కరోనా కష్టాన్ని అవకాశంగా మార్చుకున్న భారత్


వైద్య సూట్ ల తయరీలో స్వావలంబన
కరోన సంక్షోభం వల్ల అనేక విషయాలు బయటపడ్డాయి. మన అలవాట్లు, ప్రాచీన కాలం నుంచి వస్తున్న పద్దతులు మనల్ని ఎలా కాపాడాయో తెలిసింది. అలాగే దేశంలోని వివిధ వర్గాల వారు ఈ సంకట సమయంలో ఎలా ప్రవర్తించారో, కొందరి బాధ్యతారహితమైన తీరు దేశం మొత్తంలో ఎలా ప్రమాదాన్ని పెంచిందో స్పష్టమయింది. దీనికి తోడు దేశంలో ఉన్న అంతర్గత శక్తి సామర్ధ్యాలు కూడా ప్రపంచానికి వెళ్లడయ్యాయి. 

సికార్‌లో వెల్లివిరిసిన సంస్కారం

 
రాజస్థాన్‌ ‌సికార్‌ ‌జిల్లాలోని రెండు పాఠశాలల్లో 54మంది వలస కూలీలను ఉంచారు. కరోనా వైరస్‌ ‌వ్యాపించకుండా వారిని ఇక్కడ ఉంచారు. వీరంతా హరియాణ, రాజస్థాన్‌, ‌మధ్యప్రదేశ్‌, ఉత్తర్‌ ‌ప్రదేశ్‌ ‌లకు చెందినవారు. పల్సానా పట్టణంలోని రెండు పాఠశాలల్లో ఏర్పాటు చేసిన క్వారంటైన్‌ ‌కేంద్రాల్లో వీరిని ఉంచారు. వారికి ఎలాంటి ఇబ్బంది కలగకుండా గ్రామస్తులు అన్ని సదుపాయాలు కలిగించారు. వేళకి భోజనం, అవసరమైన మందులు అందించిన గ్రామస్తుల పెద్దమనసుకు ఈ వలస కార్మికులు ముగ్ధులయ్యారు. 

అమరవాణి


పితృభిః తాడితః పుత్రః
శిష్యస్తు గురు శిక్షితః
ధనాహతం సువర్ణంచ
జాయతే జన మండనమ్‌


భావం : తండ్రి చేత దెబ్బలు తిన్న కొడుకు, గురువు దగ్గర శిక్షణ పొందిన శిష్యుడు, సుత్తి దెబ్బలు తిన్న బంగారం, లోకానికి అలంకారం కావడం తథ్యం. విజయం తేలికగా లభించదు - కష్టపడితేనే సుఖం లభిస్తుంది.

శ్రీ ‌నృసింహ అవతారం


మే 17, నృసింహ జయంతి సందర్భంగా
శ్రీ మహావిష్ణువు దశావతారాల్లో నాలుగవ అవతారం నారసింహావతారం. కశ్యప ప్రజాపతి దితిగర్భాన హిరణ్యాక్ష, హిరణ్య కశ్యపులనే మహా వీరులైన రాక్షసులు జన్మించారు. హిరణ్యాక్షుడిని వరాహరూపంలో ఉన్న మహా విష్ణువు వధించాడు.

మన్యంవీరుడు అల్లూరి సీతారామరాజు (స్ఫూర్తి)


బ్రిటిష్‌ ‌ప్రభుత్వంపై సాయుధపోరాటం చేసిన తెలుగువీరుడు అల్లూరి సీతా రామరాజు. 1897 జూలై 4న పశ్చిమగోదావరి జిల్లా భీమవరం తాలూకా మోగల్లు గ్రామంలో జన్మించాడు. తండ్రి వెంకట్రామరాజు, తల్లి నారాయణమ్మ. దేశాన్ని అన్నివిధాలుగా దోచుకునేందుకు ప్రయత్నిస్తున్న బ్రిటిష్‌వారి కళ్ళు అడవి ప్రాంతాలపైన కూడా పడ్డాయి. తూర్పు గోదావరి జిల్లా మన్యం అడవులలో నివసించే గిరిజనులను బ్రిటిష్‌ అధికారులు హింసలకు గురిచేశారు.

చరిత్రను చెప్పాలి.. (హితవచనం)

హిందూదేశం ఎల్లపుడూ ఏదో ఒక విదేశీ పాలనలో ఉండేది, దాని చరిత్ర నిరంతర పరాభవాల గాధ అంటూ అబద్దాలతోను, అవమానాల తోను కూడిన దుర్మార్గ ప్రచారం కొనసాగింది. ఈ ప్రచారం కేవలం విదేశీయుల చేతనే గాక స్వజనుల చేత కూడా అడ్డూ, ఆపు లేకుండా కొనసాగింది. 

