భారతజాతి అస్తిత్వం, మనుగడపై జరుగుతున్నదాడి


భారత్‌ స్వాతంత్య్రానంతరం, గత కొన్ని దశాబ్దాలుగా, ముఖ్యంగా ప్రధాని నరేంద్ర మోదీ ప్రభుత్వం ఏర్పడిన తరువాత, అంతకుముందే అన్ని రంగాల్లో, అన్ని వ్యవస్థల్లో చొచ్చుకుపోయి పాతుకు పోయిన వామపక్షవాదులు, వారి భారతదేశవ్యతిరేక భావజాలంతో దేశంలో అల్లకలోలం సృష్టిస్తున్నారు. అంతేకాక ఈ కమ్యూనిస్టులు విదేశాలనుంచి దిగుమతి అయిన మతాలకు చెందిన ఛాందస వాదులు కలిసి ఒకే కూటమిగా ఏర్పడి విద్వేషాలు రెచ్చగొడుతూ, దేశవ్యతిరేక కార్యాలకు ఎప్పటినుంచో పాల్పడుతున్నారు. అవి ఇటీవల ఢిల్లీ తదితర ప్రాంతాల్లో స్పష్టంగా బయటపడ్డాయి.

జల ప్రళయానికి జడవని స్వయంసేవకులు... ఆపన్నుల సేవకు సర్వదా సిద్ధం

 
కేదార్‌ ఘాట్‌ జల ప్రళయాన్ని ఎవరూ ఇంకా మర్చిపోయి ఉండరు. జీవితాన్ని ఇచ్చే నీరు ఇలా ఉప్పెనగా మారి ప్రళయాన్ని సృష్టించింది. శవాల దుర్గంధం మధ్య, అసహాయ స్థితిలో తీర్థ యాత్రికుల అలకనంద ఒడ్డున మౌనంగా కన్నీరు కార్చిన దృశ్యాను మన ఇళ్ళల్లోని టీవీలో, ఛానళ్లలో మనమందరం చూసాము. అయితే అక్కడే మానవత్వానికి రూపంగా నిలిచిన వారిని మన మెవరం గమనించి ఉండం. వారే... కఠిన జల ప్రళయంలో, పైనుండి కురుస్తున్న వర్షాకు బురదగా మారిన మురికి రోడ్ల మీద, ప్రాణాంతక మైన పరిస్థితులో యాత్రీకును అక్కున చేర్చుకుని పగలూ రాత్రీ సేవా కార్యంలో నిమగ్నమైన స్వయం సేవక్ లు. కేదార్‌నాథ్‌లో మొదటి హెలిపాడ్‌ను నిర్మించటం దగ్గర నుండి, ఈ ఆపదలో అనాధలుగా మారిన చిన్న పిల్లలు చదువు ఏర్పాట్ల వరకూ ఇంకా ఈనాటికీ రాష్ట్రీయ స్వయంసేవక్‌ సంఘ సేవ చేస్తూనే ఉంది.

నూతన ఆశయాలను అంకురింపజేసే 'ఉగాది'


చైత్రమాసి జగద్బ్రహ్మ ససర్జ ప్రథమేహని
శుక్ల పక్షే సమగ్రంతు తదా సూర్యోదయే సతి

చైత్రశుద్ద పాడ్యమి సూర్యోదయ సమయంలో బ్రహ్మ ఈ జగత్తును సంపూర్ణంగా సృష్టించాడు. ‘ఉగ’ అనగా నక్షత్ర గమనము, నక్షత్ర గమనానికి ‘ఆది’ ‘ఉగాది’ అంటే సృష్టి ఆరంభమైన దినము. భవిష్య పురాణములో యుగాదు గురించి వివరణ ఉంది. కృతయుగం వైశాఖ తృతీయనాడు, త్రేతా యుగం కార్తీక నవమి నాడు, ద్వాపర యుగం ఆశ్వయుజ త్రయోదశి నాడు, కలియుగం ప్గాలుణ పౌర్ణమి నాడు ప్రారంభం అయినట్లు శాస్త్రోక్తం. 

