‌ప్రపంచానికి దారి చూపుతున్న భారత్‌

‌వ్యక్తిగానీ, జాతి లేదా దేశపు కష్టసహిష్ణుత, సమస్యలను ఎదుర్కొని, బయటపడే తీరు పెద్ద ఆపద, కష్టం, విపత్తు సంభవించినప్పుడు బయటపడతాయి. ప్రస్తుతం ప్రపంచాన్ని గడగడలాడిస్తున్న కరోనా వైరస్‌ అలాంటి పెద్ద ఆపద, కష్టమే. అగ్రరాజ్యంగా పేరుపొందిన అమెరికాతో సహా మిగతా దేశాలన్నీ ఈ సమస్యను ఎదుర్కొవడం ఎలాగో తెలియక సతమతమవు తుంటే భారతదేశం మాత్రం ధైర్యంగా నిలబడింది. సమస్య తీవ్రత, దానివల్ల జరిగే నష్టాన్ని తగ్గించడంలో చాలామటుకు విజయం సాధించింది.

సేవా వటవృక్షం ఆనంద ధామం


జీవితంలో ఎన్నో ఒడుదుడుకులు ఎదుర్కొన్నా, తమవారనేవారు దగ్గర లేకపోయినా ఆ వృద్ధులలో బెంగ, నిరాశ ఎక్కడా కనిపించవు. కళ్ళలో జీవితాను భవం, ముఖంలో ఎప్పుడు చెదరని చిరునవ్వు దర్శనమిస్తాయి. మధ్యప్రదేశ్‌ ‌రాజధాని భోపాల్‌లో సేవభారతి నిర్వహిస్తున్న ‘ఆనంద ధామమ్‌’ ‌వృద్ధులకు నిజంగా ఆనందాశ్రమమే. ఇక్కడ అనేకమంది వృద్ధులు ఆనందంగా, ఒక కుటుంబంలా కలిసి గడుపుతారు. 

సామూహిక ఉత్సవం శ్రీరామనవమి


శ్రీరాముడు వసంత ఋతువులో చైత్ర శుద్ధ నవమి నాడు పునర్వసు నక్షత్రపు కర్కాటక లగ్నంలో అభిజిత్‌ ‌ముహూర్తంలో సరిగ్గా మధ్యాహ్నం 12 గంటలకు త్రేతాయుగంలో జన్మించాడు. శ్రీరాముని జన్మతిథిని శ్రీరామ నవమిగా జరుపుకుంటారు. శ్రీ సీతారాముల కళ్యాణము కూడా నవమినాడే జరిగినదని ప్రజల విశ్వాసం. 

కరోనాకు మందు కనిపెట్టిన ప్రఫుల్ల చంద్ర రే (స్ఫూర్తి)

ప్రపంచాన్ని అతలాకుతలం చేస్తున్న కరోనాకు భారతదేశంలో 120 ఏళ్ల క్రితమే మందు తయారైంది. బెంగాల్‌కు చెందిన ప్రముఖ రసాయన శాస్త్రవేత్త, ‘భారతీయ రసాయనశాస్త్ర పితా మహుడు’గా పేరుపొందిన ప్రఫుల్ల చంద్ర రే 1901లో ప్రారంభించిన బెంగాల్‌ ‌కెమికల్స్ అనే సంస్థ కోవిడ్‌19‌కు చికిత్సకు అతి ముఖ్యమైన హైడ్రోక్సీక్లోరోక్విన్‌ అనే మందును ఉత్పత్తిచేయడం ప్రారంభించింది.

ఆత్మను ఎలా జయించాలి? (హితవచనం)


 శరీరం అంటే కేవలం కాళ్ళు, చేతులు, రక్త మాంసాలతో కూడినది మాత్రమే కాదు. అనంతమైన దృష్ఠి, అనంతమైన జ్ఞానం, అనంతమైన శక్తి, అనంతమైన ఆనందం కల్గిన ఆత్మకు శరీరం నివాసం. ఆత్మకు సహచరులెవ్వరూ ఉండరు. ఆత్మ ఒంటరిగానే వస్తుంది. ఒంటరిగానే వెళ్ళిపోతుంది.

అమరవాణి

అజీర్ణే భేషజం వారి
జీర్ణే వారి బలప్రదం
భోజనే చామృతం వారి
భోజనాన్తే  విషప్రదం.

