అయోధ్యలో ఉన్నది రామమందిరమే


తాజా తవ్వకాల్లో బయటపడ్డ నాటి ఆలయ అవశేషాలు
అయోధ్యలో శ్రీరాముడి ఆలయాన్ని ధ్వంసం చేసి ఆ ప్రదేశంలో బాబ్రీ కట్టడం  నిర్మించారన్నది పచ్చి నిజం, నిర్వివాదాంశం. సుప్రీంకోర్టు చారిత్రక తీర్పు మేరకు అయోధ్యలో శ్రీరామ భవ్యమందిరం పునర్నిర్మాణం కోసం పనులు వేగవంతం అయ్యాయి. మే 11 నుండి ప్రారంభమైన పనుల్లో భాగంగా బాబ్రీకట్టడ ప్రాంతంలో జరిపిన తవ్వకాల్లో నాటి శ్రీరామ మందిరం తాలూకు అనేక చారిత్రక అవశేషాలు లభ్యమయ్యాయి. దీంతో అక్కడ మందిరం ఉండేది అంటూ 1975, 2002 సంవత్సరాల్లో  భారతీయ పురాతత్వ శాఖ (ఆర్కియోలాజికల్‌ ‌సర్వే ఆఫ్‌ ఇం‌డియా) సమర్పించిన రిపోర్టులకు మరింత బలం చేకూరింది.

కష్టకాలంలో స్వయంసేవకుల స్ఫూర్తి


అది పూణె మహానగరం, పైగా వేసవి కాలం. 40 డిగ్రీల మండే ఎండలో ఒక యువతి తన 10 మంది బృందంతో కలిసి భవానీపేట్‌లోకి ప్రవేశించింది. ఇంటింటికీ వెళుతూ కరోనా పరీక్షలు నిర్వహిస్తోంది. ఆమె పేరు సమృద్ధి జథర్‌. ‌రాష్ట్రీయ స్వయంసేవక్‌ ‌సంఘ్‌ ‌జనకళ్యాణ్‌ ‌సమితి ప్రతినిధిననీ, రోజూ ఇలా కంటైన్న్మెంట్‌ ‌జోన్‌లలో కరోనా పరీక్షలు నిర్వహిస్తున్నామని చెప్పింది. తానే కాదు తనలాగా మరో 675 మంది కార్యకర్తలు పని చేస్తున్నారని చెప్పింది.

‌ప్రముఖుల మాట


ఉగ్రవాదం మానవత్వానికే శత్రువు. ప్రపంచ శాంతికి అడ్డంకి. ఈ ఉగ్రవాదాన్ని ప్రోత్సహించే దేశాలను ఒంటరి చేయాలి. దీనికి అన్ని దేశాలూ పూనుకోవాలి.
- ఎం. వెంకయ్యనాయుడు, ఉపరాష్ట్రపతి 

అమరవాణి

విద్వత్వం చ నృపత్వం చ
నైవ తుల్యం కదాచన
స్వదేశే పూజ్యతే రాజా
విద్వాన్‌ ‌సర్వత్ర పూజ్యతే

భావం : అధికారం, పాండిత్యంతో ఎప్పటికీ సరి సమానం కాదు. ఎందుకంటే  ఒక రాజు తన దేశంలోనే గౌరవం పొందుతాడు. కానీ, విద్వాంసుడుప్రపంచమంతా పూజించ బడతాడు.

జగన్నాథ రథయాత్ర


పూరీ జగన్నాథ దేవాలయం ఒడిషా రాష్ట్రంలో బంగాళాఖాతం తీరాన ఉన్న పూరీ పట్టణంలో గల ఒక ప్రాచీన, దేవాలయము.  ఆలయ విగ్రహాలు చెక్కతో తయారు చేసి ఉండటం ఇక్కడి ప్రత్యేకత. ఆలయంలో శ్రీకృష్ణుడు, సుభద్ర, బలరామ సమేతంగా దర్శనమిస్తాడు. జగన్నాథుడు (విశ్వానికి ప్రభువు) పేరుతో ఆలయ దైవం యుంటుంది. . ప్రతి హిందువు తన జీవితకాలంలో తప్పక దర్శించవలసిన ‘‘ఛార్‌ ‌థాం’’ పుణ్యక్షేత్రాలలో ఈ దేవాలయం కూడా ఉంది.

