అమరవాణి

నాస్తి జాత్యా రిపుర్నామ
మిత్రం వాపి న విద్యతే ।
సామర్థ్యయోగాజ్జాయన్తే
మిత్రాణిరిపవస్తథా ॥
భావం : పుట్టుకతో ఎవ్వడూ శత్రువు కాదు. ఎవ్వడూ మిత్రుడూ కాదు. ఎవరివల్ల మనకి ప్రయోజనం ఉంటుంది, ఎవరివల్ల మనకి అపకారం కలుగుతుంది అన్నదాన్ని బట్టి మిత్రులయినా, శత్రువులైనా ఏర్పడతారు.