లోపాలపైకాదు మంచి విషయాలపై దృష్టిపెట్టాలి (హితవచనం)


ఒక దేశపు స్వరూప స్వభావాలను వర్ణించి చెప్పడానికి ఉదాహరణగా తీసుకోవలసింది అక్కడక్కడా పేరుకు పోయిన  మురికిని కాదు. ఈ లోకంలో ఎవడైనా ఒక మామిడి చెట్టు దగ్గరకు వెళ్లి కుళ్లిపోయిన, పురుగులతో పుచ్చిన మామిడి పండ్లను ఏరుకుని వచ్చి ఒక్కొక్కదాని మీద ఒక్కొక్క పుస్తకం వ్రాయవచ్చు.

ఎంత వ్రాసినా అది మామిడి చెట్టు యదార్థమైన స్వరూప స్వభావాలను కానీ,  దాని గొప్పతనాన్నిగానీ వానికి కొంచెమైనా అర్థం అయినట్లు కాదు. అలాగే ఒక దేశాన్ని గురించి అంచనా వేయాలంటే అక్కడ ఉన్న ఉదాత్తమైన అంశాలను పరిశీలించవలసి ఉంటుంది. ఉదాత్తమైన ఆదర్శాల ద్వారా  ప్రజలతో కూడిన ఒక ప్రత్యేకమైన జాతి ఏర్పడుతుంది. దేశంలో ఉన్న ఆచార వ్యవహారాల నుంచి మంచి చెడ్డలను గురించి నిర్ణయించాలని అనుకున్నప్పుడు వాటిలోని అత్యున్నత అంశాలను మాత్రమే గ్రహించాలి.

ఒక సంస్కర్త సమాజంలో చెడును మాత్రమే చూస్తే అతడు మేలు కంటే కీడే ఎక్కువ చేస్తాడు. ముఖ్యంగా పురాతనమైన హిందూసమాజాన్ని సక్రమంగా అర్థంచేసుకోకుండా సంస్కరణకు పూనుకోకూడదు.     
- స్వామి వివేకానంద