గ్రామీణాభివృద్ధికి పట్టంస్టాక్మార్కెట్లను ప్రపంచవ్యాప్తంగా జరిగే అనేక చిన్న, పెద్ద అంశాలు ప్రభావితం చేస్తాయి. ప్రస్తుతం అమెరికా, ఇరాన్మధ్య నడుస్తున్న ప్రచ్ఛన్న యుద్ధం, అమెరికా అధ్యక్షుడు ట్రంప్పై సాగుతున్న అభిశంసన ప్రక్రియ మొదలైనవి ప్రపంచవ్యాప్తంగా ఆర్థిక వ్యవస్థను ప్రభావితం చేస్తున్నాయి. తత్పలితంగా ఆర్థిక మాంద్యం ఏర్పడింది. ఇటువంటి పరిస్థితులలో మోదీ ప్రభుత్వం 2020-2021 సంవత్సరానికిగాను ఆర్థికబడ్జెట్ను ప్రవేశపెట్టింది.


ఆర్థిక మాంద్య పరిస్థితులను దృష్టిలో పెట్టుకుని బడ్టెన్ను పరిశీలిస్తే అది సామాన్య ప్రజలకు ప్రత్యక్షంగా, పరోక్షంగా లాభం చేకూర్చే బడ్జెట్అని కచ్చితంగా చెప్పవచ్చు. పట్టణ, గ్రామీణ ప్రాంతాకు సంబంధించి బడ్జెట్లో అనేక అంశాలు ఉన్నప్పటికీ మనది గ్రామీణభారతి కాబట్టి గ్రామాను ప్రభావితం చేసే అంశాలు బడ్జెట్లో ఏమి ఉన్నాయో చూద్దాం.

దేశాభివృద్ధికి బడ్జెట్లో నిర్దేశించిన మూడు ప్రాధాన్యతలు గ్రామాలను దృష్టిలో పెట్టుకుని నిర్ణయించినవే. ఒకటి వ్యవసాయం, సాగునీరు, గ్రామీణాభి వృద్ధి. రెండవది ఆరోగ్యం, పారిశుద్ధ్యం, త్రాగునీరు. ఇక మూడవది విద్య
మొదటి ప్రాధాన్యతా అంశమైన వ్యవసాయానికి రూ.2.83 లక్షల కోట్లు కేటాయించారు. వ్యవసాయ ఋణా లక్ష్యం రూ.15 లక్షల కోట్లుగా నిర్ణయించారు. రైతుల ఆదాయం రెట్టింపు చెయ్యాలన్న ప్రభుత్వ లక్ష్య సాధనకు అనుగుణంగా రెండు ఉన్నాయి. అలాగే గ్రామీణాభివృద్ధికై రూ.1.23 లక్షల కోట్లను కేటాయించారు.

స్వచ్ఛభారత్మిషన్కోసం రూ.12,300 కోట్లు, మంచినీటి సరఫరా పథకంజజీవన్మిషన్ కై రూ.3.06 లక్షల కోట్లు, ప్రధానమంత్రి జన ఆరోగ్య యోజన కోసం రూ.6,400 కోట్లు ఆయుష్మాన్భారత్కోసం రూ.69 వేల కోట్లను కేటాయించారు. ఇవి అన్నీ గ్రామాలను ప్రభావితం చేసే అంశాలే. కౌలు రైతుల కోసం చట్టం, ప్రధాని ఫసల్భీమా ద్వారా రూ.6.11 కోట్ల మంది రైతులకు బీమా, పప్పుధాన్యాల సాగు విస్తీర్ణం పెంపు, గ్రామీణ సడక్యోజన, రైతులకు 20 లక్షల సోలార్పంపుసెట్లు, ప్రత్యేక విమానా ల ద్వారా పండ్లు, కూరగాయలు, పూల ఎగుమతులు, ఆయుష్మాన్భారత్లో భాగంగా 20 వేల ఆసుపత్రుల నిర్మాణం, ప్రతి జిల్లా వైద్య కేంద్రంలో మెడికల్కాలేజీ ఏర్పాటు మొదలైన అనేక లక్ష్యాలు బడ్జెట్ద్వారా నిర్ధారించారు.

 ఇక పట్టణ వాసుల విషయానికొస్తే  విద్యారంగానికి రూ.99,300 కోట్లు, నైపుణ్యాభివృద్ధి కేంద్రాలకు రూ.3 వేల కోట్లు, విద్యుత్రంగానికి రూ.22000 కోట్లు, పారిశ్రామిక రంగానికి రూ.27,300 కోట్లు, బ్యాంకింగ్రంగానికి రూ.3.5 లక్షల కోట్లు కేటాయించారు. వీటన్నింటివల్ల యువతకు ఉపాధి అవకాశాలు పుష్కలంగా లభించేందుకు మార్గం సుగమం అవుతుంది. ఉపాధ్యాయులు, పారామెడికోల కొరత తీర్చే విధానం, వర్సిటీ కోసం జాతీయ విధానం, వైద్య పీజీ కోర్సుల ప్రారంభానికి పెద్దాసుపత్రులకు ప్రోత్సాహకాలు, స్థానిక సంస్థలలో ఇంజనీరింగ్విద్యార్థుకు అప్రెంటిస్విధానం మొదలైన అనేక అంశాలు బడ్జెట్లో ప్రస్తావించారు. వీటన్నింటి ద్వారా పట్టణ ప్రజలు ముఖ్యంగా యువత ఎంతో ప్రయోజనం పొందుతారు అని అనడంలో అతిశయోక్తి లేదు.
- శివనాధ్‌.కె