జల ప్రళయానికి జడవని స్వయంసేవకులు... ఆపన్నుల సేవకు సర్వదా సిద్ధం

 
కేదార్‌ ఘాట్‌ జల ప్రళయాన్ని ఎవరూ ఇంకా మర్చిపోయి ఉండరు. జీవితాన్ని ఇచ్చే నీరు ఇలా ఉప్పెనగా మారి ప్రళయాన్ని సృష్టించింది. శవాల దుర్గంధం మధ్య, అసహాయ స్థితిలో తీర్థ యాత్రికుల అలకనంద ఒడ్డున మౌనంగా కన్నీరు కార్చిన దృశ్యాను మన ఇళ్ళల్లోని టీవీలో, ఛానళ్లలో మనమందరం చూసాము. అయితే అక్కడే మానవత్వానికి రూపంగా నిలిచిన వారిని మన మెవరం గమనించి ఉండం. వారే... కఠిన జల ప్రళయంలో, పైనుండి కురుస్తున్న వర్షాకు బురదగా మారిన మురికి రోడ్ల మీద, ప్రాణాంతక మైన పరిస్థితులో యాత్రీకును అక్కున చేర్చుకుని పగలూ రాత్రీ సేవా కార్యంలో నిమగ్నమైన స్వయం సేవక్ లు. కేదార్‌నాథ్‌లో మొదటి హెలిపాడ్‌ను నిర్మించటం దగ్గర నుండి, ఈ ఆపదలో అనాధలుగా మారిన చిన్న పిల్లలు చదువు ఏర్పాట్ల వరకూ ఇంకా ఈనాటికీ రాష్ట్రీయ స్వయంసేవక్‌ సంఘ సేవ చేస్తూనే ఉంది.

మనలో ఎవరు యోగేంద్ర, బ్రజ్‌ మోహన్‌ బిస్త్‌ పేర్లు విని ఉండరు. ఈ ఇద్దరు స్వయంసేవకులు వాయు సేన, సైనిక దళాలు రాకముందే ప్రైవేట్‌ హెలికాప్టర్లలో కేదార్‌నాధ్‌ చేరుకొని యాత్రికులను సురక్షిత ప్రాంతాలకు తరలించడం ప్రారంభించారు. 2013 సంవత్సరం జూన్‌ 16, 17 లో కురిసిన భారీ వర్షం మొత్తం లోయని అస్తవ్యస్తం చేసింది. సహాయ హెలికాప్టర్‌ దిగడానికి తగిన హెలిపాడ్‌ కూడా లేదు. ఈ క్లిష్ట పరిస్థితుల్లో ఈ ఇద్దరు యువకులు తమ ప్రాణాను కూడా లెక్కచేయకుండా, పారాచూట్‌ సహాయంతో దిగి మొట్టమొదటి హెలిపాడ్‌ను నిర్మించారు. ఆ తర్వాత రాయ్‌ బాడ, కేదార్‌ నాథ్‌ మందిర్‌ వెనకా ఉన్న అడవుల దగ్గర కూడా సైన్యం సహకారంతో హెలిపాడ్‌ను నిర్మించారు. వెనువెంటనే గౌరీకుండ్‌, ఘోడ పహాడ్‌, రామ్‌ బాడా, ప్రాంతాల్లో చిక్కుకు పోయిన యాత్రికులను హెలికాప్టర్ల ద్వారా తరలించడం ప్రారంభించారు. అక్కడక్కడ వీళ్ళు దాదాపు 50 అడుగు ఎత్తు నుండి తాడు సహాయంతో క్రిందకి దిగి యాత్రికులను బయటకు లాగవసి వచ్చింది. అంటే యోగేంద్ర, బ్రిజ్‌ మోహను ఇద్దరూ ఎంతో శిక్షణ పొందిన సైనికులు చేయగలిగే అన్ని పనును చేశారన్నమాట. యాత్రికులను రక్షించటం అనే ప్రధాన ఉద్దేశంతో ఎంతో సాహసం చేశారు.
పినకిల్‌ ఏవియేషన్‌ కంపెనీ ఉద్యోగులు, వారి కంపెనీ వారు కష్టమని వారించినా వినకుండా ఈ ఇద్దరు స్వయం సేవకులు ప్రజను రక్షించడం కోసం చేసిన ప్రయత్నాలకు తోడుగా నిలిచారు. ఈ విషయంలో వాళ్ళు తమ ఉద్యోగాను సైతం పణంగా పెట్టి పనిచేశారు.

