భారతజాతి అస్తిత్వం, మనుగడపై జరుగుతున్నదాడి


భారత్‌ స్వాతంత్య్రానంతరం, గత కొన్ని దశాబ్దాలుగా, ముఖ్యంగా ప్రధాని నరేంద్ర మోదీ ప్రభుత్వం ఏర్పడిన తరువాత, అంతకుముందే అన్ని రంగాల్లో, అన్ని వ్యవస్థల్లో చొచ్చుకుపోయి పాతుకు పోయిన వామపక్షవాదులు, వారి భారతదేశవ్యతిరేక భావజాలంతో దేశంలో అల్లకలోలం సృష్టిస్తున్నారు. అంతేకాక ఈ కమ్యూనిస్టులు విదేశాలనుంచి దిగుమతి అయిన మతాలకు చెందిన ఛాందస వాదులు కలిసి ఒకే కూటమిగా ఏర్పడి విద్వేషాలు రెచ్చగొడుతూ, దేశవ్యతిరేక కార్యాలకు ఎప్పటినుంచో పాల్పడుతున్నారు. అవి ఇటీవల ఢిల్లీ తదితర ప్రాంతాల్లో స్పష్టంగా బయటపడ్డాయి.

దేశంలో సీఏఏ (పౌరసత్వ సవరణ చట్టం 2019) చట్టానికి వ్యతిరేకంగా, గతకొన్ని నెలలుగా జరుగుతున్న నిరసనలు, అల్లర్లు, మత ఘర్షణలు ప్రజులు గమనిస్తున్నారు. 1947దేశవిభజన అనంతరం పాకిస్తాన్‌, ఆఫ్ఘానిస్తాన్‌, బంగ్లాదేశ్‌లలో మిగిలిన అక్కడి అల్ప సంఖ్యాకవర్గాలైన హిందువులు, శిఖ్ఖు, క్రిస్టియన్లు మొదలైనవారు, అక్కడ ఇస్లామిక్‌ రాజ్యాల మతపీడన, మానభంగాలు, మరణాలు భరించలేక, డిసెంబర్‌ 2014 లోపు ప్రాణాలు అరచేతిలో పెట్టుకుని భారతదేశం పారిపోయివచ్చిన కొన్ని వేలమందికి మాత్రమే భారత పౌరసత్వం ఇవ్వడానికి చట్టం చేయబడింది. దీనికి ఏ భారత పౌరులకి. ఏ మతానికి ఎంతమాత్రం సంబంధం లేదని, ప్రభుత్వం ఇతర సంస్థలు పదేపదే స్పష్టం చేస్తున్నా, పార్లమెంట్లో హోంమంత్రి పలుమార్లు ప్రకటించినా, ‘పరస్పర విరుద్ధ భావజాలమని’ చెప్పే వారంతా ఒక కూటమిగా ఏర్పడి దేశంలో అల్లకలోలం సృష్టించారు. ముందుగా జెఎన్యు జామియా హెచ్‌సియు జాదవపూర్‌ విశ్వభారతి వంటి విశ్వవిద్యాయాలల్లో వామపక్ష సంస్థలు విధ్వంసం సృష్టించి దేశాన్ని దిగ్భ్రాంతికి గురి చేసారు. దేశంలో ఎన్నో ప్రాంతాలో ఢిల్లీ ‘షాహీన్‌ బాగ్‌’ తరహాలో రహదారులు దిగ్బంధనం చేసి, పోలీసులు చర్య తీసుకోవడానికి వీలులేకుండా మహిళలు పిల్లల్ని ముందుంచి, వారితో దేశ నాయకును హత్య చేస్తామని నినాదాలు చేయించి, ఈ దేశంలో ‘మైనారిటీల’ ముందు అధిక సంఖ్యాకులు ఎందుకూ పనికిరారని రాజకీయ నాయకులు అక్కడ ప్రసంగాలు చేస్తూ, ప్రపంచం ముందు దేశ ప్రయోజనాల్ని, ప్రతిష్టని పణంగాపెట్టి, ప్రజల మానప్రాణాకి హాని కలిగించే ఎన్నో చర్యలు ఈ కూటమి చేపట్టింది. దీని ప్రత్యక్ష ఫలితమే, ఢిలీలో ఉగ్రవాద జిహాదీ ఛాయలున్న మతోన్మాదం, మతఘర్షణలు-నలభై మందికిపైగా మరణాలు. కుహనా విద్యావేత్తలు, కుహనా మేధావులు, అసత్య వామపక్షవాదులు, ప్రపంచ మీడియాతో కూడిన ‘వామపక్ష ఆవరణ వ్యవస్థ’ వల్లనే ఈ అలజడి రేగింది.
ప్రభుత్వ విధానాలలో కమ్యూనిస్టు సిద్ధాంతాలను చొప్పించడంలో వామపక్షాలు సఫలీకృతం అయ్యాయనే చెప్పాలి. అయితే వారు ఇంతటితో సంతృప్తి చెందలేదు. వారి విదేశీ కమ్యునిస్టులు మతాన్ని మరింత బలోపేతం చేయడానికి, క్రమ పద్ధతిలో దేశంలో విస్తృతంగా వ్యాప్తిచేసే పునాదులు దశాబ్దాలుగా వేసుకుంటూ వచ్చారు, దాని ఫలస్వరూపమే ‘వామపక్ష ఆవరణ వ్యవస్థ’.
విశ్వవిద్యాయాల్లో వామపక్ష భావజాలం మితిమీరి, ఎంతోమంది బోధనా సిబ్బంది నక్సల్‌ ఉగ్రవాద కార్యకలాపాలకు ప్రత్యక్షంగా మద్దతు ఇవ్వడం మనం చూసాము. వీరు విద్యార్థులను వావపక్షవాదులుగా తీర్చిదిద్ది, దేశ వ్యతిరేక పనులకు ఉసిగొలుపుతున్నారు. వీరి విషపూరిత వక్ర నినాదాలకు ‘భావప్రకటనా స్వేచ్ఛ’ అని ముసుగు వేస్తున్నారు. దేశంలో ఎన్నో విశ్వవిద్యాలయాలు దేశవ్యతిరేక నిలయాలుగా మారాయి. అలాగే, కొన్ని మీడియా సంస్థలు కూడా వామపక్ష విధానాలకు మద్దతునివ్వడంవల్ల వారికి ప్రచారం ఎక్కువగా లభించింది. దేశంలో ఏ గొడవ జరిగినా ఏకపక్షంగా కేవం అధికసంఖ్యాక వర్గాలనే దోషులుగా నిలబెట్టి వారిని తీవ్రమైన పదజాలంతో ఎండగడతారు. ఇవి చదివినవారు ఇవే నిజమనుకుంటున్నారు. అంతేకాక, దీనికి మరింత తీవ్ర పరిణామం, విదేశీ పత్రికలు ఈ పక్షపాత దృష్టితో ఉన్న వార్తలను ప్రచురించి, భారత దేశప్రతిష్టను కావాని దిగజార్చడం.
ప్రజాస్వామ్య భారతదేశంలో, అప్రజాస్వామికంగా అనైతికంగా రాజ్యంగ విరుద్ధంగా, ఎన్నికల్లో ఓడిపోయిన కొన్ని కూటములు / శక్తులు ఏవిధంగా ‘అధికారం’ చెలాయిస్తున్నాయో, వీరి భావజాలం మరియు చర్యవల్ల దేశం ఎంత అధోగతిపాలైందో, ఇప్పటికన్నా అర్ధం చేసుకోకపోతే భవిష్యత్తు ఉండదు.
- ప్రదక్షిణ