సి.ఏ.ఏ వల్ల ఏ ఒక్క భారతీయుడు పౌరసత్వాన్ని కోల్పోడు


సమాచారభారతి తాండూరు శాఖ ఆధ్వర్యంలో అవగాహన కార్యక్రమం
పౌరసత్వ సవరణ చట్టం (CAA) వల్ల ఏ ఒక్క భారతీయుడు తమ పౌరసత్వాన్ని కోల్పోడని ప్రజ్ఞ భారతి రాష్ట్ర ప్రధాన కార్యదర్శి గిరిధర్‌ మామిడి అన్నారు. (CAA) చట్టం 1955లో చేసిన పౌరసత్వ చట్టానికి సవరణ మాత్రమేనని పేర్కొన్నారు. దీనివ్ల ప్రస్తుత భారత దేశంలో నివాసముంటున్న ముస్లిరలు ఎవరు తమ పౌరసత్వాన్ని కోల్పోరని, వారు ఆందోళన చెందవసిన అవసరంలేదని తెలిపారు.
 సీఏఏ పైన రాజకీయ పార్టీలు అనవసర రాద్ధాంతం చేస్తూ ముస్లిం వర్గాలను తప్పుదోవ పట్టిస్తున్నారని ఆరోపించారు. సమాచారభారతి తాండూరు శాఖ నిర్వహించిన సి.ఏ.ఏ అవగాహనా కార్యక్రమంలో ఆయన మాట్లాడారు. పాకిస్తాన్‌, బంగ్లాదేశ్‌, ఆఫ్ఘనిస్తాన్‌ దేశాలలో అణచివేతకు గురైన ముస్లిమేతర వర్గాలు భారతదేశంలో గత 70 సంవత్సరాలుగా శరణార్ధులుగా ఉన్నారని వారికే సి.ఏ.ఏ చట్టం ప్రకారం భారతదేశం పౌరసత్వం ఇవ్వబోతుందని గిరిధర్‌ తెలిపారు. ఎన్‌ఆర్‌సి పై ప్రభుత్వం ఇంకా ఏ నిర్ణయం తీసుకోలేదని ఆయన పేర్కొన్నారు. పౌరసత్వం సంబంధించిన చట్టాలను కొన్ని రాష్ట్రాలు తాము అమలు చేయబోమని చెబుతున్నాయని, కానీ అలా చెప్పే అధికారం రాష్ట్ర ప్రభుత్వాలకు లేదని, పౌరసత్వ అంశం కేంద్ర జాబితాలోనిదని, రాష్ట్ర ప్రభుత్వాలు కచ్చితంగా కేంద్రం చేసిన చట్టాలను అమలు చేయవలసిందేనని ఆయన తెలిపారు. సీఏఏ చట్టం పట్ల ప్రజలందరూ అవగాహన ఏర్పరచుకొని సమాజాన్ని జాగృతం చేయాని ఆయన కోరారు. డాక్టర్‌ మల్లేశం రిటైర్డ్‌ అసిస్టెంట్‌ ప్రొఫెసర్‌ గారు అధ్యక్షత వహించిన ఈ కార్యక్రమంలో పుర ప్రముఖులు, ప్రజలు, పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.