‌ప్రముఖుల మాట


కరోన సంక్షోభం ప్రపంచంలో పాలనా లోపాల్ని బయట పెట్టింది. అంతర్గత ఇబ్బందు లను ఎదుర్కొంటున్నా భారత్‌ ఈ ‌క్లిష్ట సమయంలో అంతర్జా తీయ స్థాయిలో మెరుగైన పనితీరును, సామర్ధ్యాన్ని కనబరచింది.
- సయ్యద్‌ అక్బరుద్దీన్‌, ఐరాసలో భారత మాజీ ప్రతినిధి


ఒక వ్యాధి రావడం నేరం కాదు. కానీ కరోనా వంటి మహమ్మారి గురించి చెప్పకుండా దాచడం మాత్రం కచ్చితంగా నేరమే. చట్టాన్ని ఉల్లంఘించే వారిపై చర్యలు తప్పవు.
- యోగి ఆదిత్యనాధ్‌, ఉత్తర్‌ ‌ప్రదేశ్‌ ‌ముఖ్యమంత్రి


లాక్‌డౌన్‌ ‌సమయంలో ముస్లింలను కూడా స్వయం సేవకులు ఆదుకున్నారు. సహాయ సహకారాలు అందిం చారు. మాస్క్‌లు, సానిటైజర్లు ఇచ్చారు. ఇందుకు పలువురు ముస్లిం నాయకులు ఆర్‌ఎస్‌ఎస్‌ను ప్రశంసిస్తున్నారు.
- దత్తాత్రేయ హోసబళే, సహ సర్‌కార్యవాహ, ఆర్‌ఎస్‌ఎస్‌