‌శివాజీ నిర్భీతి.. (స్ఫూర్తి)


భయం ఒక అదృశ్యశక్తి. అది ఎలాంటివారినైనా కుంగదీస్తుంది. కానీ శివాజీ మహరాజులో ఈ భయం లేదు. రాజా జయసింగ్‌ను కలవడానికి వెళ్ళినప్పుడు నిరాయుధుడై, కేవలం ఆరుగురు బ్రాహ్మణులను వెంటపెట్టుకుని వెళ్ళాడు. శత్రు శిబిరంలో ఆరురోజులపాటు ఉన్నాడు. అక్కడ తనకు ప్రాణాపాయం ఉందని బాగా తెలుసు. 

భారత మాత సుపుత్రుడు శివాజీ


చత్రపతి శివాజీ సాక్షాత్తూ పరమ శివుడి అంశతో జన్మించిన దైవాంశసంభూతుడు. హైందవ ధర్మాన్ని రక్షించటానికి ఒక యుగ పురుషుడు   ఉద్భవించబోతున్నాడని ఆకాలంలో మహారాష్ట్రలోని జ్యోతిష్య పండితులకు ముందుగా తెలుసు. సాధువులు, సంతులు కుతూహ లంతో ఎదురు చూశారు. 

‌గ్రామీణ భారతాన్ని నిర్మించాలి


- డా. మన్మోహన్‌ ‌వైద్య, సహ సర్‌ ‌కార్యవాహ, ఆర్‌ ఎస్‌ ఎస్‌ 

‌భారతదేశం ఎప్పుడూ కేవలం తన మంచిని మాత్రమే చూసుకోలేదు. తనతోపాటు విశ్వకళ్యాణం గురించి కూడా ఆలోచించింది. ‘‘ఆత్మనో మోక్షార్ధ జగత్‌ ‌హితాయ చ’’ అనేదే భారత్‌ ‌ధోరణి, వ్యవహారం కూడా.
‘స్వదేశీ సమాజ్‌’ అనే తన పుస్తకంలో గురుదేవులు రవీంద్రనాధ్‌ ‌టాగూర్‌ ఇలా వ్రాసారు - ‘‘మనం ఏమిటో ముందు మనం అది కావాలి’’. ఈ ‘మనం’ అంటే ఆధ్యాత్మిక చింతన. దీనిలో ఏకాత్మ దృష్టి, సర్వజీవకోటి పట్ల ఆదరం ఉన్నాయి.

‘ఆత్మనిర్భర భారతం’ పిలుపు గెలుపిక అవశ్యం


‘విజయశీలి కావాలి అందరం సంకల్పం చేయాలి అందరం
ప్రతి అడుగు అవకాశం, అందిపుచ్చుకొనుటె బలం
అలసత్వం వీడి మనం విశ్వాసం కల్గి మనం’
కరోనా కాటుకు ప్రపంచం విలవిలలాడింది. కాని కరచాలనం ఖర్మచాలనమైనదగ్గరనుంచి 123 దేశాలకు హైడ్రాక్సీక్లోరోక్విన్‌ ‌మందుల్ని సరఫరా చేసేదాకా భారత్‌కు అవకాశాల పంట పండింది. నమస్కారంతో విశ్వభారతి ఆవిష్కరణ జరిగింది. ప్రకృతిని తల్లిగా భావించిన దేశం మనది. తల్లిని సేవించడం తప్ప శోషించడం మనకు తెలియదు. ప్రకృతి ఓ విజ్ఞానం.

మద్రాస్‌ ‌యూనివర్సిటీలో ఆగిన హిందూ వ్యతిరేక సమావేశం


హిందూ సంస్కృతీ సంప్రదాయాలపై దాడి చేయటమే లక్ష్యంగా  మద్రాసు యూనివర్సిటీలోని డిపార్ట్ ‌మెంట్‌ ఆఫ్‌ ‌క్రిస్టియన్‌ ‌స్టడీస్‌ ఆధ్వర్యంలో నిర్వహించ తలపెట్టిన అంతర్జాతీయ సమావేశం ఆగిపోయింది. అమెరికాకు చెందిన ఎలోన్‌ ‌క్రైస్తవ యూనివర్సిటీతో కలిసి జులై 21 నుండి 24 వరకు చెన్నైలో ఈ సమావేశం నిర్వహించ తలపెట్టారు. ‘భారతదేశంలో మతాలపై అధ్యయనం’ కోసం నిర్వహించ తలపెట్టిన ఈ సమావేశంపై సర్వత్రా విమర్శలు తలెత్తాయి. హిందూ ఆచార వ్యవహారాలే లక్ష్యంగా అమెరికన్‌ ‌క్రైస్తవ యూనివర్సిటీలు, క్రైస్తవ మిషనరీ సంస్థల ప్రోద్బలంతో ఈ సమావేశం నిర్వహిస్తున్నట్టు వివిధ హిందూ సంఘాలు ఆగ్రహం వ్యక్తం చేశాయి.

