అన్నదానం మహా దానం....

 
ఆంధ్రా ప్యారీస్‌ ‌తెనాలి అనేక కళారంగాలతో పాటు వేదవిద్యలకు కూడా ఖ్యాతిగాంచింది. ఇక్కడి వేదపండితులు దేశవ్యాప్తంగా ప్రసిద్ధిగాంచారు.... వారిలో విష్ణుభట్ల వారు ప్రముఖులు, శ్రీమాన్‌ ‌విష్ణుభట్ల శ్రీరామచంద్ర పౌండరీక యాజులు గారు, వారి పెద్ద కుమారులు శ్రీమాన్‌ ఆం‌జనేయ చయణులు గారు, వారి ఇద్దరి కుమారులు శ్రీమాన్‌ ‌యజ్ఞ రామకృష్ణ పౌండరీక యాజులు (రామయ్య) గారు, శ్రీమాన్‌ ‌యజ్ఞ నారాయణ గార్లు సోమ, పాక, పౌండరీక యాగం లాంటి ఎన్నో యాగాలు దేశం నలుమూలల నిర్వహించి వేదధర్మ ప్రతిష్టాపన చేస్తున్నారు.

 ప్రపంచాన్ని వణికిస్తున్న కరోనా వ్యాధి నేపథ్యంలో దేశవ్యాప్తంగా లాక్డౌన్‌ ‌విధించడం అందరికీ తెలిసిందే. ఈ నేపథ్యంలో తెనాలి పట్టణంలో వీరు 25 రోజులుగా వండిన వంట వండకుండా వండి రోజుకి సుమారు వెయ్యి మందికి పైగా పేద ప్రజలు ఉండే కాలనీలకు వెళ్ళి స్వయంగా ఆహారాన్ని అందించారు. ఈ మహా అన్నదాన సంతర్పణలో వారి కుటుంబ సభ్యులతో పాటు పదిమంది వంటవారు పాల్గొన్నారు. యజ్ఞంలో పరమాత్మకు సమర్పించే హవిస్సులా వీరు చేసిన సంతర్పణ ఆ పరమాత్మకు తృప్తినిస్తుంది అనటంలో ఎటువంటి అతిశయోక్తి లేదు.