‌ప్రముఖుల మాట


కరోన సంక్షోభం ప్రపంచంలో పాలనా లోపాల్ని బయట పెట్టింది. అంతర్గత ఇబ్బందు లను ఎదుర్కొంటున్నా భారత్‌ ఈ ‌క్లిష్ట సమయంలో అంతర్జా తీయ స్థాయిలో మెరుగైన పనితీరును, సామర్ధ్యాన్ని కనబరచింది.
- సయ్యద్‌ అక్బరుద్దీన్‌, ఐరాసలో భారత మాజీ ప్రతినిధి

స్వావలంబనే భవ్యభారతానికి ఆధారం -డా. మోహన్‌ ‌భాగవత్‌, ఆర్‌ఎస్‌ఎస్‌ ‌సర్‌ ‌సంఘచాలక్‌


‘130 ‌కోట్ల మంది భారతీయులందరూ మనవారేననే స్నేహ, ప్రేమ, గౌరవపూర్వక భావంతో కరోన బాధితులకు సేవ చేద్దాం. భయం, క్రోధం వంటి అవలక్షణాలకు లోనుకాకుండా అందరితో కలిసి, అందరి కోసం పనిచేయడమే నేటి ఆవశ్యకత’ అని ఆర్‌ఎస్‌ఎస్‌ ‌సర్‌ ‌సంఘ చాలక్‌ ‌డా. మోహన్‌ ‌భాగవత్‌ అన్నారు. కరోన మహమ్మారి వల్ల ఏర్పడిన పరిస్థితులు, వాటి నుంచి మనం నేర్చుకున్న పాఠాలను మరచిపోకుండా స్వావలంబన, స్వదేశీ విధానాన్ని అవలంబించి నూతన భారతాన్ని నిర్మించుకోవాలని ఆయన దేశ ప్రజానీకానికి పిలుపునిచ్చారు. అటువంటి భారతదేశం ప్రపంచానికి ఎంతో మేలు చేస్తుందని ఆయన అన్నారు. దేశ ప్రజానీకాన్ని ఉద్దేశించి ఆయన ఆన్‌లైన్‌  ‌ప్రసార మాధ్యమాల ద్వారా ఏప్రిల్‌ 26‌న ప్రసంగించారు.

హిందూ హితం మంటగలిసింది


ప్రపంచమంతా కరోనా వ్యాధిని కట్టడిచేసే ప్రయత్నంలో ఉండే భారతదేశంలో మాత్రం కరోనాతోబాటు కొన్ని విచ్ఛిన్నకర శక్తులను కూడా కట్టడి చేయాల్సిన పరిస్థితి దాపురించింది. ఢిల్లీలో తబ్లిగి జమాత్‌ ‌కార్యక్రమంలో పాల్గొన్న కొంత మంది విదేశీయుల కారణంగా భారత్‌లో లాక్‌డౌన్‌ ‌మరింత ముందుకు సాగింగి. లేకపోతే ఏప్రిల్‌ 15‌ నాటటికి ముగిసి ఉండేది. దీనికేమాత్రం మతం రంగు పులమకుండా అందరికీ ఆరోగ్యమే లక్ష్యంగా  కేంద్ర ప్రభుత్వం తబ్లిగిజమాత్‌ ‌కార్యక్రమంవల్ల కరోనా బారిన పడ్డ వారందరినీ కార్వంటైన్‌కు తరలించే ప్రయత్నం చేసింది.

ఇం‌ట్లో ఖాళీగా కూర్చోకుండా ఆ దంపతులు ఏకంగా బావినే తవ్వేశారు.

ఎగతాళి చేసిన పొరిగింటివాళ్ళే ప్రశంసించారు...
వాళ్లు కష్టాన్ని నమ్ముకున్న జీవులు. ఇంట్లో ఖాళీగా ఉండి టీవీలు, మొబైళ్లు చూస్తూ.. వెరైటీ వంటకాలు వండుతూ కాలక్షేపం చేయలేని నిరుపేదలు. లాక్‌డౌన్‌ ‌వల్ల బయట పనులు లేక ఇంటికే పరిమితమైన ఆ దంపతులకు.. ఎన్నాళ్ల నుంచో ఎదుర్కొంటున్న నీటి సమస్య గుర్తుకొచ్చింది. తమ నీటి అవసరాలు తీరాలంటే బావి ఉండాలని భావించారు. కానీ, మొదట్లో అది సాధ్యమేనా అని సందేహించారు. ప్రయత్నిస్తే పోయేది ఏముందని ఆ పనికి నడుంకట్టారు. చివరికి సాధించారు. ఈ ఘటన మహారాష్ట్రలోని వసీం జిల్లా కర్ఖేడా గ్రామంలో జరిగింది.

పేద కుటుంబాన్ని ఆదుకున్న కానిస్టేబుల్‌

‌తమిళనాడు తిరుచ్చి జిల్లాలోని మారుమూల గ్రామంలో డ్యూటీ చేస్తున్న ఒక పోలీస్‌ ‌కానిస్టేబుల్‌ ఒక పేద కుటుంబాన్నిఆదుకుని మంచికి, మానవత్వానికి ఉదాహరణగా నిలిచాడు. తాను చేసిన సహాయాన్ని గురించి తెలుసుకుని పై అధికారులు ఇచ్చిన నగదు పురస్కారాన్ని కూడా ఆ కుటుంబానికి అందజేశాడు.

అన్నదానం మహా దానం....

