పేద కుటుంబాన్ని ఆదుకున్న కానిస్టేబుల్‌

‌తమిళనాడు తిరుచ్చి జిల్లాలోని మారుమూల గ్రామంలో డ్యూటీ చేస్తున్న ఒక పోలీస్‌ ‌కానిస్టేబుల్‌ ఒక పేద కుటుంబాన్నిఆదుకుని మంచికి, మానవత్వానికి ఉదాహరణగా నిలిచాడు. తాను చేసిన సహాయాన్ని గురించి తెలుసుకుని పై అధికారులు ఇచ్చిన నగదు పురస్కారాన్ని కూడా ఆ కుటుంబానికి అందజేశాడు.

 పురిటి నెప్పులతో బాధపడుతున్న ఒక మహిళకు వెంటనే ఆపరేషన్‌ ‌చేయాలని, అందుకు ఒక యూనిట్‌ ‌రక్తం అవసరమవుతుందని డాక్టర్లు చెప్పారు. కానీ లాక్‌ ‌డౌన్‌ ‌మూలంగా బయటకు అడుగుపెట్టడానికి వీలులేని పరిస్థితుల్లో రక్తం ఎక్కడ నుంచి తేవాలో తెలియక ఆ మహిళా కుటుంబ సభ్యులు ఆందోళన పడ్డారు. ఎలాగైనా ప్రయత్నించి రక్తం తీసుకురావాలని ఆమె భర్త బయటకు వచ్చాడు. కానీ అక్కడే ఉన్న కానిస్టేబుల్‌ ‌లాక్‌ ‌డౌన్‌ ‌నియమాలను ఉల్లంఘించి బయటకు ఎలా వెళతావని అడ్డుకున్నాడు. కానీ పరిస్తితి తెలుసుకున్న ఆ 23 ఏళ్ల కానిస్టేబుల్‌ ‌స్వయంగా రక్తం ఇవ్వడానికి సిద్ధపడ్డాడు. దానితో ఆ పేద మహిళ గండం నుంచి గట్టెక్కింది. మగ పిల్లవాడిని ప్రసవిం చింది.
కానిస్టేబుల్‌ ‌చూపిన చొరవకు, చేసిన సమయోచితమైన సహాయాన్ని తెలుసుకున్న జిల్లా ఎస్పీ అతనికి వెయ్యి రూపాయలు పురస్కారం ఇచ్చారు. అలాగే తమిళనాడు రాష్ట్ర డిజిపి ఏకంగా పది వేల రూపాయలు ఇచ్చారు. అయితే ఆ యువ కానిస్టేబుల్‌ ‌పదకొండు వేల రూపాయలను ఆ మహిళా ఆసుపత్రి ఖర్చుల కోసం ఇచ్చేశాడు.