అమరవాణి


 ముఖం పద్మదళాకారం
 వచశ్చందన శీతలం
 హృత్కర్తరీ సమంచ
 అతివినయం ధూర్తలక్షణం


భావం : ముఖం పద్మంలా సుందరంగా ఉంటుంది. మాట గంధంలా చల్లగా ఉంటుంది. హృదయం మాత్రం కత్తెరలా కర్కశంగా ఉంటుంది. దుష్టులు అతివినయం ఒలక పోస్తూ మోసం చేస్తారు. కాబట్టి జాగరూకులమై, గతానుభవాలను మరచి పోకుండా మనను మనం కాపాడుకుంటూ సమాజ - దేశ శ్రేయస్సు కాపాడుదాం.