‌ప్రముఖుల మాట


చైనా వైరస్‌వల్ల కలిగే రోగ చికిత్సకు అవసరమయ్యే హైడ్రాక్సిక్లోరోక్విన్‌ ‌మందును మాకు పెద్ద మొత్తంలో భారత్‌ అం‌దించింది. దీనికోసం మందుల ఎగుమతిపై నిషేధాన్ని కూడా తొలగించింది. ఈ సహాయాన్ని మేము ఎప్పటికీ  గుర్తుపెట్టుకుంటాం.
- డొనాల్ట్ ‌ట్రంప్‌, అమెరికా అధ్యక్షుడు

ఉచితంగా మాస్క్ ల పంపిణీ


ఆయన మధ్యప్రదేశ్‌లోని రేవా నియోజకవర్గం నుంచి బిజెపి తరఫున పార్లమెంట్‌కు ఎన్నికైన ప్రజాదరణ కలిగిన నాయకుడు. ఎంపిని కాబట్టి కేవలం అధికారం, అజమాయిషీ చేస్తే సరిపోతుందని ఆయన అనుకోలేదు. చైనా కరోనా వైరస్‌ ‌వ్యాప్తిని అరికట్టే కార్యక్రమంలో శాయశక్తులా తానూ పాలుపంచుకోవాలనుకున్నారు.

వారి సేవాభావం...


దేశ వ్యాప్తంగా చైనా కరోనా వైరస్‌ ‌వ్యాప్తిని అడ్డుకునేందుకు అనేక సంస్థలు, వ్యక్తులు తమకు తోచిన విధంగా ప్రయత్నిస్తూనే ఉన్నారు. కొందరు పేదలకు, పనికి వెళ్లలేని కూలీలకు ఆహారం, నిత్యవసర వస్తువులు అందించడానికి ప్రయత్నిస్తే, మరికొందరు మాస్క్‌లు వంటివి తయారుచేసి అందిస్తున్నారు. అలాంటి వారిలో మారుమూల గ్రామాల నుంచి, మహానగరాల వరకు, సామాన్యుల నుంచి నాయకుల వరకు అందరూ ఉన్నారు.

మహారోగం మాయమయ్యేదెలా?


ప్రపంచమంతా చైనా కరోనా వైరస్‌తో అతలా కుతలమవుతున్నది. చైనాలో ఊహన్‌ ‌మార్కెట్‌తో మొదలైన ఈ వైరస్‌ 100 ‌దేశాలను కమ్మేసింది. 112 రకాల జంతువుల్ని పచ్చిగానైనా, ఉడికించైనా, వేయించైనా చైనీయులు తినేస్తారక్కడ. ఇవాళ కరోనా వైరస్‌కు కారణం మనం ఓ విస్తృత ప్రయోజనం, ఓ విశ్వ సర్వజీవన సంతుష్ఠి కోసం మనుగడ సాగించకపోవడం, మనం ఇతర జీవజాలం, ఇతరులతో విడిపోయి జీవించడం. జీవజాతులకు అంతులేదు. 

జమ్మూకాశ్మీర్ రాష్ట్రం మొత్తానికి భారత రాజ్యాంగాన్నివర్తింపచేయడం, రాష్ట్రాన్ని పునర్వ్యవస్థీకరించడం రెండూ ప్రశంసనీయమైన చర్యలు


రాష్ట్రీయ స్వయంసేవక్‌ ‌సంఘ్‌, అఖిల భారతీయ కార్యకారీ మండలి సమావేశం - యుగాబ్ది 5121, బెంగళూరు, 14 మార్చ్, 2020
‌తీర్మానం - 1
జమ్మూకశ్మీర్‌ ‌రాష్ట్రం మొత్తానికి భారత రాజ్యాంగాన్ని వర్తింపచేయడం, గౌరవనీయ రాష్ట్రపతి ఇచ్చిన రాజ్యాంగపరమైన ఆదేశాన్ని పార్లమెంట్‌ ఉభయ సభల ఆమోదంతో 370వ అధికరణను నిర్వీర్యం చేయడం వంటి చర్యలను అఖిల భారతీయ కార్యకారీ మండలి హృదయ పూర్వకంగా స్వాగతిస్తున్నది. 

రామజన్మభూమిలో మందిర నిర్మాణం – జాతీయ గౌరవానికి ప్రతీక


రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్, అఖిల భారతీయ కార్యకారీ మండలి సమావేశం యుగాబ్ది 5121, బెంగళూరు, 14 మార్చ్, 2020.
తీర్మానం – 2
జాతి ఆకాంక్షలకు అనుగుణంగా అయోధ్య రామజన్మభూమిలో భవ్య మందిర నిర్మాణం విషయమై ఎదురవుతున్న  అడ్డంకులనన్నింటిని  గౌరవనీయ సర్వోన్నత న్యాయస్థానం తన ఏకగ్రీవమైన తీర్పు ద్వారా పూర్తిగా తొలగించిందని ఆర్ ఎస్ ఎస్ అఖిల భారతీయ కార్యకారీ మండలి భావిస్తోంది. 9 నవంబర్, 2019 న గౌరవనీయ సర్వోన్నత న్యాయస్థానం రామజన్మభూమి విషయమై ఇచ్చిన తీర్పు దేశ న్యాయస్థానాల చరిత్రలోనే చిరస్థాయిగా నిలిచిపోతుంది.

