హిందూ హితం మంటగలిసింది


ప్రపంచమంతా కరోనా వ్యాధిని కట్టడిచేసే ప్రయత్నంలో ఉండే భారతదేశంలో మాత్రం కరోనాతోబాటు కొన్ని విచ్ఛిన్నకర శక్తులను కూడా కట్టడి చేయాల్సిన పరిస్థితి దాపురించింది. ఢిల్లీలో తబ్లిగి జమాత్‌ ‌కార్యక్రమంలో పాల్గొన్న కొంత మంది విదేశీయుల కారణంగా భారత్‌లో లాక్‌డౌన్‌ ‌మరింత ముందుకు సాగింగి. లేకపోతే ఏప్రిల్‌ 15‌ నాటటికి ముగిసి ఉండేది. దీనికేమాత్రం మతం రంగు పులమకుండా అందరికీ ఆరోగ్యమే లక్ష్యంగా  కేంద్ర ప్రభుత్వం తబ్లిగిజమాత్‌ ‌కార్యక్రమంవల్ల కరోనా బారిన పడ్డ వారందరినీ కార్వంటైన్‌కు తరలించే ప్రయత్నం చేసింది.
మార్చినెలలో లాక్‌ ‌డౌన్‌ ‌ప్రకటించే సమయానికి మర్కజ్‌లో 1746 మంది ఉన్నట్లు సమాచారం, వీరు కాకుండా మరో 824 మంది ప్రచారం నిమిత్తం వివిధ రాష్ట్రాలకు వెళ్ళారు. వీళ్ళ ద్వారా కరోనా వ్యాప్తి బాగా జరిగింది. కరోనా గురించి చికిత్సకోసం తీసుకెళితే కొందరు మర్కజ్‌ ‌సభ్యులు చేసిందేమిటి? కొందరు ఎక్కడబడితే అక్కడ ఉమ్మడం, మూత్రం చేయడం, కలిసి ప్రార్థనలు చేయడం, మాంసాహారం కోసం డిమాండ్‌ ‌చేయడం, డాక్టర్లను, నర్సులను తిట్టడం, మసీదుల్లో దాక్కొని రాకపోవడం, ఇవన్నీ మీడియా చూపించింది. ఇంత జరిగినా వీళ్ళనెవరూ ఒక్కమాట అనలేదు. ఏదీ అనకుండానే వీళ్ళని బూచిగా చూపి భారతీయ ముస్లింలందరినీ వివక్షకు గురిచేస్తున్నారని, అనుమానాస్పదంగా చూస్తున్నారని సామాజిక మాధ్యమాలలో ఇస్లామాఫోబియా అనే అంశం చర్చిస్తున్నారు కొందరు కుహనా లౌకికవాదులు. పాకిస్తాన్‌ ‌ప్రధాని ఇమ్రాన్‌ ‌కూడా ఈ విషయం లేవనెత్తారు. భారత్‌లో వివిధ పార్టీలు కూడా దానికి వంతపాడాయి. తబ్లిగిజమాత్‌లో పాల్గొని కరోనా బారిన పడి ఆసుపత్రుల్లో నిస్సిగ్గుగా ప్రవర్తిస్తున్నవారిని వారి మత పెద్దలు, మౌల్వీలు, ముల్లాలు, ఓవైసీవంటి నాయకులు ఖండించనేలేదు. పైగా గుజరాత్‌లో ఒక హాస్పిటల్‌లో మతం పేరున కోవిడ్‌ ‌పేషంట్స్‌ను విడిగా ఉంచారన్న యూఎస్‌సిఐఆర్‌ఐ (అం‌తర్జాతీయ మత స్వేచ్ఛపై అమెరికాకు చెందిన ఓ సంస్థ) వార్తను కేంద్ర ప్రభుత్వం ఖండించినా కొందరు తమ అప ప్రచారం ఆపలేదు.
