‌ప్రముఖుల మాట


చైనా వైరస్‌వల్ల కలిగే రోగ చికిత్సకు అవసరమయ్యే హైడ్రాక్సిక్లోరోక్విన్‌ ‌మందును మాకు పెద్ద మొత్తంలో భారత్‌ అం‌దించింది. దీనికోసం మందుల ఎగుమతిపై నిషేధాన్ని కూడా తొలగించింది. ఈ సహాయాన్ని మేము ఎప్పటికీ  గుర్తుపెట్టుకుంటాం.
- డొనాల్ట్ ‌ట్రంప్‌, అమెరికా అధ్యక్షుడు


రామాయణంలో హను మంతుడు హిమాలయాల నుంచి సంజీవిని మూలిక తెచ్చి లక్ష్మణుని కాపాడినట్లు భారత్‌ ఎం‌తో అవసరమైన మందు లను సరఫరా చేసి మాకు ఎంతో సహాయ పడింది. ఈ సహాయానికి కృతజ్ఞతలు.
- జైర్‌ ‌బొల్సోనారో, బ్రెజిల్‌ అధ్యక్షుడు


నేను ఎక్కడికి వెళ్ళినా జనం ‘రాముడు’ అనే పిలుస్తున్నారు. ‘రామాయణం’ సీరియల్‌ ‌తరువాత నన్ను దేవుడిగా చూడటం మొదలుపెట్టారు. ఆ తరువాత నాకు అన్నీ దేవుడి పాత్రలే వచ్చాయి. 33 ఏళ్ళ తరువాత కూడా నన్ను జనం అలాగే చూస్తుండడం గొప్ప గౌరవంగా భావిస్తున్నాను.
- అరుణ్‌ ‌గోవిల్‌, ‘‌రామాయణం’లో రాముడి పాత్రధారి