'కుటుంబ బ్యవస్థను రక్షించుకోవాలి'

 - మాననీయ శ్రీ సుబ్రహ్మణ్య భట్‌, అఖిభారత కుటుంబ ప్రబోధన్‌ సంయోజక్‌
 

మాన్యశ్రీ సుబ్రణ్య భట్‌ గారి పర్యటనలో భాగంగా కూకట్‌పల్లి భాగ్‌లో నగర ఆపైస్థాయి కార్యకర్తకందరికీ కుటుంబాలతో కూడిన సమ్మేళనం 22.2.2020 శనివారం సాయంత్రం 7 గం॥లకు కేపీహెచ్‌బి 3వ ఫేజ్‌లోని శ్రీ వాసవి కళ్యాణ మంటపంలో ఏర్పాటు చేశారు.

తెంగాణ ప్రాంత సహకార్యవాహ శ్రీ అన్నదానం సుబ్రహ్యణ్యం మాట్లాడుతూ.. ‘సమాజానికి విలువైన కుటుంబ విలువ విషయాలను అపుడపుడూ గుర్తుచేయాల్సిన అవసరముందని అందుకే కుటుంబ ప్రబోధన్‌ పని ప్రారంభమైంది. భారతీయ కుటుంబాన్ని బలోపేతం చేసేందుకు అందరం ఈ పనిలో భాగస్వాములు కావాలని’ అన్నారు. శ్రీ గొట్టెముక్కల సుభాష్‌ చంద్రబోస్‌, జిల్లా సహసంఘచాలక్‌ అధ్యక్షత వహించారు. మాతృవందనం శ్రీమతి రజిత ఆలపించారు. భారతమాత చిత్ర మాలాలంకరణతో కార్యక్రమం ప్రారంభమైంది.
మాన్యశ్రీ సుబ్రహ్మణ్య భట్‌ మాట్లాడుతూ ‘ప్రస్తుతం మన కుటుంబాలు 3 తరాలకు పరిమితమైనాయని, ఈ తరాలకు చెందిన వారంతా ఎప్పుడూ కలుస్తూ వంశాభివృద్ధి గురించి ఆలోచించాని, లేకపోతే రాబోయే కాలంలో హిందూ కుంటుంబ వంశాలు అంతరించిపోయే ప్రమాదముందని’ అన్నారు. కుటుంబ ప్రబోధనం 6 విషయాల మీద ఆధారపడి వుంది. ప్రతి ఇంట 2-5 ని॥ల పాటు భజన జరగాలి. భజనతో పాటు రామాయణం వంటి కథలు చెప్పుకోవాలి. రామాయణంలో వనవాసానికి రాముడు వెళ్ళే సమయంలో కౌసల్య రాజస గుణం, క్రికతామస గుణం, సుమిత్ర సాత్విక గుణం గురించి మన పిల్లలకు తెలియచెప్పాలి. కుటుంబ సభ్యులంతా వీలయితే రోజూ లేదా వారంలో ఒకసారి కలిసి భోజనం చేయాలి. అంతా మన మాతృభాషలోనే మాట్లాడుకోవాలి. మన ఇంట మన భాషలో వున్న సంబంధ రాచకాలైన అమ్మ, నాన్న, అక్క, చెల్లి, అమ్మమ్మ, నానమ్మ, అత్త, మామా వంటి పదాలను మన పిల్లలకు తెలియజేయాలి. సంప్రదాయ దుస్తులు ధరించేలా మన పిల్లల్ని ప్రోత్సహించాలి. మన భాషామాధ్యమంలోనే పిల్లల్ని చదివించాలి. మన ఇల్లు ఓ మందిరంగా ఉండాలి. మన ఇంట్లో దేవుని గది ఉండడం, ప్రతి రోజూ అందరూ కలసి దీపం వెలిగించి 2, 3 ని॥లు భక్తితో పూజించడం జరగాలి. మన ఇల్లు అతిధిని ఆదరించే ఆదరణాలయంగా వుండాలి. ఇంట్లో అంతా చదువు కోవాలి. మన ఇల్లు విద్యాలయంగా ఉండాలి. అలాతే ఏదో సేవ చేయాలి. ఏడాదికోసారి ఓ తీర్థక్షేత్రం సందర్శించాలి. ఆ విధంగా కటుంబం భజన్‌, భోజనం, భాష, భూష, భవన్‌, భ్రమణ్‌ అనే ఆరు విషయాకు కేంద్రమై పనిచేయాన్నారు.
వబుస మహిలలకు బొట్టుపెట్టి మహిళా కార్యకర్తలు స్వాగతం పలికారు. కార్యక్రమంలో పురుషులు 125, మహిళలు 66, బాలబాలికలు 22 మొత్తం 213 మంది పాల్గొన్నారు. శ్రీ తాడేపల్లి హనుమత్‌ప్రసాద్‌, విభాగ్‌ కుటుంబ ప్రబోధన్‌ ప్రముఖ్‌, కుటుంబప్రబోధన గీతాన్ని అందరితో పాడించారు. శ్రీ గోపాల్‌ వందన సమర్పణతో కార్యక్రమం ముగిసింది. కార్యక్రమానంతరం అందరికీ అల్పాహార వ్యవస్థ చేశారు.