిక. హిందువుల పేర్లు పెట్టుకుని ధర్మసభ పేరుతో మతసమావేశం నిర్వహించాలని ప్రయత్నం చేశారు. మతం మారిన తరువాత, పవిత్ర జలం తీసుకున్న తరువాత సర్వ రోగాలు తగ్గిపోతాయని రోగులను నమ్మించారు. దీర్ఘకాలంగా జబ్బులతో బాధపడు తున్నవారంతా ఉపశమనం లభిస్తుందనే ఆశతో అక్కడకు వచ్చారని పోలీసులు అన్నారు.