మరోపక్క పాక్‌ ‌సైన్యం సరిహద్దులలో కాల్పులకు తెగబడుతూనే ఉంది. మహారాష్ట్రలోని పాల్గర్‌లో (ముంబైకి 120 కి.మీ. దూరంలో ఉన్నది) జునా అఖాడాకు చెందిన ఇద్దరు సాధువులను, ఒక డ్రైవరును 200 మంది కక్షతో పోలీసుల సమక్షంలోనే మూకదాడి చేసి చంపివేశారు. ఏప్రిల్‌ 16‌న ఇది జరిగితే ఏప్రిల్‌ 19 ‌వరకు మహారాష్ట్ర పోలీసులు స్పందించ లేదు. ఆ తరువాత 110 మందిని అరెస్టు చేశారు. పైగా కరోనా లాక్‌డౌన్‌ ‌నేపథ్యంలో ‘దొంగలు ఊరిమీద పడతారన్న’ వదంతులు నమ్మి సాధువులను దొంగలుగా భావించి చంపారని అబద్దాలు ప్రసార మాద్యమాలు ప్రచారం చేశాయి. పవిత్ర జునా అఖాడా సాధువులకు దేశం నుంచి మొగలాయిలను తరిమికొట్టి దేశాన్ని రక్షించిన చరిత్ర వుంది. క్రీ.శ. 1146లో ప్రారంభించబడిన జునా అఖాడా 1664లో దశనామి అఖాడాతో కలిసి ఔరంగ జేబుతో యుద్ధం చేసింది. వారణాసిలో ఔరంగజేబు సేనలను పారద్రోలి విశ్వనాథ మందిరాన్ని కాపాడిన సాధువుల మండలి అది. 1669 వరకు మళ్ళీ ఔరంగజేబు విశ్వనాథ మందిరం వైపు చూడలేదు. ఎవరికీ అపకారం చేయని ఈ సాధువులను నిర్దారుణంగా చంపడం హిందూ సమాజాన్ని తీవ్రంగా కలచివేసింది. కేవలం హిందూ సంస్థలు తప్ప తథాకథిత కుహనా మేధావులెవరూ ఈ దాడిని ఖండించలేదు.
మరోవైపు సిఏఏ, ఎన్‌ఆర్‌సిలకు వ్యతిరేకంగా ఢిల్లీలో అల్లర్లు సృష్టించిన షారూక్‌పఠాన్‌, ‌లోహిర్‌ ‌హుస్సేన్‌, ఉమర్‌ ‌ఖలీద్‌లను UAPA (Unlawful Activities Prevention Act) క్రింద అరెస్ట్ ‌చేశారు. వీధుల్లోకి వచ్చి డొనాల్డ్‌ట్రంపు పర్యటన సందర్భంగా నిరసన తెలిపాలని ఉమర్‌ఖలీద్‌ ఉ‌ద్రేకపూరిత ప్రసంగాలు చేస్తే, అమ్‌ఆద్మీ పార్టీ కార్పొరేటర్‌ ‌వాహిర్‌హుస్సేన్‌ ‌ఢిల్లీ బహిరంగంగా హింసకు పాల్పడ్డాడు. ఢిల్లీ అల్లర్లలో  ఇంటలిజెన్స్ అధికారి అంకిత్‌శర్మ శవం మురుగు కాల్వలో కన్పించింది. ఈ అల్లర్లలో 53 మంది చనిపోయారు. షారూక్‌ ‌ఫఠాన్‌ ‌పిస్టలు ధరించి పోలీసులపై కాల్పులు జరిపాడు. దేశద్రోహులకు శిక్షపడింది.
మొత్తానికి దేశవ్యాప్తంగా కరోనా సంక్షోభంతో పాటు సామాజికపరమైన కల్లోలం కూడా ప్రజల్ని కుదిపేసింది. జాతీయభావన, దానిని నిలబెట్టుకునేందుకు రాజీపడకుండా నిలబడే తత్వం చాలా అవసరమని ఈ పరిణామాలు చెపుతున్నాయి.
- ‌హనుమత్‌‌ప్రసాద్‌