మేడారం జాతరలో అన్యమతస్తుల ఆగడాలు


ఆసియా ఖండంలోనే కుంభమేళా తర్వాత అతిపెద్ద జాతరగా ప్రసిద్ధి గాంచిన మేడారం జాతరలో అమాయకులైన హిందువును ఈ ఏడాది కూడా అన్యమతస్తులు మేడారంలో మోసం చేశారు. గతంలో మాదిరిగానే జాతరలో ఏర్పాటు చేసిన కొన్ని దుకాణాలలో శిలువ బొమ్ము, ఏసుప్రభు చిత్రపటాలు విక్రయించడం కనిపిం చింది. అంతేకాకుండా క్రైస్తవులు ఈ సారి మరో అడుగు ముందుకు వేసి జాతర బస్టాండ్‌ సమీపంలో, జంపన్నవాగు వద్ద, రెడ్డిగూడెం వెళ్లే చోట యుక్తవయసులో ఉన్న అమ్మాయిను నిబెట్టి మదర్‌ అనాధ ఆశ్రమానికి విరాళాలు ఇవ్వండి అన్న గ్లాస్‌ డొనేషన్‌ బాక్సును వారి చేతి కిచ్చి నిబెట్టారు. 
వరంగల్‌ నుండి వెళ్ళిన కాంతారావు అనే ఒక వ్యక్తి డొనేషన్‌ బాక్స్‌ పట్టుకొని నిబడిన అమ్మాయి దగ్గరికి వెళ్లి ప్రశ్నించగా తాము హైదరాబాద్‌కు చెందిన మదర్‌ అనాధ ఆశ్రమానికి చెందిన యువతుమని ఆశ్రమాన్ని నిర్వహించ డానికి అయ్యే ఖర్చు కోసం ఇక్కడ విరాళాలు సేకరిస్తున్నట్లు తెలిపింది. హిందువుల జాతర్లో ఈ విధంగా అడుక్కోవడం పద్ధతేనా అని ఆయన ప్రశ్నించగా ఏమాత్రం భయం లేకుండా ఆయనపైకి దురుసుగా మాట్లాడింది. స్థానికంగా విధినిర్వహణలో ఉన్న పోలీసు అధికారికి అతను ఈ విషయం తెలియజేసనా వారు ఏమాత్రం స్పందించ లేదు. ఇక ఈ సారి సమ్మక్క జాతరలో మొక్కులకు సమర్పించుకున్న కోళ్లను కొంతమంది ముస్లింలు కోళ్ల షాపు పెట్టుకొని నెత్తిన టోపీ పెట్టుకొని హలాల్‌ చేస్తూ ఇవ్వడం కనిపించింది. అమ్మవార్లకు సమర్పించే కోళ్లను, మేకను, గొర్రెను ముర్దాల్‌ (మెడను పూర్తిగా కోయడం) చేసే సంస్కృతి ఇక్కడ ఉంది. దీనికి భిన్నంగా వారు టోపీ ధరించి ఖురాన్‌ వాక్యలు చదువుతూ హలాల్‌ (మెడ సగం కోయడం) చేయడం ఈసారి జాతరలో కనిపించింది. చిలుకల గట్టుమీద నుండి సమ్మక్కను గద్దెపైకి తీసుకు వస్తున్న సందర్భంలో కాన్వాయ్‌లో శిలువ గుర్తు ముద్రించిన వాహనం ఉండటంతో కొందరు యువకు ఆవాహనం అద్దాలు ధ్వంసం చేసి కాన్వాయ్‌ నుండి ఆ వాహనాన్ని పక్కకు పంపించారు. జాతరలో అన్యమతస్తుల ఆగడాలను ఎదుర్కోవడానికి వనవాసి కళ్యాణ పరిషత్‌ కార్యకర్తలు ఈ ఏడాది విశిష్టమైన కృషి చేశారు. అయినా వారి కళ్లుగప్పి కోటి మంది హాజరైన ఈ జాతరలో అక్కడక్కడ అన్యమతస్తులు తమ ఆగడాలను కొనసాగించారు.