అమరవాణి

శోకో నాశయతే ధైర్యం
శోకో నాశయతే శ్రుతమ్‌
శోకో నాశయతే సర్వం
నాస్తి శోక సమోరిపుః

భావం : దుఃఖంతో ధైర్యం నశిస్తుంది. దుఃఖం మంచిచెడును ఆలోచించనీయదు. దుఃఖం వ్ల సర్వం కోల్పోతాం. దుఃఖం వంటి శత్రువు లోకంలో లేదుగాక లేదు. కాబట్టి అన్నింటికీ విచారిస్తూ కూర్చోకుండా ధైర్యంగా ముందడుగు వేయాలి.