సంస్కార కేంద్రాలు విద్యాభారతి పాఠశాలలు : డా.మోహన్‌ భాగవత్‌


విద్యాభారతి విద్యాసంస్థల్లో సంస్కారం నేర్పిస్తారని ఆర్ఎస్ఎస్సర్సంఘచాలక్డా. మోహన్భాగవత్అన్నారు. హైదరాబాద్బండ్లగూడలో జరిగిన పూర్వ విద్యార్థుల సమ్మేళనంలో ఆయన పాల్గొన్నారు. సందర్భంగా మాట్లాడుతూ.. మంచి మనస్సుతో సమర్థవంతంగా చేసే పనైనా దేశ సేవ కిందకే వస్తుందన్నారు. ఎవరికి ఆసక్తి ఉన్న రంగం వారు ఎంచుకొని వృత్తిలో రాణించాలని ఆయన కోరారు. దేశంలోని 130 కోట్ల మందిలో 30 కోట్ల మంది సేవ చేసినా దేశం ఉన్నతంగా ఉంటుందని పేర్కొన్నారు. పిల్లలకు ఇంట్లోనే మన సంస్కృతి, సంప్రదాయాలను బోధించాలని.. వారితో మాతృభాషలోనే మాట్లాడా లని తల్లిదండ్రులకు సూచించారు.


 నాణ్యమైన విద్యతో సమాజం అభివృద్ధి చెందుతుందన్నారు. మనిషి ఆలోచనలకు మార్గం చూపించే శిక్షణ కావాలన్నారు.  స్వార్థం, ఈర్ష్య వంటి వాటిని వీడి దయ, కరుణను అలవర్చు కోవాలని డా. మోహన్భాగవత్చెప్పారు.

కార్యక్రమంలో పాల్గొన్న కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి కిషన్రెడ్డి మాట్లాడుతూ.. మన సంస్కృతి ప్రపంచదేశాలలో చాటాల్సిన అవసరం ఉందన్నారు. సరస్వతి విదాపీఠం ఇందుకు ఎంతగానో పాటుపడుతోందని కొనియాడారు.



అనంతరం సరస్వతి విద్యా పీఠం ఆధ్వర్యంలో రాబోయే విద్యా సంవత్సరం నుంచి ప్రారంభించ నున్న శ్రీ విద్యారణ్య ఇంటర్నేషనల్స్కూల్భవనానికి శంకుస్థాపన చేశారు. కార్యక్రమంలో ఎంపీ బండి సంజయ్‌, విద్యాభారతి అధ్యక్షుడు రామకృష్ణా రావు, దక్షిణ మధ్య క్షేత్ర విద్యా భారతి అధ్యక్షుడు ఉమామహేశ్వరరావు, సంఘటన కార్యదర్శి సుధాకర్రెడ్డి, పారిశ్రామికవేత్త ఎంఎస్ఆర్వీ ప్రసాద్‌, సేవికా సమితి ప్రధాన కార్యదర్శి అన్నదానం సీత తదితరులు పాల్గొన్నారు.

పూర్వ విద్యార్థి సమ్మేళనం రికార్డులు..

సరస్వతి విద్యాపీఠం రాష్ట్రస్థాయి పూర్వ విద్యార్థి మహా సమ్మేళనం పలు రికార్డులను సాధించింది. సమ్మేళనానికి తెలుగు రాష్ట్రాలతో పాటు మహారాష్ట్ర, కర్ణాటక, అమెరికా, దుబాయ్నుంచి 15 వేల మంది విద్యార్థులు హాజరైనట్లు రాయల్సక్సెస్ఇంటర్నేషనల్బుక్ఆఫ్రికార్డ్స్‌, వండర్బుక్ఆఫ్రికార్డు నిర్వాహకులు వెల్లడించారు. భారీ సంఖ్యలో విద్యార్థులు హాజరవ్వడంతో పలు రికార్డులు సాధించిందని తెలిపారు. సందర్భంగా పూర్వ విద్యార్థి పరిషత్సభ్యులకు రికార్డు పత్రాన్ని అందజేశారు.