ప్రముఖుల మాటబంగ్లాదేశ్‌, పాకిస్తాన్‌లలో వేధింపులకు గురవుతున్న హిందువులు ఎక్కడికి వెళ్ళాలి? ముస్లింలకు ఎన్నో దేశాలు ఉన్నాయి. హిందువులకున్నది భారతదేశం ఒక్కటే.        

- స్వామి విశ్వేశ తీర్థ,  ఉడిపి పెజావర్‌ పీఠాధిపతి

 
శరణార్ధులు, చొరబాటుదారుల మధ్య ఎంతో తేడా ఉంది. సీఏఏ అవసరం ఎప్పటి నుంచో ఉంది. అది ఇప్పటికైనా తెస్తు న్నందుకు అందరూ ఆహ్వా నించాలి. గొడవల్లో విద్యార్ధులు ఉండడం బాధను కలిగించే విషయం.

- సద్గురు జగ్గి వాసుదేవ్‌
ఆధునిక ప్రపంచంలో క్రైస్తవు లపై విశ్వాసం సన్నగిల్లుతోంది. పాస్టర్లు తమ ఆలోచనా విధానాన్ని, వైఖరిని మార్చుకోక పోతే చర్చ్‌ల ప్రభావం పూర్తిగా పోతుంది. ముఖ్యంగా యూరోప్‌, పశ్చిమ దేశాల్లో ప్రజల నమ్మకాన్ని నిలబెట్టుకునేందుకు చాలా జాగ్రత్తగా వ్యవహరించాలి.

- పోప్‌ ఫ్రాన్సిస్‌