అమరవాణి


పితృభిః తాడితః పుత్రః
శిష్యస్తు గురు శిక్షితః
ధనాహతం సువర్ణంచ
జాయతే జన మండనమ్‌


భావం : తండ్రి చేత దెబ్బలు తిన్న కొడుకు, గురువు దగ్గర శిక్షణ పొందిన శిష్యుడు, సుత్తి దెబ్బలు తిన్న బంగారం, లోకానికి అలంకారం కావడం తథ్యం. విజయం తేలికగా లభించదు - కష్టపడితేనే సుఖం లభిస్తుంది.