 
ఆంధ్రా ప్యారీస్‌ ‌తెనాలి అనేక కళారంగాలతో పాటు వేదవిద్యలకు కూడా ఖ్యాతిగాంచింది. ఇక్కడి వేదపండితులు దేశవ్యాప్తంగా ప్రసిద్ధిగాంచారు.... వారిలో విష్ణుభట్ల వారు ప్రముఖులు, శ్రీమాన్‌ ‌విష్ణుభట్ల శ్రీరామచంద్ర పౌండరీక యాజులు గారు, వారి పెద్ద కుమారులు శ్రీమాన్‌ ఆం‌జనేయ చయణులు గారు, వారి ఇద్దరి కుమారులు శ్రీమాన్‌ ‌యజ్ఞ రామకృష్ణ పౌండరీక యాజులు (రామయ్య) గారు, శ్రీమాన్‌ ‌యజ్ఞ నారాయణ గార్లు సోమ, పాక, పౌండరీక యాగం లాంటి ఎన్నో యాగాలు దేశం నలుమూలల నిర్వహించి వేదధర్మ ప్రతిష్టాపన చేస్తున్నారు.

లాక్‌-‌డౌన్‌ ‌సమయంలో ప్రతిపూటా భోజనం..

అన్నార్తుల సేవలో కరీంనగర్‌ ‌యువకులు
‘‘సేవాహి పరమో ధర్మః’’.. సేవ అన్నిటినీ మించిన ధర్మం అన్న పెద్దల మాటలను కరీంనగర్‌ ‌పట్టణానికి చెందిన యువకులు స్పూర్తిగా తీసు కున్నారు. ఈ స్ఫూర్తితోనే ‘‘స్పందన వెల్ఫేర్‌ ‌సొసైటీ’’ పేరిట ఏర్పాటు చేసిన స్వచ్ఛంద సంస్థ ద్వారా వివిధ సహాయక కార్యక్రమాలు చేపడుతున్నారు. ఇందులో భాగంగా దేశవ్యాప్త లాక్‌-‌డౌన్‌ ‌మొదలైన నాటి నుండి పట్టణంలో ఆకలితో ఉన్న వారికి కడుపు నింపే మహత్తర కార్యక్రమం నిర్వహిస్తు న్నారు. లాక్‌-‌డౌన్‌ ‌నాటి నుండి ప్రతి రోజూ రెండు పూటలా పట్టణంలోని సివిల్‌ ‌హాస్పటల్‌ ‌మరియు ఇతర ప్రధాన కూడళ్ల వద్ద భోజన వితరణ చేపడు తున్నారు. స్వచ్చంధ సంస్థకు చెందిన యువకు లందరూ కలిసి, దాతల సహాయంతో నిర్వహిస్తున్న ఈ కార్యక్రమం స్థానిక ప్రభుత్వ అధికారుల పర్యవేక్షణలో నిర్విరామంగా కొనసాగుతోంది.

‘‌కాడ’ కషాయం త్రాగండి - రోగనిరోధకశక్తి పెంచుకోండి మన శరీరం రోగ నిరోధక శక్తిని పెంచుకోవడానికి మన ప్రాచీన ఆయుర్వేదం చెప్పిన ‘కాడ’ కషాయం త్రాగాలని ఆయుర్వేద నిపుణులు సూచిస్తుంటారు. కరోనా సంక్షోభ సమయంలో ఈ కాడ కషాయం మరోసారి జనానికి తెలిసింది.

వారి కృషి అభినందనీయం

కరోనా వైరస్‌ ‌నుంచి రక్షించుకోవాలంటే మాస్కులు ధరించడం, సామాజిక దూరం, వ్యక్తిగత పరిశుభ్రత అనేవి మాత్రమే మార్గం. ఇలాంటి సమయంలో మాస్క్‌లు మార్కెట్లో విరివిగా దొరకట్లేదు. సానిటీజర్లు కూడా అంతంత మాత్రంగానే లభ్యమవుతున్నాయి. ఈ సవాళ్ళని అధిగమించడానికి ఇటు ఇంటిపనులని అటు సామాజిక బాధ్యతల్ని సక్రమంగా నిర్వర్తిస్తున్నారు కొందరు మహిళలు. వాళ్ల గురించి మనం కూడా తెలుసుకుందాం.

విశాఖ విషవాయువు బాధితులకు అండగా ఆర్‌.ఎస్‌.ఎస్‌ ‌స్వయంసేవకులు

విశాఖపట్నంలోని వెంకటాపురం ఎల్‌. ‌జి పాలిమర్స్ ‌కర్మాగారం నుండి రసాయన వాయువు వెలువడిన ఘటన ఈ నెల 7న జరిగింది. దీంతో చుట్టుపక్కల ప్రాంతాల ప్రజలు తీవ్ర అస్వస్థతకు గురయ్యారు. ఈ దుర్ఘటనలో 12మంది ప్రాణాలు కోల్పోయారు. 400మందికి పైగా తీవ్ర అస్వస్థతతో ఆసుపత్రిపాలయ్యారు. అనేక పశువులు, ఇతర జంతువులు కూడా పెద్ద సంఖ్యలో చనిపోయాయి.