వారి సేవాభావం...


దేశ వ్యాప్తంగా చైనా కరోనా వైరస్‌ ‌వ్యాప్తిని అడ్డుకునేందుకు అనేక సంస్థలు, వ్యక్తులు తమకు తోచిన విధంగా ప్రయత్నిస్తూనే ఉన్నారు. కొందరు పేదలకు, పనికి వెళ్లలేని కూలీలకు ఆహారం, నిత్యవసర వస్తువులు అందించడానికి ప్రయత్నిస్తే, మరికొందరు మాస్క్‌లు వంటివి తయారుచేసి అందిస్తున్నారు. అలాంటి వారిలో మారుమూల గ్రామాల నుంచి, మహానగరాల వరకు, సామాన్యుల నుంచి నాయకుల వరకు అందరూ ఉన్నారు.

భద్రాచలం జిల్లా చర్లలో ఉన్న తిప్పాపురం చాలా చిన్న, మారుమూల గిరిజన గ్రామం.  రోడ్డు సదుపాయం కూడా సరిగాలేని ఈ గ్రామంలో సమస్యలు చాలానే ఉన్నాయి. ఇప్పటికీ మావోయిస్ట్‌ల ప్రభావం ఎక్కువగా ఉంది. అలాంటి గ్రామానికి చెందిన నూప వీరస్వామి కుటుంబం సేవభారతి కార్యక్రమాల్లో చురుకుగా పాల్గొంటుంది. ఆయన సోదరి సేవభారతి ఆధ్వర్యంలో కుట్టు శిక్షణ కూడా పొందింది. తన శిక్షణను ఉపయోగించి ఆ అమ్మాయి కరోన వైరస్‌ ‌వ్యాప్తిని అరికట్టే మాస్క్‌లు తయారుచేసి అందిస్తోంది. కరోనపై పోరులో తనవంతు సహాయాన్ని అందజేస్తోంది.