జీహాదీ శక్తుల వీరంగం


ఒక చట్టాన్ని గురించికానీ, మరే విషయాన్ని గురించికానీ తమ అభిప్రాయాలు వ్యక్తం చేసే స్వేచ్ఛ అందరికీ ఉంటుంది. దానినే భావవ్యక్తీకరణ స్వేచ్ఛ అంటున్నారు. ఇది రాజ్యాంగం కల్పించిన హక్కు. అయితే ప్రతి హక్కు కొన్ని పరిమితులు, పరిధులకు లోబడి ఉంటుంది. దేశ సమైక్యత, సమగ్రత, భద్రతకు ముప్పు కలిగించేవిధంగా ఎవరూ వ్యవహరించకూడదు. అలా వ్యవహరించడాన్ని ఏ దేశం అంగీకరించదు.అంగీకరించకూడదు. కానీ సీఏఏ వ్యతిరేక నిరసనలు భావప్రకటన హక్కు పేరుతో ఈ పరిధి దాటి దేశవ్యతిరేకతకు దారితీస్తున్న సూచనలు కనిపిస్తున్నాయి. 

పౌరసత్వ సవరణ చట్టానికి వ్యతిరేకంగా ఢిల్లీ ఇతర ప్రాంతాల్లో జరిగిన అ్లర్లు కూడా శుక్రవారం ప్రార్థన అనంతరం జరిగాయి. జామియా మిలియా విశ్వవిద్యాలయంలో విద్యార్థుల కంటె బయటి ప్రజలు 250 మంది పోలీసులపైకి రాళ్లు విసిరారు. అంతా కలిసి అనేక వాహనాలు తగుల పెట్టారు. పైగా చేతిలో జాతీయ జెండా పట్టుకున్నారు. కాని జెండా మీద నో సీఏఏ, నో ఎన్‌ఆర్‌సీ నినాదాలు రాశారు. ఇది జాతీయ జెండాను గౌరవించడమెలా అవుతుంది. దీనికితోడు వీరి నినాదాల్లో ‘జిన్నా వాలీ ఆజాదీ’ అనే నినాదం వినబడుతుంది. ఈ నినాదానికి పౌరసత్వ చట్టంపై వ్యతిరేకతకు సంబంధం లేదు. మరోసారి దేశ విభజనకు ఈ ఆందోళనకారులు తెగబడ్తున్నారా?
ఈ ఆందోళనల్లో పాల్గొన్న అసాంఘిక శక్తుల్ని యుపిపోలీసు యంత్రాంగం గుర్తించింది. 16 మందిని అరెస్టు చేసింది. వారి ఆస్తుల జప్తు చేస్తామంది. సిమి (స్టూడెండ్స్‌ ఇస్లామిక్‌ మూవ్‌ మెంట్‌ ఆఫ్‌ ఇండియా) నుంచి పేరుమార్చుకున్న పాపులర్‌ ఫ్రంట్‌ ఆఫ్‌ ఇండియా ఉగ్రముఠా చేతిలో గన్ను పట్టుకుని మరీ విధ్వంసం సృష్టించారు. కిడ్నాపులు, హత్యలు చేయడం, విద్వేషాలు రెచ్చ గొట్టడం, అ్లర్లు, లవ్‌జీహాద్‌వంటి అనేక ఆరోపణలుండి నిఘాసంస్థ నీడలో పిఎఫ్‌ఐ కార్యకలాపాలు జరగుతున్నాయి. ఏ క్షణాన్నైనా కేంద్రం ఈ సంస్థను నిషేధించవచ్చు. 2012లో కేరళ ప్రభుత్వం పీఎఫ్‌ఐకు 27 హత్యతో సంబంధం ఉందని హైకోర్టుకు చెప్పింది. 20,000 మంది హిందు స్ర్తీలు ఈ సంస్థ లవ్‌జిహాద్‌కు బలి అయ్యారు. ఇండియాటుడే ఈ సంస్థపై అనేక స్టింగ్‌ ఆపరేషన్లు నిర్వహించింది.
