కమ్యూనిస్ట్‌ గ్రామంలో ఐసిస్‌ తీవ్రవాదులు


కేరళతోపాటు పొరుగు రాష్ట్రాల్లో కూడా తీవ్రవాద దాడులకు పాల్పడటానికి, ప్రముఖ వ్యక్తులను హత్యచేయడానికి కుట్ర పన్నిన ఐసిస్‌ తీవ్రవాదు లకు జాతీయ దర్యాప్తు సంస్థ ప్రత్యేక కోర్ట్‌ 14 సంవత్సరాల కఠిన కారాగార శిక్ష విధించింది. కనకమాల కుట్రగా పేరుపడిన ఈ కేసులో మన్‌ సీద్‌ మెహమూద్‌ ప్రధాన నింది తుడు కాగా అతనితోపాటు మరో ఆరుగురిని కూడా కుట్రదారులుగా కోర్టు దృవీకరించింది.

కేరళ రాష్ట్రంలోని కన్నూర్‌ జిల్లాలో కనకమల ఐసిస్‌ తీవ్రవాదులకు స్థావరంగా మారిందని ఎన్‌ఐఏ పసిగట్టింది. ఇది కమ్యూనిస్ట్‌ పార్టీ కంచుకోట అయిన గ్రామంలో ఉంది. ఇక్కడ ఇతర పార్టీల కార్యకలాపాలు ఏవి సాగవు.  ఇలాంటి కమ్యూనిస్ట్‌ గ్రామంలో చేరిన ఐసిస్‌ తీవ్రవాదులు భారీ హింసకు కుట్ర పన్నారు. న్యాయమూర్తులు, పోలీస్‌ అధికారులు, రాజకీయ నాయకుల వంటి ప్రముఖ వ్యక్తులతోపాటు విదేశీ పర్యటకులను కూడా హత్య చేయడానికి పధకం రచించారు. ఈ కుట్రను 2016లో కనిపెట్టిన ఎన్‌ఐఏ ఆరుగురిని అదుపులోకి తీసుకుంది. వీరిపై ఆరోపణలను విచారించిన కోర్ట్‌ కఠిన కారాగార శిక్ష విధించింది.