ప్రముఖల మాట


పౌరసత్వానికి సంబంధించి పత్రాలు చూపించడానికి ఇష్ట పడని కొంతమంది రాముడు అయోధ్యలోనే పుట్టాడనేందుకు ఆధారాలు మాత్రం అడుగుతున్నారు. ‘కాగజ్‌ నహీ దిఖాయెంగే’ అంటూ మొండికేస్తున్నవారు రెండు నాల్కల ధోరణి చూపిస్తున్నారు.
- రవిశంకర్‌ ప్రసాద్‌, కేంద్ర మంత్రి

కొంతమంది రోడ్డుపై కూర్చుని తమ అభిప్రా యాన్ని ఇతరులు ఒప్పుకునే విధంగా ఒత్తిడి తేవడం కూడా ఉగ్రవాదమే. సాధారణ ప్రజల జీవితాన్ని ఇబ్బందుపాలు చేయడం కూడా ఉగ్రవాదమే. ప్రజాస్వామ్యంలో అసమ్మతిని తెలిపే హక్కు అందరికీ ఉంది. కానీ అది ఇతరులకు ఇబ్బంది కలిగించనంతవరకే.
- ఆరిఫ్‌ మహమ్మద్‌ ఖాన్‌, కేరళ గవర్నర్‌ 


విద్య, ధనంతోపాటు అహం కారం కూడా పెరుగుతోంది. దీనివ్ల సర్దుబాటు తత్వం నశించి కుటుంబాు విచ్ఛిన్నం అవుతున్నాయి. సమాజం కూడా ఒక కుటుంబమే. అందువ్ల ఈ దుష్ప్రభావం సమాజంపైన కూడా పడుతోంది.
- డా. మోహన్‌ భాగవత్‌, ఆర్‌ఎస్‌ఎస్‌ సర్‌ సంఘచాక్‌