భైంసా బాధితుల పరిహారం విషయంలో రాష్ట్ర ప్రభుత్వ ఉదాసీనత


భైంసా ఘటన విషయంలో తెంగాణ రాష్ట్ర ప్రభుత్వం చర్యలు తీసుకోవడంలోనూ, బాధితులకు సరైన పునరావాసం కల్పించడంలో విఫలమైందని జాతీయ బాలల హక్కుల పరిరక్షణ కమిషన్‌ సభ్యురాలు శ్రీమతి ప్రజ్ఞా పరాండే అన్నారు. భైంసా ఘటన నేపథ్యంలో బాధిత ప్రజలకు  రాష్ట్రప్రభుత్వం నుండి ఎలాంటి సహకారం, నష్టపరిహారం అందని విషయంపై తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. 
‘‘ఇది చాలా బాధాకరమైన పరిణామం. ఎన్నో కుటుంబాలు చెల్లాచెదురై పోయాయి. పిల్లలు భయాందోళనకు గురై మానసికంగా గాయ పడ్డారు. పరిస్థితిని అదుపు చేయాల్సిన పోలీసులు ఘటనా ప్రాంతానికి చేరుకోవడానికి 24 గంటల సమయం పట్టినట్లు స్థానికుల ద్వారా తెలిసింది. ఇక వారికి మన వ్యవస్థ మీద ఉండే విశ్వాసం మీరు అర్ధం చేసుకోవచ్చు’’ అని ప్రజ్ఞా వివరించారు. ‘‘ఇళ్ల దాహనంలో పిల్లలు తమ పుస్తకాలు, సర్టిఫికెట్లు కూడా కోల్పోయారు. కొందరు ఏదో విధంగా తమ బంధువు ఇండ్లలో ఉండి పరీక్షకు సిద్ధమవుతున్న పరిస్థితి. ఇది చాలా భయంకరమైన పరిణామం’’ అని అన్నారు.  
నిజానిర్ధారణ కమిటీ పరిశీనలో బాధితులకు నష్టపరిహారం చెల్లించకపోవడంతో పాటు, విద్యార్థుకు తాత్కాలికంగా ప్రభుత్వ వసతిగృహల్లో కూడా వసతి కల్పించని అంశాను గుర్తించామని అన్నారు.