అక్రమ గుర్తింపు కార్డులు కలిగిన రోహింగ్యా ముస్లిం రిమాండ్‌


అక్రమంగా గుర్తింపు కార్డులను తీసుకున్న ఓ వ్యక్తిని రిమాండ్‌కు తరలించిన ఘటన బాలాపూర్‌ పోలీస్‌ స్టేషన్‌ పరిధిలో చోటు చేసుకుంది. 
ఎస్‌.ఐ డి. మధు తెలిపిన వివరాల ప్రకారం.. మహమ్మద్‌ షకీల్‌ (22) అనే వ్యక్తి బర్మా నుంచి 2015లో ఇండియాకు వచ్చి బాలాపూర్‌ మండల పరిధిలోని రాయల్‌ కాలనీలో నివాసం ఉంటున్నాడు. అక్రమంగా ఇండియన్‌ గుర్తింపు కార్డులైన ఆధార్‌, ఓటర్‌, పాన్‌కార్డులను కలిగి ఉన్నాడు. విశ్వసనీయ సమాచారం మేరకు పోలీసులు షకీల్‌ను అరెస్ట్‌ చేసి, గుర్తింపు కార్డులను స్వాధీనం చేసుకొని రిమాండ్‌కు తరలించారు.