వలస కార్మికులకు ఆహారం అందించిన ఆర్‌ఎస్‌ఎస్‌ ‌కార్యకర్తలు


లాక్‌డౌన్‌ ‌మూలంగా వలస కార్మికులు పనులు లేక, అటు స్వస్థలాలకు వెళ్లలేక ఇబ్బందులు పడుతున్నారంటూ విమర్శలు చేసిన వారు ప్రత్యేక రైళ్ల ద్వారా వారిని తమ ఊళ్ళకు తరలించడానికి ప్రభుత్వం చేస్తున్న ప్రయత్నాలకు సహకరించడానికి మాత్రం ముందుకు రాలేదు. 

పర్యావరణ పరిరక్షణ ప్రతి పౌరుడి కర్తవ్యం


జూన్‌ 5‌న ప్రపంచవ్యాప్తంగా పర్యావరణ దినోత్సవంగా జరుపుకుంటారు. ఇది ఒక మహత్తర కార్యక్రమం.  ఈ కార్యక్రమం ప్రపంచవ్యాప్తంగా పర్యావరణంపై ఏర్పడే దుష్పరిణామాలను ఎదుర్కోవడానికి ప్రజలను జాగృత పరుస్తుంది.

మహిళా నీకు వందనం


ఆకాశంలో సగం మగువ అనడం పాత మాట... ఆమె ఆకాశంలోనే సగం కాదు శ్రమలోనూ సగమే.. ఆమాటకొస్తే సగానికన్నా ఎక్కువ పాత్ర మహళలదే అని గర్వంగా చెప్పుకోవచ్చు.. నిజానికీ ఇపుడే కాదు ఎపుడూ మహిళల శ్రమశక్తి అనంతం. ఆదిమ కాలం నుంచి అత్యాధునిక కాలం వరకు సమాజ గమనంలో, పురోగమనంలో మహిళల శ్రమ చెప్పుకోదగినది.. ప్రపంచమంతటా విస్తరిస్తున్న కరోనా కష్టకాలంలో ఇంటా, బయటా మహిళల శ్రమ వర్ణించనలవిగాదు...

అల్లం


కరోన కాలంలో ఆలోచన అంతా వైరస్‌ ‌బారినపడకుండా ఉండడం ఎలా అనే. పరిశుభ్రతతో పాటు పౌష్టికాహారం తీసుకోవడం ద్వారా శరీరంలో రోగ నిరోధకశక్తి పెంపొందించు కోవాలని ఆయుష్‌ ‌మంత్రిత్వ శాఖ సూచిస్తోంది. ఈ రోగనిరోధక శక్తిని పెంపొందించే అనేక పదార్ధాలను మనం ఇప్పటికే విరివిగా వాడుతున్నాం. కాబట్టి ఆ అలవాటును కొనసాగిస్తే సరిపోతుంది. ఇలాంటి పదార్ధాల్లో ఒకటి అల్లం. దీని వల్ల ఎన్నో ఉపయో గాలు ఉన్నాయి. 

అజాన్‌ ‌కోసం లౌడ్‌ ‌స్పీకర్లు ఉపయోగించరాదు

అజాన్‌ (‌నమాజ్‌కు రావాలనే పిలుపు) కోసం లౌడ్‌ ‌స్పీకర్లు, ఇతర శబ్ద పరికరాలు ఉపయోగిం చడం ఇస్లాంలో తప్పనిసరి, మౌలిక విషయం కాదని, కేవలం గొంతెత్తి పిలవడం మాత్రమే ఉన్నదని, అది మాత్రమే అనుమతిస్తామని అలహా బాద్‌ ‌హైకోర్ట్ ఒక చరిత్రాత్మక తీర్పులో పేర్కొంది. 

భారత్‌పై నేపాల్‌ ‌ప్రధాని వివాదాస్పద వ్యాఖ్యలు


చైనాతో భారత్‌ ‌సరిహద్దు వివాదం మరోసారి తెరమీదకు వచ్చిన నేపథ్యంలో నేపాల్‌ ‌ప్రధాని కేపీ ఓలీ వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. ఇటీవల భారత భూభాగాలను తమ దేశంలోని ప్రదేశాలుగా చూపిస్తూ నూతన భూగోళ పటాలను విడుదల చేసిన విషయం తెలిసిందే.