పౌరసత్వ సవరణ చట్టం, 2019 – భారత్ నైతిక, రాజ్యాంగ కర్తవ్యం


రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్, అఖిల భారతీయ కార్యకారీ మండలి సమావేశం యుగాబ్ది 5121, బెంగళూరు 14 మార్చ్, 2020.
తీర్మానం – 3
పొరుగున ఉన్న మూడు ముస్లిం దేశాలైన పాకిస్థాన్ , బంగ్లాదేశ్, ఆఫ్ఘనిస్తాన్ లలో మతపరమైన వివక్షకు గురై భారత్ కు వచ్చిన హిందువులు, బౌద్ధులు, జైనులు, పార్శీలు, క్రైస్తవులకు భారత పౌరసత్వాన్ని కల్పించే ప్రక్రియలో క్లిష్టతను తగ్గించి సులభతరం చేయడానికి వీలుకల్పించే పౌరసత్వ సవరణ చట్టం, 2019 ఆమోదించిన పార్లమెంట్ ను, అమలుచేసిన కేంద్ర ప్రభుత్వాన్ని ఆర్ ఎస్ ఎస్ అఖిల భారతీయ కార్యకారీ మండలి హృదయపూర్వకంగా అభినందిస్తున్నది.

కరోనాపై పోరుకు భారత రక్షణ పరిశోధన అభివృద్ధి సంస్థ చేయూత


ప్రపంచాన్ని అతలాకుతలం చేస్తున్న ప్రాణాంతక కరోనా మహమ్మారిపై భారత ప్రభుత్వం సాగిస్తోన్న పోరుకు దేశీయ రక్షణ పరిశోధన మరియు అభివృద్ధి సంస్థ (DRDO) తోడ్పాటు నందిస్తోంది. 

ఆమె కృషి అభినందనీయం


ఇప్పుడు ప్రపంచమంతటా వినిపిస్తున్న మహమ్మారి పేరు కరోనా... ఇప్పుడిప్పుడే మనదేశం లోనూ ఇది విజృంభిస్తోంది. వ్యక్తిగత పరిశుభ్రత, సామాజిక దూరమే ఈసమస్యకి పరిష్కారమార్గం. మన చుట్టుపక్కల ఎవరైనా సరే దగ్గినా, తుమ్మినా కాస్త నీరసంగా కనిపిస్తున్నా అనుమానించే రోజులు వచ్చేసాయి. కరోనా లక్షణాలు కనిపించినప్పుడు వాటిని నిర్ధారించు కోవాల్సిన అవసరం ఎంతగానో ఉంది. విదేశాల నుంచి తెచ్చిన కరోనా టెస్టింగ్‌ ‌కిట్స్ ఆరేడు గంటల్లో ఫలితం తేల్చినా అవి సరిపోవడం లేదు. ఈసమస్యకు చెక్‌ ‌పెట్టింది పూణేకి చెందిన ప్రముఖ వైరాలజిస్ట్ ‌మినాల్‌ ‌దఖావే భోస్లే.

మూత్రపిండ రోగాల నివారణ


-  పల్లేరు కాయల చూర్ణం పూటకు చెంచా మోతాదులో అరకప్పు నీటిలో కలిపి తాగుచున్న అన్ని రకాల మూత్రపిండ సమస్యలు నయం అగును.
-  ప్రతిపూట జీలకర్ర కషాయం పావుకప్పు తాగుచున్న మూత్రపిండాలకు బలం చేకూర్చును.

ఆర్‌ఎస్‌ఎస్‌ ‌దేశవ్యాప్తంగా కరోనా సహాయ కార్యక్రమాలు


కరోనా వైరస్‌ ‌వ్యాప్తిని అరికట్టేందుకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు చేపట్టిన కార్యక్రమాలకు సహకారం అందించడంతోపాటు రాష్ట్రీయ స్వయంసేవక్‌ ‌సంఘ్‌ ‌స్వయంసేవకులు దేశ వ్యాప్తంగా బాధితులకు అనేక సేవాకార్యక్రమాలు చేపట్టారని ఆర్‌ఎస్‌ఎస్‌ ‌తెలంగాణ ప్రాంత కార్యవహ శ్రీ కాచం రమేశ్‌ ‌తెలియజేశారు. కరోనా వ్యాప్తిని అరికట్టడానికి విధించిన లాక్‌డౌన్‌ ‌మూలంగా ప్రజలు ఇబ్బందులకు గురవుతున్నారని వారికి తగిన సహాయం అందించడానికి దేశవ్యాప్తంగా లక్షలాది మంది స్వయంసేవకులు పనిచేస్తున్నారని ఆయన తెలియజేశారు.