పౌరసత్వ చట్టానికి వ్యతిరేకంగా ఢిల్లీలో షాహిన్‌బాగ్‌లో జరుగుతున్న ఆందోళన వెనుక ఉన్న షర్జీల్‌ ఇమామ్‌ ఒక జెఎన్‌యు విద్యార్థి, ఆమ్‌ఆద్మీ పార్టీకి చెందిన అమానుల్లాఖాన్‌ వంటి వేర్పాటు వాదుతో షర్జీల్‌ ఇమామ్‌  కలిసి తిరిగినవాడు కేవం పాశ్చాత్యా మీడియాను ఆకర్షించేందుకు షాహిన్‌బాగ్‌ ఆందోళన జరుగుతున్నదని అతను ఒప్పుకున్నాడు. అస్సాంను దేశం నుంచి విడగొట్టా ని బాహాటంగా తనవాదన వినిపిస్తున్నాడు. అ్లర్లు సృష్టించేందుకే షాహిన్‌బాగ్‌ ఆందోళన జరుగు తున్నదని అతను ఒక టీవీ నిర్వహించిన స్టింగ్‌ ఆపరేషన్‌లో ఒప్పుకున్నాడు. చివరకు అరెస్టయ్యాడు.
పూర్తిగా భారతదేశపు అంతర్గత విషయమైన పౌరసత్వవిషయాన్ని గురించి కొన్ని ఇతర దేశాలు కూడా మాట్లాడే ప్రయత్నం చేయడం, ముఖ్యంగా విదేశీ మీడియా ఈ విషయంలో అపోహలు ప్రచారం చేయడం చూస్తే ఈ నిరసన వెనుక విదేశీ హస్తం కూడా కనిపిస్తోంది. షహీన్‌ బాగ్‌ నిరసనకారులకు పీపుల్స్‌ ఫ్రంట్‌ చేకూర్చిన నిధులు సౌదీ నుంచి వచ్చాయనే అనుమానాలు పలువురు ప్రముఖు వ్యక్తంచేశారు కూడా.
 పౌరసత్వ సవరణ చట్టం మీద ఆందోళన చేస్తున్న మూకల హింసకు కొనసాగింపు అన్నట్లుగా భైంసా హింస జరగడం జీహాదీ శక్తు తీవ్రవాద పోకడ పరాకాష్ఠను తెలియజేస్తున్నది.
ఆదిలాబాద్‌ జిల్లా బైంసా పట్టణం మరోసారి భగ్గుమంది. 40కి పైగా ఇళ్లు పూర్తిగా తగబడ్డాయి.  సంక్రాంతి పండుగ ముందురోజు అల్లర్లు జరిగాయి. ఆభరణాలు, వస్తువులు దోచుకున్నారు. వాహనానలు తగుబెట్టారు. మంటలార్పేందుకు వచ్చిన ఫైర్‌యింజను పైపు కోసివేశారు. తీవ్రంగా గాయపడిన వారిని తీసుకెళ్లేందుకు వచ్చిన 108 వాహనాను అడ్డుకున్నారు.  ఇంతజరిగినా ఎవరినీ అరెస్టు చేసే సాహసం పోలీసులు చేయలేదని స్థానికులు ఆరోపించారు. ఈ అల్లర్లకు భయపడి కొన్ని కుటుంబాలు ఊరు విడిచివెళ్ళే పరిస్థితి ఏర్పడింది. బాధిత కుటుంబాను పరామర్శించడానికి వచ్చినవారిని అరెస్టు చేశారు.
ఇలా ప్రతి విషయానికీ మతపు రంగుపులిమి దానిని మతయుద్ధంగా మలచాలనే ధోరణి ఎవరికీ మంచిదికాదు. ఈ జిహాదీ ధోరణికి ప్రభుతలువాు అడ్డుకట్ట వేయవలసిందే.
- హనుమత్ ప్రసాద్