అమరవాణి

అజీర్ణే భేషజం వారి
జీర్ణే వారి బలప్రదం
భోజనే చామృతం వారి
భోజనాన్తే  విషప్రదం.

భావం : మంచి నీళ్ళు అజీర్ణసమయంలో  ఎక్కువగా త్రాగితే మందులా పనిచేస్తాయి. తిన్న•ది అరిగిన తరువాత త్రాగితే బలాన్ని ఇస్తాయి. తినేటప్పుడు కొంచెం కొంచెం త్రాగితే అమృతంలా పనిచేస్తాయి. భోజనం చివర ఎక్కువగా త్రాగితే విషంలా మారతాయి.  కాబట్టి నీటిని ఒక క్రమపద్ధతిలో త్రాగాలి.