దేశ సేవలో... (స్ఫూర్తి)


ఒకసారి సుభాష్‌చంద్రబోస్‌ హింద్‌ఫౌజ్‌ కోసం నిధులు సేకరిస్తూ రంగూన్‌ వచ్చారు. ఆయన స్ఫూర్తివంతమైన మాటలు విని రాజమణి అనే 16 ఏళ్ళ అమ్మాయి తన ఒంటిమీద ఉన్న వజ్రాల, బంగారు నగలు దానం చేసింది. కానీ ఆమర్నాడు రాజమణి ఇంటికి వచ్చిన బోస్‌ ఆమె తండ్రితో ‘అమాయకత్వంవల్ల మీ అమ్మాయి నగలన్నీ ఇచ్చేసింది. అవి తిరిగి ఇవ్వడానికి వచ్చాను’ అన్నారు.

సద్గుణాలే సంపద (హితవచనం)


దుష్ట స్వభావము, దయలేని అంతఃకరణము, ద్వేషం, మరియు క్రూరత్వం గల పురుషుడు శ్రేష్ఠ వంశము నందు జన్మించినను విలువ ఉండదు. సద్గుణము వలన మాత్రమే వ్యక్తికి ఔన్నత్యము కలుగును.

అమరవాణి

నాస్తి జాత్యా రిపుర్నామ
మిత్రం వాపి న విద్యతే ।
సామర్థ్యయోగాజ్జాయన్తే
మిత్రాణిరిపవస్తథా ॥
భావం : పుట్టుకతో ఎవ్వడూ శత్రువు కాదు. ఎవ్వడూ మిత్రుడూ కాదు. ఎవరివల్ల మనకి ప్రయోజనం ఉంటుంది, ఎవరివల్ల మనకి అపకారం కలుగుతుంది అన్నదాన్ని బట్టి మిత్రులయినా, శత్రువులైనా ఏర్పడతారు.

ప్రముఖల మాట


పౌరసత్వానికి సంబంధించి పత్రాలు చూపించడానికి ఇష్ట పడని కొంతమంది రాముడు అయోధ్యలోనే పుట్టాడనేందుకు ఆధారాలు మాత్రం అడుగుతున్నారు. ‘కాగజ్‌ నహీ దిఖాయెంగే’ అంటూ మొండికేస్తున్నవారు రెండు నాల్కల ధోరణి చూపిస్తున్నారు.
- రవిశంకర్‌ ప్రసాద్‌, కేంద్ర మంత్రి

స్వాతంత్య్ర ఉద్యమంలో ఆర్‌.ఎస్‌.ఎస్‌ పాత్ర

 
స్వాతంత్య్ర ఉద్యమంలో ఆర్‌.ఎస్‌.ఎస్‌ పాత్ర గురించి తరుచు చర్చ జరుగుతుంటుంది. స్వతంత్ర సమరంలో ప్రత్యక్ష పాలుపంచుకోకపోయినా దేశకార్యంలో ఆర్‌.ఎస్‌.ఎస్‌ పాత్రను మాత్రం ఎవరు కాదనలేరు.

రాజ్యాంగం పేరున దేశద్రోహం

 
ఢిల్లీ, షహీన్‌బాగ్‌లో గత ఐదు నెలుగా పౌరసత్వ సవరణ చట్టానికి వ్యతిరేకంగా ముస్లిం స్త్రీలు ధర్నా చేస్తున్నారు. రాజ్యాంగ రక్షణ అంటూ పైకి చెబుతున్నా, జాతీయ జెండాలు పట్టుకుని ఊరేగుతున్నా, వారి ఆందోళనలో ఇతర ప్రయోజనాలు కూడా స్పష్టంగా కనిపిస్తున్నాయి.  వారికి రోజూ బిరియానీలు తినిపిస్తూ, డబ్బు పంచుతున్న కొందరు నేతల వైఖరి, వారి మాటు, ప్రసంగాలలో దేశవ్యతిరేకత కనిపిస్తోంది. తాజాగా బెంగళూరులో జరిగిన సంఘటనలో కొందరు వేదిక మీదనే ద్వేషాన్ని వెదజల్లే ప్రసంగాలు చేశారు. 

'కుటుంబ బ్యవస్థను రక్షించుకోవాలి'

 - మాననీయ శ్రీ సుబ్రహ్మణ్య భట్‌, అఖిభారత కుటుంబ ప్రబోధన్‌ సంయోజక్‌
 

మాన్యశ్రీ సుబ్రణ్య భట్‌ గారి పర్యటనలో భాగంగా కూకట్‌పల్లి భాగ్‌లో నగర ఆపైస్థాయి కార్యకర్తకందరికీ కుటుంబాలతో కూడిన సమ్మేళనం 22.2.2020 శనివారం సాయంత్రం 7 గం॥లకు కేపీహెచ్‌బి 3వ ఫేజ్‌లోని శ్రీ వాసవి కళ్యాణ మంటపంలో ఏర్పాటు చేశారు.

