ఢిల్లీ: ఇస్లామియా యూనివర్సిటీ ఆందోళనల వెనుక కుట్ర


పౌరసత్వ సవరణ చట్టానికి వ్యతిరేకంగా దేశ రాజధానిలో రెండు రోజుల పాటు సాగిన హింసాత్మక ఘటనల్లో ప్రమేయం ఉన్న ప్రధాన నిందితులపై ఢిల్లీ పోలీసులు దృష్టి సారించారు.


హింసాత్మక ఘటనలకు పాల్పడినవారు వాట్సాప్గ్రూపుల ద్వారా వీటికి పధక రచన చేశారు. ఢిల్లీ పోలీసు వర్గాల సమాచారం ప్రకారం హింసాత్మక ఘటనలు ఒక ప్రణాళికాబద్ధమైన కుట్ర ద్వారా జరిపినవి. ఆందోళనకారులు తమ ందాలకు పెట్రోల్బాంబులు తీసుకుని ఘటనా స్థలాలకు రావాల్సిందిగా వాట్సాప్గ్రూపులలో సూచించారు. అంతేకాకుండా ఒకవేళ ఘర్షణలు తలెత్తే పక్షంలో భాష్పవాయువు ప్రయోగించి నట్లయితే సులభంగా తప్పించుకునేందుకు వీలుగా తడిపిన దుప్పట్లు తీసుకురావాల్సిందిగా ఆందోళన కారులు తమ బృందాలకు సూచించారు. కట్టుదిట్టమైన పోలీస్పహారా ఛేదించి ఘటనలకు పాల్పడే విధంగా ప్రణాళిక రూపొందిం చారు. కుట్ర తీరుతెన్నులు జమ్మూకశ్మీర్అల్లర్ల సమయంలో అమలు చేసిన కుట్రను పోలి ఉన్నాయని పోలీసు వర్గాల సమాచారం.

పౌరసత్వ సవరణ చట్టం వ్యతిరేక ప్రదర్శనల పేరిట ఢిల్లీ జామియా మిలియా ఇస్లామియా విశ్వవిద్యాలయం వద్ద జరిగిన హింసాత్మక ఘటనలకు సంబంధించి 10 మందిని పోలీసులు అరెస్ట్చేశారు. ఘటన ద్వారా ప్రేరేపితమైన ఆందోళన దేశంలోని మరికొన్ని యూనివర్సిటీ కాంపస్లకు పాకింది. పౌరసత్వ సవరణ చట్టాన్ని రద్దు చేయాలని, పోలీసు అరాచకత్వంపై విచారణ జరపాలంటూ కొన్ని రాజకీయ పార్టీల అనుబంధ విద్యార్థి సంఘాల నాయకులు డిమాండ్చేసిన నేపధ్యంలో  ఢిల్లీ అల్లర్ల ప్రమేయంతో అదుపులోకి తీసుకున్న 10 మంది  అసలు విద్యార్థులే కాదన్న విషయం పోలీసులు బయటపెట్టారు. పదిమంది కరుడుగట్టిన నేరచరిత్ర కలిగిన వారని పోలీసులు స్పష్టం చేయగా, అందులో ముగ్గురు మరింత క్రూర స్వభావం కలిగిన వ్యక్తులుగా గుర్తించారు. ఘటనలో తాము విద్యార్థులెవరినీ అరెస్ట్చేయలేదన్న విషయాన్నీ పోలీసులు స్పష్టం చేశారు. సిసిటివి ఫుటేజీల ఆధారంగా పదిమంది నేరస్థులను గుర్తించి అరెస్ట్చేసినట్టు తెలిపారు.