రాజ్యాంగం పేరున దేశద్రోహం

 
ఢిల్లీ, షహీన్‌బాగ్‌లో గత ఐదు నెలుగా పౌరసత్వ సవరణ చట్టానికి వ్యతిరేకంగా ముస్లిం స్త్రీలు ధర్నా చేస్తున్నారు. రాజ్యాంగ రక్షణ అంటూ పైకి చెబుతున్నా, జాతీయ జెండాలు పట్టుకుని ఊరేగుతున్నా, వారి ఆందోళనలో ఇతర ప్రయోజనాలు కూడా స్పష్టంగా కనిపిస్తున్నాయి.  వారికి రోజూ బిరియానీలు తినిపిస్తూ, డబ్బు పంచుతున్న కొందరు నేతల వైఖరి, వారి మాటు, ప్రసంగాలలో దేశవ్యతిరేకత కనిపిస్తోంది. తాజాగా బెంగళూరులో జరిగిన సంఘటనలో కొందరు వేదిక మీదనే ద్వేషాన్ని వెదజల్లే ప్రసంగాలు చేశారు. 
వారిస్‌ పఠాన్‌, అనే నాయకుడు మాట్లాడుతూ ‘స్వాతంత్య్రం అడగమని, లాక్కుంటామని’ అన్నాడు. ఏ స్వాతంత్య్రం గురించి అతను మాట్లాడుతున్నాడు? ఎవరి నుంచి అతను స్వాతంత్య్రం కోరుకుంటున్నాడు? ఈ దేశంలో ప్రభుత్వం, రాజ్యంగం, కోర్టు నుంచి వారు స్వాతంత్య్రం కోరుతున్నారా?
ముస్లిం స్త్రీలను షాహిన్‌బాగ్‌ వద్ద ధర్నా చేయిస్తుంటేనే ప్రభుత్వానికి ముచ్చమటలు పడుతున్నాయని, ఇక తాము రంగంలోకి దిగితే ఏం జరుగుతుందో చెప్పలేమని వారిస్‌ పఠాన్‌ రంకెలు వేశాడు. చాలా రోజులు జాతీయవాదులు అభిప్రాయపడినట్లుగానే ముస్లిం స్త్రీలతో ధర్నా చేయిస్తూ వారి దేశద్రోహానికి ఈ ఆందోళనకారులు ముసుగు వేసుకున్నారని తెలుస్తూనేవుంది. చివరిగా వారిస్‌ పఠాన్‌ 100 కోట్ల మందిని ఎదుర్కొనేందుకు 15 కోట్ల మంది చాలంటూ కువ్యాఖ్యలు చేశారు. ఈ దేశంలో జనాభాగణను వ్యతిరేకిస్తున్న కొన్ని వర్గాల నైజం ఈ వ్యాఖ్యతో బయటపడింది. ఈ దేశంలో 100 కోట్ల మంది ఎవరో, 15 కోట్ల మంది ఎవరో తెలియనంత పిచ్చివాళ్లు కాదు ప్రజులు. ప్రజలను ఇలా విభజిస్తూ, ప్రజల మధ్య విద్వేషం రెచ్చగొడుతూ ప్రసంగాలు చేస్తున్న వారిస్‌ పఠాన్‌ వేదిక మీదవున్న సలాహుద్దీన్‌ ఓవైసి వారించనేలేదు. ఇంతలో ఓ 16 ఏళ్ల అమ్మాయి వేదికమీద పాకిస్తాన్‌ జిందాబాద్‌ అని నినాదాలు చేసింది. ఓవైసీ పరుగునవచ్చి ఆమె చేతిలో మైకును  లాకొని ‘ఏం మాట్లాడుతున్నావు’ అంటూ నాటకీయ ఫక్కీలో ప్రశ్నించాడు. వారిస్‌ పఠాన్‌ ప్రసంగమైనా, ఈ అమ్మాయి నినాదాలైనా ఇవన్నీ పథకం ప్రకారం దేశానికి వ్యతిరేకంగా పాఠాలు నూరిపోస్తున్న సోకాల్ట్‌ లిబరల్‌ మేధావుల కుట్రలో భాగమే. ఆ తరువాత ఆ అమ్మాయిని ప్రశ్నిస్తే ఇదే విషయం చెబుతూ బెంగుళూరు స్టూడెంట్స్‌ ఎయన్స్‌ వంటి విద్యార్థి సంస్థలు ఈ సీఏఏ వ్యతిరేక ఆందోళన వెనువున్నాయని, తాను కేవలం వారు చెప్పిందే చెప్పి మీడియా ముందు, ప్రజల ముందు దోషినయ్యానని అన్నది. కాని సబా నక్వీ వంటి సీనియర్‌ జర్నలిస్టులకు కూడా ఆ అమ్మాయి జాతి వ్యతిరేక నినాదాలు తప్పనిపించలేదు. చిన్న అమ్మాయిపై దేశద్రోహం కేసుపెట్టడం హాస్యాస్పదం అంటూ నక్వీ వ్యాఖ్యానించింది. 
తమ మహిళలను వారిస్‌ పఠాన్‌ ‘షేర్నియా’ అన్నాడు. చాలా ధైర్యవంతులు, సింహం లాంటివారు అని అర్థం. కాని వారు ధైర్యవంతులే అయితే రోజుకు రూ.500/-  వచ్చే పైకం కోసం, బిరియానీ కోసం రోజుల తరబడి రోడ్లను దిగ్బంధనం చేస్తూ కూర్చోరు. ఈ దిగ్బంధనం వల్ల 4 నెలల పసిపాప వైద్యం అందక మరణించింది. కాని ఈ దిగ్బంధనం వల్ల 13 శాతం ఓట్లు ఢిల్లీ ఎన్నికలల్లో కేజ్రీవాల్‌కు లభించి, అధికారం దక్కింది.  కేవలం రాజకీయ పబ్బం గడుపుకునేందుకే సీఏఏ వ్యతిరేక ఆందోళన జరుగుతున్నదన్నది సత్యం. ఈ దేశంలో తీవ్రవాదం ఈ తరహ విఘటనకారీ, విద్వేష పూరితమైన ఆందోళనలకు దిగుతుందని భావించడం మూర్ఖత్వమే అవుతుంది.
ఈ తరహా రెచ్చగెట్టే మాటులు, మూకలు, చేతలు హిందూ సంఘటనను మరింత బలోపేతం చేస్తాయని కుహనా లౌకికవాదు మర్చిపోకూడదు. సీఏఏపై వ్యతిరేకంగా తీర్మానం చేస్తామన్న తెలంగాణ వంటి రాష్ట్రాలు కూడా తమ చర్య ఈ దేశవ్యతిరేక చర్యకు ఊతమిస్తున్నాయని తెలుసుకుని దేశం కోసం ఆలోచించి విజ్ఞత ప్రదర్శించాలి.
- హనుమత్‌ ప్రసాద్‌