గాంధీ బాటలో ఆ గ్రామాలు ...


నగరాలలోనేకాదు గ్రామీణ ప్రాంతాల్లో కూడా పొగాకు, మద్యం అనేక జీవితాలను నాశనం చేస్తున్నాయి. ధూమపానం, మద్యపానాలకు అలవాటైనవారు వ్యక్తిగతంగానేకాక, కుటుంబ పరంగా కూడా ఎంతో నష్టపోతున్నారు. ఇలాంటి అపారమైన నష్టాన్ని కలిగిస్తున్న దురలవాట్లను మాన్పించడానికి కృషిచేస్తున్నారు తమిళనాడుకు చెందిన నాగభూషణ్‌. కృష్ణగిరి జిల్లా నూరున్దుమలై గ్రామాన్ని పూర్తి ధూమపాన, మద్యపాన రహిత మైనదిగా తీర్చిదిద్దడానికి శ్రమిస్తున్నారు. నిజమైన గ్రామ స్వరాజ్యాన్ని సాదించడానికి ప్రజలను ప్రోత్సహిస్తున్నారు.

మద్యపాన నిషేధం అమలు చేయాలని మహాత్మా గాంధీ గట్టిగా కోరుకు న్నారు. మద్యపాన దురలవాటు మూలంగా డబ్బు నష్టపోవడమేకాక వివేకాన్ని కూడా కోల్పోతారని, విచ్చలవిడిగా తయారవుతారని ఆయన హెచ్చరించారు. నష్టాల నుంచి నూరున్దుమలై గ్రామస్తులను కాపాడాలని నాగభూషణ్నిర్ణయించుకున్నారు.

బెంగళూరులో ఒక ప్రముఖ కంప్యూటర్సంస్థలో పనిచేస్తూనే నాగభూషణ్గత రెండు దశాబ్దాల కాలంలో తాను అనుకున్న కార్యాన్ని సాదించగలిగారు. ప్రతి వారాంతంలో గ్రామానికి వచ్చే నాగభూషణ్గ్రామాలలో మంచి మార్పును తీసుకురాగలిగారు. మనసు ఉంటే మార్గం ఉంటుం దన్నట్లుగా తన ఉద్యోగం చేసుకుంటూనే ఇంత మార్పును తీసుకురాగలిగిన నాగభూషణ్యువతకు ఆదర్శంగా నిలుస్తున్నారు. 

సోషల్వర్క్లో పోస్ట్గ్రాడ్యుయేషన్పూర్తిచేసి 23 ఏట తన తాతముత్తాతల గ్రామానికి వచ్చిన నాగభూషణ్కు అక్కడ దారుణమైన పేదరికంతో పాటు మద్యపానం వంటి లోపాలు కూడా కనిపించాయి. సంపాదించుకున్న కాస్త సొమ్మును మద్యం, సిగరెట్లపై ఖర్చు చేస్తున్న వారి సంఖ్యే ఎక్కువగా కనిపించింది. దీనితో కుటుంబాలలో దారుణమైన పరిస్థితులు నెలకొన్నాయి. పోషకా హారం లేక పిల్లలు, పెద్దలు కూడా అనారోగ్యాల పాలయ్యారు.

ఇలాంటి పరిస్థితుల్లో చెడు అలవాట్లను మానండని ఊరికే చెపేతే గ్రామంలో ఎవరు వినరు. అందుకని గ్రామస్తులకు నచ్చచెప్పడానికి నాగభూషణ్మరో మార్గం ఎంచుకున్నారు. మొదట స్థానిక పాఠశాలలో పిల్లలకు ఉచితంగా పాఠాలు చెప్పడం మొదలుపెట్టారు. అలాగే గ్రామంలో జరిగే వివిధ కార్యక్రమాల్లో పాలుపంచుకున్నారు. దీని మూలంగా గ్రామస్తులలో ఆయన పట్ల ఆదరణ, గౌరవం కలిగాయి. తరువాత క్రమంగా గ్రామస్తుల సమావేశాలు నిర్వహించడం ప్రారంభించారు. అందులో గ్రామానికి సంబంధించిన వివిధ విషయాలతోపాటు మద్యపానం, పొగతాగడం వంటివి కూడా ప్రస్తావించారు. వాటివల్ల కలిగే నష్టాలను తెలియజెప్పి, వాటినుంచి బయటపడాలనే ఆలోచన గ్రామస్తుల్లో కలిగించారు. గ్రామంలోనే కాక పక్కన ఉన్న గ్రామాల్లో కూడా పాఠశాల భవనాలను ప్రభుత్వ సహాయంతో బాగు చేయించారు.

తల్లిదండ్రులు మద్యానికి బానిసలవడం వల్ల స్వయంగా చిన్నప్పుడు ఎన్నో ఇబ్బందులు, కష్టాలు అనుభవించిన యువకులు ముందుకువచ్చి నాగభూషణ్కు సహకరించడం ప్రారంభించారు. అంతా కలిసి పొగాకు, మద్య రహిత సంఘాన్ని స్థాపించారు. మద్యం ముట్టుకోని వారిని సత్కరించడం ద్వారా తాగుడుకు స్వస్తి చెప్పేట్లుగా ఇతరులను ప్రోత్సహించారు. అయితే మద్యం, సిగరెట్వ్యాపారంతో బాగా డబ్బు సంపాదిస్తున్న వారు మాత్రం సంఘాన్ని వ్యతిరేకించారు. అందులో సభ్యులను బెదిరించారు. కానీ గ్రామస్తుల మద్దతుతో నాగభూషణ్‌, ఇతర యువకులు గట్టిగా నిలబడ్డారు. వీరి ప్రయత్నాల మూలంగా నూరున్దుమలై గ్రామం మద్య, పొగాకు రహిత గ్రామంగా అవతరించింది.

గ్రామస్తులతో మద్యం, పొగాకు అలవాటు మాన్పించడం ఒక పనైతే వాళ్ళు మళ్ళీ దురల్వాటు బారిన పడకుండా చూడటం మరింత పెద్ద పని. అందుకనే నాగభూషణ్‌ 'నామనం' పేరుతో కౌన్సిలింగ్‌, పునరావాస కేంద్రాన్ని ప్రారంభించారు. నూరున్దుమలైకి ఆరు కిలోమీటర్ల దూరంలో ఉన్న ఉరిగాంలో కేంద్రాన్ని ప్రారంభించి చుట్టుపక్కల అన్నీ గ్రామాలలో మధ్య వ్యతిరేక ప్రచారం మొదలుపెట్టారు.

కార్యకలాపాలను సాగించడం కోసం నామనం సంస్థ హెర్బల్ఉత్పత్తుల విక్రయం ద్వారా నిదులు సమకూర్చుకుంటోంది. ఉత్పత్తులను తయారుచేసే కేంద్రాల్లో పునరావాస కేంద్రానికి వచ్చినవారికి పని కల్పిస్తున్నారు. ఇలా కౌన్సిలింగ్‌, పునరావాసంతోపాటు ఉపాధి కూడా చూపు తుండటంతో పని వేగంగా ముందుగా సాగింది. ఇప్పటికీ వెయ్యి మందికి పైగా యువకులు మద్యానికి స్వస్తి చెప్పి ఉపాధి పొందారు. నామనం సంస్థ పిల్లలకు మెరుగైన పాఠశాల వసతులు కల్పిస్తోంది. పాఠశాల భవనాలను చక్కగా నిర్వహిస్తోంది.