మొక్కలు ఔషధగుణాలు


మన చుట్టుపక్కల లభించే మొక్కలు, పూవుల వల్ల అనేక వ్యాధులు తగ్గించుకోవచ్చును. కొన్ని పూలను కేవలం వాసన చూడటం వల్ల జబ్బులు నయమవుతాయి.

ఉల్లిపువ్వు : ఉల్లిపూవ్వు లేదా గడ్డను ముక్కలుగా తరిగి వాసన చూస్తే తేలు, కందిరీగ, జెర్రి విషాలు నశిస్తాయి. దీనికి తోడుగా తాంబూలపు సున్నం, నవాసారము శనగ గింజ అంత ప్రమాణం కలిపి అరచేతిలో నలిపి వాసన చూస్తే  తక్షణమే బాధ తగ్గుతుంది. జలుబు, తలభారం, దంతశూల, నేత్రశూల కూడా తగ్గుతాయి.

వెల్లుల్లి : దీనిలో సల్ఫర్‌ ఆక్సయిడ్‌, సల్ఫర్‌ అయొడిన్‌, గార్చిసిన్‌ మొదలైన రసాయనాలు, A, B1, B2 విటమిన్లు ఉంటాయి. ఇది చాలా ఘాటైన వాసన కలిగినది. అయితే అంతకంటే ఎక్కువ రెట్లు మేలు చేస్తుంది.

దీనిని దంచి లేదా నలిపి వాసన చూస్తే యెడల తలభారము, జలుబు, మూర్చ వలన కలిగే పోటు, నేత్రశూల నివారణ అవుతాయి. తులసి ఆకులు అల్లముతో కలిపి ముక్కులో పిండిన మూర్చరోగులకు విశేష ఉపశమనం కలుగుతుంది. దీనిని తింటే క్రిమిరోగం, ఉదరశూల, గ్యాస్‌, కీళ్ళపట్లు, ఆస్తమా, రక్తపోటు నివారణ అవుతాయి.