సీఏఏ వ్యతిరేక ప్రదర్శనలకు పిఎఫ్‌ఐ నిదులు


నిజనిజాలను బయటపెట్టిన ఎన్‌ ఫోర్స్‌ మెంట్‌ డైరెక్టరేట్‌
దేశవ్యాప్తంగా సీఏఏకు వ్యతిరేకంగా సాగుతున్న ప్రదర్శనలకు సంబంధించి ఎన్‌ ఫోర్స్‌ మెంట్‌ డైరెక్టరేట్‌ (ఈడీ) జరిపిన దర్యాఫ్తులో అనేకమంది ప్రముఖుల పేర్లు బయటపడ్డాయి. ఈ ప్రదర్శనలకు మూలంగా భావిస్తున్న పాపులర్‌ ఫ్రంట్‌ ఆఫ్‌ ఇండియా (పిఎఫ్‌ఐ) 73 మంది ప్రముఖులకు చెందిన అకౌంట్లలో 120 కోట్ల రూపాయలకుపైగా డిపాజిట్‌ చేసినట్లు దర్యాప్తులో తేలింది. 

ఉత్తర్‌ప్రదేశ్‌లో జరిగిన సీఏఏ వ్యతిరేక ప్రదర్శనలతో పిఎఫ్‌ఐకి నేరుగా సంబంధం ఉన్నట్లు ఎన్‌ఫోర్స్‌ మెంట్‌ డైరెక్టరేట్‌ తేల్చింది. హింసాత్మక ఘటనలు జరిగిన ప్రాంతాలకు చెందినవారి అకౌంట్లలోకి పిఎఫ్‌ఐ పెద్ద మొత్తంలో డబ్బు డిపాజిట్‌ చేయడం ఈ విషయాన్ని దృవీకరిస్తోంది. డిసెంబర్‌ లో పార్లమెంట్‌ సీఏఏను ఆమోదించిన వెంటనే ఈ డబ్బు ఈ ప్రాంతాకు చేరిందని దర్యాప్తులో తేలింది.
పీఎఫ్‌ఐ అనుబంధ సంస్థ రెహబ్‌ ఇండియా ఫౌండేషన్‌తో పాటు మరికొందరు వ్యక్తులకు 17 బ్యాంక్‌లలో ఉన్న 73కు పైగా అకౌంట్లకు డబ్బు వెళ్ళినట్లు ఈడీ దర్యాప్తులో బయటపడిరదని టైమ్స్‌ నౌ న్యూస్‌ చానల్‌ కధనం ప్రసారం చేసింది. ఈ అకౌంట్‌లలో డిపాజిట్‌ చేసిన 120 కోట్లు కేవలం రెండు, మూడు రోజుల్లోనే పూర్తిగా తీసుకోవడం జరిగిందని బ్యాంక్‌ వివరాలను బట్టి తెలుస్తోంది.
డబ్బును నేరుగా అకౌంట్‌లలో జమ చేశారు. పిఎఫ్‌ఐకి చెందిన న్యూఢిల్లీ నెహ్రూ ప్లేస్‌లోని సిండికేట్‌ బ్యాంక్‌ అకౌంట్‌ నుంచి ఉత్తర్‌ ప్రదేశ్‌ బరైచ్‌, బిజ్‌నూర్‌, హాపూర్‌, షామిల్‌, దాస్న తదితర ప్రాంతాలలోని అకౌంట్‌లకు 41కోట్లకు పైగా డబ్బు ట్రాన్స్ఫర్‌ చేశారు. ఈ ప్రాంతాలలోనే ఎక్కువగా హింసాత్మక ప్రదర్శనలు జరిగాయి.
ప్రముఖుల ఖాతాలలోకి...
కొందరు ప్రముఖుల ఖాతాలలోకి పిఎఫ్‌ఐ, దాని అనుబంధ సంస్థ నుంచి డబ్బు డిపాజిట్‌ అయ్యిందని ఈడీ దర్యాప్తులో తేలింది. కేరళ కోజీకోడ్‌లోని సిండికేట్‌ బ్యాంక్‌ మయూర్‌ రోడ్‌ బ్రాంచ్‌లోని 4405010004277 నంబర్‌ కలిగిన పిఎఫ్‌ఐకి చెందిన అకౌంట్‌ నుంచి పెద్ద్‌ మొత్తంలో డబ్బు డిపాజిట్‌ అయిన ప్రముఖుల వివరాలు ఇలా ఉన్నాయి.
అలాగే దుబాయిలోని పీఏంఏ ఇంటర్నేషనల్‌ ఎల్‌ఎల్‌సి సంస్థకు చెందిన అకౌంట్‌ నుంచి పిఎఫ్‌ఐ అనుబంధ సంస్థ అయిన రెహబ్‌ ఇండియా ఫౌండేషన్‌కు చెందిన అకౌంట్‌కు 20 లక్షల రూపాయలు డిపాజిట్‌ అయినట్లు కూడా దర్యాప్తులో తేలింది. దుబాయిలోని పీఏంఏ సంస్థ కార్యకలాపాలు, వ్యాపారం గురించి దర్యాప్తు సాగుతోంది. పీఎఫ్‌ఐ నాయకుడు ఒకరికి ఉన్న థానల్‌ ఫౌండేషన్‌ అనే మత, సేవ సంస్థ పీఎఫ్‌ఐ కార్యకలాపాలకు పూర్తి అండదండలు ఇస్తోందని ఇంటలిజెన్స్‌ సమాచారం. కాశ్మీర్‌లోని పీఎఫ్‌ఐ బ్రాంచ్‌కు ఒకటిన్నర కోట్లకు పైగా నిధులు ముట్టినట్లు కూడా ఈడీ దర్యాప్తులో తేలింది.