హిందువులకు మానవహక్కులు ఉండవా?

 
అమెరికాలో జరిగిన మానవహక్కుల కమిషన్సమావేశంలో పాల్గొన్న సునందా వశిష్ట్అనే పత్రికా రచయిత, సామాజిక కార్యకర్త 1990లో కశ్మీరీ హిందువులపై సాగిన దారుణ మారణ కాండ, అత్యాచారాలను ప్రపంచం దృష్టికి తీసుకు వచ్చారు. ''తీవ్రవాదం నన్ను నా ఇంటి నుంచి పూర్తిగా దూరంచేయడమే కాదు, నా మూలాల నుంచి పెకిలించివేసింది'' అంటూ కశ్మీరీ హిందు వుల వేదనను వెలిబుచ్చారు.


ఆనాడు కశ్మీర్హిందువులు అనుభవించిన దారుణాలకు తాను ప్రత్యక్ష సాక్షినని చెప్పిన సునంద కొన్ని సంఘటనలను వివరించారు. 'ఒక స్కూలులో ల్యాబ్అసిస్టెంట్గా పనిచేసిన గారి జోత్యాగ్ను ఎత్తుకుపోయిన ముష్కరులు సామూహిక అత్యా చారం చేయడమేకాక రంపపు మిల్లులో రెండుగా కోసి వధించారు. కాగిన్ఒక యువ కశ్మీరీ హిందూ ఇంజనీర్‌. అతన్ని దుండగులు తరిమినప్పుడు అతను తన ఇంట్లోని అటకపై ఉన్న బియ్యపు డబ్బాలో దాక్కున్నాడు. కానీ ఎంతోకాలంగా అతని కుటుంబంతో కలసిమెలసి జీవిస్తున్న పొరుగువారే అతని ఆచూకీ తీవ్రవాదులకు చెప్పడంతో వాళ్ళు బియ్యం డబ్బాలోని అతనిపై కాల్పులు జరిపి హతమార్చడమేకాక అతని రక్తంతో తడిసిన బియ్యాన్ని బలవంతంగా అతని భార్యతోనే తినిపించారు. తీవ్రవాదులు ఇంతటి ఘోరానికి ఒడిగట్టడానికి కారణం జోత్యాగ్‌, కాగిన్లు హిందువులు కావడమేనని సునంద ఆవేదన వ్యక్తంచేశారు. జోత్యాగ్‌, కాగిన్ కంటే తాను కాస్త అదృష్టవంతురాలిని కావడంతో బతికిబయట పడ్డాను.ఇప్పుడు అమానుషకృత్యాల గురించి చెప్పగలుగుతున్నాను'.

పాశ్చాత్య ప్రపంచం ఐసిస్అకృత్యాలను చూడానికి చాలాకాలం ముందే కశ్మీర్ఛాందసవాద ఇస్లామిక్తీవ్రవాదపు అమానుషత్వాన్ని అనుభవిం చిందని ఆమె అన్నారు. 'నేను, నా కుటుంబం సర్వం కోల్పోయినప్పుడు, అమానుష హింసకు గురైనప్పుడు ప్రపంచం మౌనం వహించింది.  జనవరి 9 కాళరాత్రి 'తమకు హిందూ పురుషులులేని, హిందూ స్త్రీలు మాత్రమే ఉన్న కశ్మీర్కావాలనే' నినాదాలతో కశ్మీర్హోరెత్తినప్పుడు మానవ హక్కుల ఉద్యమకారులు ఎక్కడున్నారు? ఆనాడు ఎందరిదో జీవించే హక్కును కూడా తీవ్రవాదులు కాలరాచినప్పుడు మానవహక్కుల ప్రవర్తకులు ఎక్కడున్నారు? తీవ్రవాదుల చేతిలో పడితే అనుభవించాల్సిన దారుణ అకృత్యాల నుంచి కాపాడడంకోసం రెండు వంటింటి కత్తులు, ఒక తుప్పుపట్టిన గొడ్డలితో అవసరమైతే మమ్మల్ని ప్రపంచం నుంచి విముక్తం చేసేందుకు మా నాయనమ్మ సిద్ధపడినప్పుడు మానవతావాదులు ఎక్కడున్నారు? కాళరాత్రిలో మాకు మూడే మార్గాలున్నాయని తీవ్రవాదులు ప్రకటించారు. పారిపోవడం లేదా మతం మారడం లేదా ప్రాణాలు కోల్పోవడం. రాత్రికిరాత్రి ఇల్లూవాకిళ్ళు వదిలి పారిపోయినవారు బ్రతికిపోయారు. కాస్త ఆలస్యం చేసినవారు ప్రాణాలు కోల్పోయారు. ఈనాటికీ నేను కశ్మీర్లో నా ఇంటికి తిరిగి వెళ్ళే అవకాశం లేదు. ఎలాంటి భయం లేకుండా నా మతాన్ని అనుసరించే స్వేచ్ఛ లేదు. మా ఇంటితో పాటు అనేకమంది కశ్మీరీ హిందువుల ఇళ్ళు ఆక్రమణకు గురయ్యాయి. కొన్ని ఇళ్లను పూర్తిగా తగులబెట్టి, నాశనం చేశారు. మా వేలాది దేవాలయాలను ధ్వంసం చేశారు. హిందూత్వాన్ని, హిందువులను కశ్మీర్నుంచి పూర్తిగా తుడిచిపెట్ట డానికి అన్ని రకాలుగా ప్రయత్నాలు సాగాయి.'  

'కశ్మీర్లో 370 అధికరణం రద్దు గురించి ప్రపంచంలో అనేకమంది గగ్గోలు పెడుతున్నారు. కానీ నిజానికి చర్య అక్కడ మానవహక్కుల పునరుద్ధరణకు ఎంతో ఉపయోగపడుతుంది. త్వరలో అక్కడ పరిస్థితులు పూర్తిగా సాధారణ స్థితికి వస్తాయి. కశ్మీర్లో ఇస్లామిక్తీవ్రవాదానికి విరుగుడు కనుగొనాలి. ఇప్పటివరకు నేనుతప్ప సమావేశంలో మాట్లాడిన ఎవరూ ఇస్లామిక్తీవ్రవాదాన్ని గురించి మాటమాత్రంగానైనా ప్రస్తావించలేదు. ఎందుకని? అది కేవలం నా కల్పనా? కానేకాదు. ఆగస్ట్తరువాత తీవ్రవాదుల దాడిలో ఎంతమంది ప్రాణాలు కోల్పోయారు? భద్రతా దళాలు ఒక్కరినీ కూడా హతమార్చలేదు. కేవలం పాకిస్తాన్ప్రేరిత తీవ్రవాదులే దాడులకు పాల్పడుతున్నారు. విషయాన్ని ఒక్కరుకూడా చెప్పరెందుకని? ద్వంద్వవైఖరి వల్ల ఉపయోగం లేదు. ఇస్లామిక్తీవ్రవాదాన్ని మట్టుపెట్టడంలో ప్రపంచం భారత్కు అండగా నిలవాలి' అని సునందా కోరారు.