ఉచితంగా మాస్క్ ల పంపిణీ


ఆయన మధ్యప్రదేశ్‌లోని రేవా నియోజకవర్గం నుంచి బిజెపి తరఫున పార్లమెంట్‌కు ఎన్నికైన ప్రజాదరణ కలిగిన నాయకుడు. ఎంపిని కాబట్టి కేవలం అధికారం, అజమాయిషీ చేస్తే సరిపోతుందని ఆయన అనుకోలేదు. చైనా కరోనా వైరస్‌ ‌వ్యాప్తిని అరికట్టే కార్యక్రమంలో శాయశక్తులా తానూ పాలుపంచుకోవాలనుకున్నారు.

లాక్‌ ‌డౌన్‌ ‌మూలంగా ఇంటి నుంచి కదిలే పరిస్థితి లేకపోయినా ఎప్పుడో నేర్చుకున్న కుట్టు పనిని ఉపయోగించి మాస్క్‌లు తయారు చేస్తున్నారు జనార్దన మిశ్రా. స్వయంగా మిషన్‌పై మాస్క్‌లు తయారు చేసి వాటిని ఉచితంగా పంపిణీ చేస్తున్నారు.