ఖమ్మంలో ముని వాహన సేవ


ఫిబ్రవరి 24న సోమవారం ఉదయం 11 గంటలకు ఖమ్మం నగరంలోని శ్రీ క్ష్మీ రంగనాథ స్వామి ఆలయం లోనికి చిలుకూరి బాలాజీ ఆలయ అర్చకులు శ్రీ రంగరాజన్‌గారి పర్యవేక్షణలో భద్రాచలం శ్రీ క్ష్మీనరసింహస్వామి ఆలయ అర్చకులు శ్రీ కృష్ణ చైతన్య గారు  తన భుజాలపై రామచంద్ర బంజార శివాయల దళిత అర్చకులు శ్రీ  రవిని మీద కుర్చొపెట్టుకుని గుడిలోకి ప్రవేశించి ముని వాహన ఉత్సవం ఘనంగా నిర్వహించారు.

సంస్కృతే శ్రీరామరక్షమార్చ్‌ 8 మహిళాదినోత్సవం సందర్బంగా..
మహిళలకు అధికారం, డబ్బు, హోదావల్ల గౌరవం, విలువ కలుగుతాయా? పాశ్చాత్య ప్రపంచంలో ఇంతకు ముందు మహిళలకు ఎలాంటి హక్కులు, విలువ లేవు. అందుకే ఇప్పుడు ‘మహిళా సాధికారత’ అంటూ వాటిని కలిగించే ప్రయత్నం ఆ సమాజాల్లో జరిగింది. కానీ మన దేశంలో అలాంటి పరిస్థితి ఎప్పుడూ లేదు. మహిళకు మన సమాజంలో మొదటనుంచీ గౌరవస్థానం  ఉంది.

రక్తహీనత


రక్తహీనత వల్ల పూర్తి బలహీనం అవుతారు. ముఖ్యంగా ఆడవారిలో ఈ సమస్య ఎక్కువుగా ఉంటుంది.
రక్తహీనత క్షణాలు 
ముఖం పాలిపోయినట్లు ఉండటం, త్వరగా అసిపోవడం, చిరాకు, కోపం, అసహనం ఎక్కువుగా ఉంటాయి. ఆయాసం, జ్ఞాపకశక్తి తగ్గిపోవటం. నాుక మంట. మెడనొప్పి, తనొప్పి వస్తుంది.

మేడారం జాతరలో అన్యమతస్తుల ఆగడాలు


ఆసియా ఖండంలోనే కుంభమేళా తర్వాత అతిపెద్ద జాతరగా ప్రసిద్ధి గాంచిన మేడారం జాతరలో అమాయకులైన హిందువును ఈ ఏడాది కూడా అన్యమతస్తులు మేడారంలో మోసం చేశారు. గతంలో మాదిరిగానే జాతరలో ఏర్పాటు చేసిన కొన్ని దుకాణాలలో శిలువ బొమ్ము, ఏసుప్రభు చిత్రపటాలు విక్రయించడం కనిపిం చింది. అంతేకాకుండా క్రైస్తవులు ఈ సారి మరో అడుగు ముందుకు వేసి జాతర బస్టాండ్‌ సమీపంలో, జంపన్నవాగు వద్ద, రెడ్డిగూడెం వెళ్లే చోట యుక్తవయసులో ఉన్న అమ్మాయిను నిబెట్టి మదర్‌ అనాధ ఆశ్రమానికి విరాళాలు ఇవ్వండి అన్న గ్లాస్‌ డొనేషన్‌ బాక్సును వారి చేతి కిచ్చి నిబెట్టారు. 

భైంసా బాధితుల పరిహారం విషయంలో రాష్ట్ర ప్రభుత్వ ఉదాసీనత


భైంసా ఘటన విషయంలో తెంగాణ రాష్ట్ర ప్రభుత్వం చర్యలు తీసుకోవడంలోనూ, బాధితులకు సరైన పునరావాసం కల్పించడంలో విఫలమైందని జాతీయ బాలల హక్కుల పరిరక్షణ కమిషన్‌ సభ్యురాలు శ్రీమతి ప్రజ్ఞా పరాండే అన్నారు. భైంసా ఘటన నేపథ్యంలో బాధిత ప్రజలకు  రాష్ట్రప్రభుత్వం నుండి ఎలాంటి సహకారం, నష్టపరిహారం అందని విషయంపై తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు.