భరతమాత జయంకోరి...


జనవరి 26వ తేదీన దేశమంతా అధికారి కంగా గణతంత్ర దినోత్సవంగా జరుపుకుంటాము. దీనివెనుక ఒక చరిత్ర ఉంది. 1929లో జరిగిన కాంగ్రెస్‌ సమావేశాలలో ఒక సంవత్సరంలో ''సంపూర్ణ స్వరాజ్యం'' అని పిలుపునిచ్చారు. కాని 1930లో స్వరాజ్యం రాలేదు. కాని దేశమంతా తమ ఆకాంక్షను, దీక్షను వెల్లడి చేస్తూ 1930 జనవరి 26న సాతంత్య్ర దినోత్సవం జరిపారు నాటి స్వాతంత్య్ర సమరయోధులు. స్వతంత్రం ఆగస్టు 15న వచ్చింది.  మన రాజ్యాంగాన్ని అమలులోకి తేవడానికి నాటి దేశభక్తుల పోరాటాన్ని గుర్తు చేసుకుంటూ జనవరి 26న మన దేశాన్ని గణతంత్ర రాజ్యంగా ప్రకటించు కున్నారు.

అదొక ఆదర్శ గ్రామం

ఒకప్పుడు అది వెనుకబడిన గ్రామం. అనేక సమస్యలతో సతమతమైంది. కానీ ప్రజల పట్టుదలతో ఇప్పుడు ఆ గ్రామం ఆ సమస్యలన్నింటి నుంచి బయటపడింది. అక్కడ రైతులు అధునాతన నీటి పారుదల పద్దతులను ఉపయోగిస్తున్నారు. అక్కడ మురికి కాలువలు, అనారోగ్యకరమైన పరిస్థితులు కనిపించవు. ప్రతి ఇంటిలో మురుగునీటి గుంతలతో పాటు శౌచాలయాలు ఉన్నాయి. గ్రామంలో ఎక్కడ చూసిన మామిడి, జామ, వేప మొదలైన చెట్లతో పాటు తులసి వంటి ఔషధ మొక్కలు కనిపిస్తాయి. ఆ గ్రామం 100 శాతం అక్షరాస్యత సాధించింది. ఉత్తర్‌ప్రదేశ్‌ రాష్ట్రంలోనే అత్యంత అభివృద్ధి సాధించినదిగా పేరుపడిన ఆ గ్రామం పేరు రవీంద్రనగర్‌. లక్ష్మీపూర్‌ ఖిరి జిల్లాలోని ఈ గ్రామం గురుదేవ్‌ రవీంద్రనాథ్‌ ఠాగూర్‌ జన్మ శతాబ్దినాడు ఏర్పడింది కాబట్టి దానికి ఆ పేరు పెట్టుకున్నారు.

సకల విద్యాస్వరూపిణి సరస్వతీదేవి


(జనవరి 29 వసంత పంచమి సందర్భంగా)

సకల విద్యాస్వరూపిణి సరస్వతీదేవి జన్మదిన మైన వసంత పంచమిని విద్యారంభదినమని, వాగ్డేవిని ఆరాధించి అక్షరాభ్యాసం చేయాలని బ్రహ్మ వైవర్త పురాణం తెలియజేస్తుంది. వసంత ఋతువు రాకను సూచించే ఈ రోజును శ్రీపంచమి అనే పేరుతో కూడా పిలుస్తారు. శాంతమూర్తియైన సరస్వతీదేవి వీణ, పుస్తకం, జపమాల, అభయ ముద్రలను ధరించి ఉంటుంది. ఈ రూపం విద్యా, విజ్ఞాన, బుద్ధులకు ప్రతీక. సరస్వతీ దేవి కరుణతోటే విద్యాప్రాప్తి, జ్ఞాన ప్రాప్తి కలుగుతుందని శాస్త్రోక్తి.

ఏపనీ తక్కువకాదు (స్ఫూర్తి)


భూదాన ఉద్యమాన్ని చేపట్టి కొన్ని లక్షల ఎకరాల భూమిని సేకరించిన వినోబా భావే దేశమంతా పర్యటించేవారు. ఒకసారి ఒక మారుమూల గ్రామానికి వెళ్ళినప్పుడు అక్కడ ఉన్న పాఠశాల లోపల, చుట్టుపక్కల అశుభ్రంగా, మురికిగా ఉండడం గమనించారు. అదే విషయాన్ని విద్యార్థుల ముందు ప్రస్తావించారు. పాఠశాలను శుభ్రం చేసుకోవచ్చును కదా అని సూచించారు.

లోపాలపైకాదు మంచి విషయాలపై దృష్టిపెట్టాలి (హితవచనం)


ఒక దేశపు స్వరూప స్వభావాలను వర్ణించి చెప్పడానికి ఉదాహరణగా తీసుకోవలసింది అక్కడక్కడా పేరుకు పోయిన  మురికిని కాదు. ఈ లోకంలో ఎవడైనా ఒక మామిడి చెట్టు దగ్గరకు వెళ్లి కుళ్లిపోయిన, పురుగులతో పుచ్చిన మామిడి పండ్లను ఏరుకుని వచ్చి ఒక్కొక్కదాని మీద ఒక్కొక్క పుస్తకం వ్రాయవచ్చు.

అమరవాణి


అన్యస్య దోషం పశ్యతి
సుసూక్ష్మమపి తత్పరాః
స్వనేత్రమివ నేక్షంతే
స్వదోషం మలినా జనాః
               - శ్రీమద్‌ రామాయణం


భావం :
దుర్జనులు ఇతరుల చిన్న తప్పును కూడా గుర్తిస్తారు, ఎంచుతారు. తమ కంటిని తాము చూసుకోలేనట్లుగా తమ తప్పులను మాత్రం తెలుసుకోలేరు.

ప్రముఖుల మాటబంగ్లాదేశ్‌, పాకిస్తాన్‌లలో వేధింపులకు గురవుతున్న హిందువులు ఎక్కడికి వెళ్ళాలి? ముస్లింలకు ఎన్నో దేశాలు ఉన్నాయి. హిందువులకున్నది భారతదేశం ఒక్కటే.        

- స్వామి విశ్వేశ తీర్థ,  ఉడిపి పెజావర్‌ పీఠాధిపతి

అయోధ్య తీర్పుపై రివ్యూ పిటిషన్లు కొట్టివేసిన సుప్రీంకోర్టు


నవంబర్‌ 9న వెలువడిన అయోధ్య తీర్పును సమీక్షించాలంటూ దాఖలైన అన్ని రివ్యూ పిటిషన్లను సుప్రీం కోర్ట్‌ కొట్టివేసింది.

నవంబర్‌ 9న, 2.77 ఎకరాల వివాదాస్పద భూమిని రామ మందిర నిర్మాణానికి వీలుగా రామ్‌ లల్లాకు కేటాయించాలని సుప్రీం కోర్ట్‌ తీర్పు ఇచ్చింది. మసీదు నిర్మాణం కోసం ఐదెకరాల భూమిని సున్నీ వక్ఫ్‌ బోర్డుకు కేటాయించాలని కేంద్రాన్ని ఆదేశించింది. అయితే ఈ తీర్పును సమీక్షించా లంటూ.. డిసెంబర్‌ 2న సుప్రీంలో తొలి రివ్యూ పిటిషన్‌ దాఖలైంది.

'సర్వజన హితమే హిందుత్వం'


''సంఘ్కోరుకునేది ధర్మవిజయం. ధర్మ విజయమంటే సాత్విక శక్తుల జయం. అది అందరి శ్రేయస్సును, ఉన్నతిని సాధిస్తుంది. ఇలాంటి విజయాన్ని సాధించడం కోసం స్వయంసేవకులు తీసుకున్న సంకల్పమే విజయ సంకల్పం'' అని రాష్ట్రీయ స్వయంసేవక్సంఘ్సర్సంఘచాలక్డా. మోహన్భాగవత్అన్నారు. ఇబ్రహీంపట్నంలో జరిగిన మూడురోజుల విజయసంకల్ప శిబిరంలో భాగంగా రెండవ రోజు సరూర్నగర్ఇండోర్స్టేడియంలో జరిగిన సార్వజనిక సభలో ఆయన మాట్లాడారు.

పౌరసత్వ సవరణ చట్టం - వాస్తవాలు


పౌరసత్వ సవరణ చట్టం గురించి ఇప్పుడు సర్వత్ర చర్చ జరుగుతోంది. పాకిస్థాన్‌, బంగ్లాదేశ్‌, ఆఫ్గనిస్థాన్‌లలోని మైనారిటీలకు భారత పౌరసత్వం ఇచ్చే ఈ చట్టం ఎందుకు? ఏమిటి?

సంస్కార కేంద్రాలు విద్యాభారతి పాఠశాలలు : డా.మోహన్‌ భాగవత్‌


విద్యాభారతి విద్యాసంస్థల్లో సంస్కారం నేర్పిస్తారని ఆర్ఎస్ఎస్సర్సంఘచాలక్డా. మోహన్భాగవత్అన్నారు. హైదరాబాద్బండ్లగూడలో జరిగిన పూర్వ విద్యార్థుల సమ్మేళనంలో ఆయన పాల్గొన్నారు. సందర్భంగా మాట్లాడుతూ.. మంచి మనస్సుతో సమర్థవంతంగా చేసే పనైనా దేశ సేవ కిందకే వస్తుందన్నారు. ఎవరికి ఆసక్తి ఉన్న రంగం వారు ఎంచుకొని వృత్తిలో రాణించాలని ఆయన కోరారు. దేశంలోని 130 కోట్ల మందిలో 30 కోట్ల మంది సేవ చేసినా దేశం ఉన్నతంగా ఉంటుందని పేర్కొన్నారు. పిల్లలకు ఇంట్లోనే మన సంస్కృతి, సంప్రదాయాలను బోధించాలని.. వారితో మాతృభాషలోనే మాట్లాడా లని తల్లిదండ్రులకు సూచించారు.

బంజరును 'బంగారం'గా మార్చే అమృత్‌ మిట్టి


 బంజరు భూమిని బంగారంగా మార్చే ప్రక్రియను కనిపెట్టింది ఉత్తర్ప్రదేశ్కు చెందిన అల్కా లహొటి. బిజ్నూర్కు చెందిన అల్కాకు నాగినా గ్రామంలో పెద్ద గోశాల ఉంది. అక్కడి గోవుల మూత్రం, పేడ ఉపయోగించి భూమిని సారవంతం చేసే ప్రత్యేకమైన 'అమృత్మిట్టి'ని తయారుచేసింది అల్కా. అమృత్మిట్టి నిస్సారమైన నేలను కూడా సారవంతంగా తయారు చేస్తుందని ఆమె అంటోంది. 

పారిశుధ్య కార్మికులకు సన్మానంసామాజిక సమరసత వేదిక ఆధ్వర్యంలో తెలంగాణలోని పాలమూరు, ఆదిలాబాద్‌, నిజామా బాద్‌ కరినగర్‌, మెదక్‌, ఖమ్మం, రాజన్న సిరిసిల్ల జిల్లాల్లో పురపాలిక పారిశుద్ధ్య కార్మికులకు ఆత్మీయ గౌరవ సన్మాన కార్యక్రమం నిర్వహించారు. మహాత్మాగాంధీ 150వ జయంతి, గురునానక్‌ దేవ్‌ 550వ జయంతి, దత్తోపంత్‌ ఠేంగ్డీజీ శతజయంతి, డా. అంబ్కేర్‌ 63వ వర్ధంతి సందర్భంగా నిర్వహించిన ఈ కార్యక్రమాల్లో ఆయా నగరాల్లోని పురపాలికల్లో పనిచేస్తున్న పారిశుద్ధ్య కార్మికులను సన్మానించారు. కరినగర్‌లో జిల్లా సంయుక్త పరిపాలనాధికారి శ్యాంప్రసాద్‌ లాల్‌ పాల్గొన్నారు.

సంస్కారమే సంక్రాంతి


సూర్యుడు మకరరాశిలో ప్రవేశించటాన్ని మకర సంక్రమణం అంటాం. క్రమంతప్పకుండా ప్రతి సంవత్సరం ఇదే సమయంలో జరుగుతుంది కాబట్టి సంక్రాంతి(సమమైన మార్పు) అనీ, మకర రాశికి సూర్యుని గమనం మారుతుందికాబట్టి మకర సంక్రాంతి అని వ్యవహరిస్తారు. మనకిది ఎంతో పెద్ద పండుగ.

చర్మసంరక్షణ మూలికా యోగాలు


  చందనము, అగరు, వట్టివేరు మూడింటిని సమానంగా తీసుకుని పాలు లేక పన్నీరు కలిపి లేపనంగా తయారుచేసుకుని ముఖమునకు పట్టించి కొంత సమయం తరువాత శుభ్రపరుచు కొనుచున్న ముఖ వర్చస్సు పెరుగుతుంది.

  చందనం, కుంకుమపువ్వు, కస్తూరి కలిపిన మిశ్రమాన్ని ముఖమునకు లేపనం చేయుచున్న ముఖవర్చస్సు పెరుగును.

ఢిల్లీ: ఇస్లామియా యూనివర్సిటీ ఆందోళనల వెనుక కుట్ర


పౌరసత్వ సవరణ చట్టానికి వ్యతిరేకంగా దేశ రాజధానిలో రెండు రోజుల పాటు సాగిన హింసాత్మక ఘటనల్లో ప్రమేయం ఉన్న ప్రధాన నిందితులపై ఢిల్లీ పోలీసులు దృష్టి సారించారు.

అక్రమ గుర్తింపు కార్డులు కలిగిన రోహింగ్యా ముస్లిం రిమాండ్‌


అక్రమంగా గుర్తింపు కార్డులను తీసుకున్న ఓ వ్యక్తిని రిమాండ్‌కు తరలించిన ఘటన బాలాపూర్‌ పోలీస్‌ స్టేషన్‌ పరిధిలో చోటు చేసుకుంది.