పారిశుధ్య కార్మికులకు సన్మానంసామాజిక సమరసత వేదిక ఆధ్వర్యంలో తెలంగాణలోని పాలమూరు, ఆదిలాబాద్‌, నిజామా బాద్‌ కరినగర్‌, మెదక్‌, ఖమ్మం, రాజన్న సిరిసిల్ల జిల్లాల్లో పురపాలిక పారిశుద్ధ్య కార్మికులకు ఆత్మీయ గౌరవ సన్మాన కార్యక్రమం నిర్వహించారు. మహాత్మాగాంధీ 150వ జయంతి, గురునానక్‌ దేవ్‌ 550వ జయంతి, దత్తోపంత్‌ ఠేంగ్డీజీ శతజయంతి, డా. అంబ్కేర్‌ 63వ వర్ధంతి సందర్భంగా నిర్వహించిన ఈ కార్యక్రమాల్లో ఆయా నగరాల్లోని పురపాలికల్లో పనిచేస్తున్న పారిశుద్ధ్య కార్మికులను సన్మానించారు. కరినగర్‌లో జిల్లా సంయుక్త పరిపాలనాధికారి శ్యాంప్రసాద్‌ లాల్‌ పాల్గొన్నారు.

మెదక్‌లో జరిగిన కార్యక్రమంలో భువనేశ్వరీ పీఠం పీఠాధిపతి శ్రీశ్రీశ్రీ కమలానంద భారతి స్వామిజీ పాల్గొని మార్గదర్శనం చేశారు. కులభేధాలు, స్వార్థం వదిలి సమరసతతో జీవించాలన్నారు. సామాజిక అసమానతలు ఉండరాదన్నారు.

అంతకుముందు సామాజిక సమరసత వేదిక తెలంగాణ రాష్ట్ర కన్వీనర్‌ అప్పాల ప్రసాద్‌జీ మాట్లాడారు. 80 మంది పారిశుద్ధ్య కార్మికులను సన్మానించారు. పాలమూరులో 60 మందిని సన్మానించారు. ఈ సందర్భంగా పారిశుద్ధ్య కార్మికుల జీవనస్థితిగతుల పై సమరసత వేదిక ఆధ్వర్యంలో సర్వే నిర్వహించారు.