మూత్రపిండ రోగాల నివారణ


-  పల్లేరు కాయల చూర్ణం పూటకు చెంచా మోతాదులో అరకప్పు నీటిలో కలిపి తాగుచున్న అన్ని రకాల మూత్రపిండ సమస్యలు నయం అగును.
-  ప్రతిపూట జీలకర్ర కషాయం పావుకప్పు తాగుచున్న మూత్రపిండాలకు బలం చేకూర్చును.

-  బొబ్బర్లు ఉడకబెట్టి గుగ్గిళ్ల వలే ఉదయం మరియు సాయంత్రం గుప్పెడు మోతాదులో తీసుకొనుచున్న మూత్రపిండ సమస్యలు నివారణ అగును.
-  ఉత్తరేణి చెట్టు సమూల కషాయాన్ని పూటకు పావుకప్పు తాగుచున్న త్వరగా సమస్య నయం అగును.
-  చేమంతి రేకుల చూర్ణాన్ని పూటకు చెంచా మోతాదులో తీసుకొనుచున్న త్వరగా మూత్రపిండ సమస్యలు నివారణ అగును. ఈ చూర్ణాన్ని పంచదార లో కలిపి తీసుకోవచ్చు.
పైన చెప్పిన యోగాలలో మీకు ఏది సులభ ముగా ఆచరించగలరో చూసుకుని ప్రయత్నించండి. అదేవిధముగా మూత్రపిండ సమస్య ఉన్నవారు శరీరానికి వేడి కలిగించే వస్తువులు తినకూడదు . మినుములు, కూల్‌ ‌డ్రింక్స్, ‌ఫ్రిజ్‌ ‌నీరు, నూనె వేపుళ్ళు, వంకాయ, గోంగూర, పాత పచ్చళ్లు అసలు తినరాదు.