ప్రముఖుల మాటపార్లమెంట్‌లో మెజారిటీ రావడం వల్లనే 370వ అధికర ణాన్ని తొలగించగలిగాం. ఇప్పుడిక దేశంలో రెండు రాజ్యాంగాలు లేవు. రెండు జెండాలు లేవు. ఉన్నది ఒక్క ప్రధానే.

- రాజ్‌నాధ్‌ సింగ్‌, రక్షణ మంత్రివిద్యుత్‌ సబ్సిడీ, ఉచిత నీరు, ఉపాధి హామీ పథకం వంటి పథకాల వల్ల గ్రామీణ ప్రజల్లో సృజనాత్మకత పోతోంది.  ఉచితంగా వస్తున్న దానితో తృప్తిపడుతూ ఆలోచించే శక్తిని, పనిచేసే ధోరణిని కోల్పోతున్నారు.

- డా. పి.ఎస్‌. గోయెల్‌, నేషనల్‌ ఇన్నోవేషన్‌ ఫౌండేషన్‌ ఛైర్మన్‌ 
తెలుగు, ఇంగ్లీష్‌ మీడియంలు ముఖ్యం కాదు. విలువలతో కూడిన విద్య ఉన్నదా, లేదా అన్నదే ముఖ్యం. అలాంటి విద్య లేనందువల్లనే అనేక ఘోరాలు జరుగుతున్నాయి, ప్రభుత్వ కార్యాల యాల్లో తెలుగు భాష లేకపోవడంవల్లనే తెలుగు అంతరించిపోతోంది.

- రంగరాజన్‌, చిలుకూరు బాలాజీ ఆలయ ప్రధాన అర్చకులు