ఇక గణేష్‌ ఆగొడాది మరొక అద్భుతమైన గాధ. ఇతను ఒక గుండె జబ్బుతో బాధపడుతున్న వ్యక్తిని రక్షించడం కోసం తన భుజాల మీద కూర్చోపెట్టుకుని మేజాగవ్‌ నుండి మనేరీ వరకు ఆరు కిలోమీటర్ల దూరం కాలినడకన వచ్చాడు. ఇలాంటి ఎన్నో ఉదంతాలు ఈ కేదార్‌నాథ్‌ లోయలో చూసిన వారంతా ఇప్పటికీ చెప్పుకుంటారు.
ఈ ఆపద సమయంలో ఎంతో మంది యాత్రికులకు అండగా స్వయంసేవకులు నిలిచారు. వీరు మనేరి సేవా ఆశ్రమం, చంబా లోయలోని దిఖేల్‌ గ్రామం ఊహి మఠ్‌ దగ్గరలో ఉన్న బడాడ్‌ వరకు 68 గ్రామాలో పునరావాస ఏర్పాట్లు చేసి, భోజనంతోపాటు బట్టలు ఇతర నిత్యావసర వస్తువులను పంచిపెట్టారు. కేవలం మనెరీ లోనే పదివేల మంది యాత్రీకులు భోజనాలు చేశారు. దిఖోల్‌ అనే గ్రామంలో 20 వేల మంది వ్యక్తులకు సహాయ సామాగ్రి పంపిణీ జరిగింది. చమేలి లోని సరస్వతి శిశుమందిర్‌లోనూ, మనెరిలోని సేవాశ్రంలోనూ చాలా రోజులపాటు ఈ సేవా కార్యక్రమాలు కొనసాగాయి. యాత్రికులతోపాటు సైన్యంలోని జవాన్‌లు కూడా ఇక్కడ భోజనాలు చేశారు.
వరద బీభత్సం తగ్గుముఖం పట్టగానే మిగతా సహాయక సంస్థలన్నీ తమ కార్యకలాపాను ఆపేసాయి. ప్రభుత్వం సహాయ కార్యక్రమాలు కూడా మందగించాయి. కానీ ‘ఉత్తరాఖండ్‌ దైవీయ ఆపదా సమితి' ద్వారా సంఘం నిర్వహించిన సేవా కార్యక్రమాలు అన్నీ నిరంతరం కొనసాగాయి.
గౌరీకుండ్‌, రామ్‌ బాడా, సోనార్‌ చట్టీ సోన్‌ ప్రయాగతో సహా మొత్తం కేదార్‌ ఘాట్‌లో వినాశనం నెలకొంది. స్థానిక ప్రజలు తమ ఇళ్ళు వాకిళ్ళతో పాటు ఉపాధిని కోల్పోయారు. జీవించడానికి ఏవిధమైన ఆసరా మిగలలేదు. అప్పుడే సమితి మొదలుపెట్టిన పునరావాస కార్యక్రమాలను ఇంకా చేస్తూనే ఉంది. సమితి సంఘటన కార్యదర్శి రాజేష్‌ ఆ కార్యక్రమాల వివరాలు తెలిపారు. జలప్రళయంలో అనాధలైన 6 నుండి 12 సంవత్సరాల వయసుగల 200 మంది పిల్లల కోసం నేత్‌ వాడా, క్షేశ్వర్‌, కోటి కానీ, గుప్త కాశీలో 4 హాస్టళ్లను నడిపిస్తున్నారు. ఇప్పటికీ ఇంకా కొన్ని గ్రామాలలో విద్యుత్తు సరఫరా పునరుద్ధరించబడ లేదు. ఈ గ్రామాల వారికి సోలార్‌ లాంప్‌లు అందించారు. ఈ గ్రామాలలోని 100 మంది పిల్లలకు వారి వారి చదువు కొనసాగించడానికి వీలుగా నెలకి వెయ్యి రూపాయల చొప్పున స్కాలర్‌ షిప్‌ కూడా ఇస్తున్నారు. ఇంకా ఎనిమిది గ్రామాలలో వైద్య శాలలు కూడా నిర్వహించబడుతున్నాయి. పూర్తిగా నాశనం అయిపోయిన గ్రామాలోని వితంతువులు, నిరుద్యోగ యువత కోసం కుట్టు శిక్షణ, కంప్యూటర్‌ శిక్షణ కేంద్రాలు కూడా నిర్వహిస్తున్నారు. ఇంతేకాక పిల్లల చదువు కోసం ప్రాథమిక స్థాయిలో 4 శిశు మందిరాలు, 48 బాల సంస్కార కేంద్రాలు కూడా ఇక్కడ లోయలో నడుపుతున్నారు. నారాయణ కోటిలో 30 పడకల హాస్పిటల్‌ కూడా తయారైంది. విపత్తులో నష్టపోయిన కుటుంబాలకు దాదాపు ఉచితంగా వైద్య సేవను అందిస్తున్నారు. కొంత కాలానికే అందరూ ఆ భయంకర జల ప్రళయాన్ని మరిచిపోయారు. కానీ సమితి ద్వారా స్వయంసేవకులు ఇప్పటికీ పునరావాస పనులలో నిమగ్నమయ్యే ఉన్నారు.
- సేవా గాధ