ఐఎన్‌ఏ స్మారకాన్ని సందర్శించిన భయ్యాజీ


నేతాజీ సుభాష్‌ చంద్ర బోస్‌ మొట్టమొదటి స్వతంత్ర భారత ప్రభుత్వం ఏర్పరచి 76 సంవత్స రాలు పూర్తయిన  సందర్భంగా రాష్ట్రీయ స్వయం సేవక్‌ సంఘ్‌ సర్‌ కార్యవాహ భయ్యాజీ జోషి, సహ సర్‌ కార్యవాహ కృష్ణ గోపాల్‌లు మణిపూర్‌ లోని ఆజాద్‌ హింద్‌ ఫౌజ్‌ స్మారకాన్ని సందర్శించి నేతాజీకి నివాళులు అర్పించారు.

ఆజాద్‌ హింద్‌ ఫౌజ్‌ లేదా ఇండియన్‌ నేషనల్‌ ఆర్మీని నేతాజీ సుభాష్‌ చంద్ర బోస్‌ 1943 అక్టోబర్‌, 21న సింగపూర్‌లో స్థాపించారు. అలాగే స్వతంత్ర ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తున్నట్లు కూడా ఆయన ప్రకటించారు. విదేశీగడ్డపైనుంచి చేసిన మొట్ట మొదటి స్వతంత్య్ర ప్రకటన అది. ఆ తరువాత జపాన్‌ సైన్యం సహాయంతో ఆజాద్‌ హింద్‌ ఫౌజ్‌ సైన్యం ఈశాన్య భారతంలోని అనేక ప్రదేశాలను ముందుగా విముక్తం చేసింది. అందులో మణిపూర్‌లోని మొయిరాంగ్‌ కూడా ఉంది. ఆనాటి సంఘటనకు గుర్తుగా ఇక్కడ ఆజాద్‌ హింద్‌ ఫౌజ్‌ స్మారకాన్ని నిర్మించారు.అలాగే హింద్‌ ఫౌజ్‌, నేతాజీల చిత్రాలతో కూడిన ప్రదర్శన కూడా ఏర్పాటుచేశారు. స్మారకాన్ని సందర్శించిన సర్‌ కార్యవాహ భయ్యాజీ, సహ సర్‌ కార్యవాహ కృష్ణగోపాల్‌జీలు నేతాజీకి శ్రద్ధాంజలి ఘటించారు.