‘‌కాడ’ కషాయం త్రాగండి - రోగనిరోధకశక్తి పెంచుకోండి మన శరీరం రోగ నిరోధక శక్తిని పెంచుకోవడానికి మన ప్రాచీన ఆయుర్వేదం చెప్పిన ‘కాడ’ కషాయం త్రాగాలని ఆయుర్వేద నిపుణులు సూచిస్తుంటారు. కరోనా సంక్షోభ సమయంలో ఈ కాడ కషాయం మరోసారి జనానికి తెలిసింది.

‘కాడ’ కషాయం తయారు చేసే పద్ధతి
అల్లం, సొంఠి, మిరియాలు మూడూ కలిపి మెత్తగా పొడిచేయాలి. ఆ పొడిని నీటిలో వేసి బాగా మరిగించాలి. చివరిగా ఆ వేడి నీటిలో కొన్ని తులసి ఆకులు వేసి మరి కొద్దిసేపు మరగనివ్వాలి. ఇప్పుడు కషాయం సిద్ధం. ఈ కషాయాన్ని వడగట్టి కప్పు నిండుగా పోసుకుని త్రాగాలి. ఇలా ప్రతి రోజూ ఉదయం పరగడుపున ఈ కషాయం త్రాగితే మీ శరీరంలో రోగనిరోధక శక్తి పెరుగుతుంది.