సంతోషం ఎక్కడుంది..?


చాలా మంది సంతోషం బయట నుండి వస్తుందని, భౌతికమైన సంపదలతో ఏర్పడుతుందనీ అనుకొంటారు. నిజంగా సంపదకు అనుగుణంగా సంతోషం కలిగినట్లయితే సంపద పెరుగుతున్న కొలదీ అదీ పెరగాలి. అలాగే సంపద ఏమాత్రం లేనివాడి దగ్గర సంతోషం అనేదే ఉండకూడదు. 
కానీ నిజంగా అలా జరగదు కదా! మనిషి ఏ సంపదనీ అనుభవించని, కనీసం శరీర స్పృహ కూడా లేని నిద్రావస్థలో చాలా సంతోషంగా ఉంటాడు. అలాంటి స్థితి కోసమే తనకు గాఢంగా నిద్రపట్టాలని కోరుకొంటాడు. దీనినిబట్టి సంతోషం మనిషి అంతరంగంలోనే ఉందని తెలుస్తోంది కదా! మనల్ని మనం తెలుసుకొన్నరోజున అలాంటి స్వచ్చమైన సంతోషాన్ని పొందగలుగుతాము.

- భగవాన్‌ శ్రీరమణ మహర్షి