మద్రాస్‌ ‌యూనివర్సిటీలో ఆగిన హిందూ వ్యతిరేక సమావేశం


హిందూ సంస్కృతీ సంప్రదాయాలపై దాడి చేయటమే లక్ష్యంగా  మద్రాసు యూనివర్సిటీలోని డిపార్ట్ ‌మెంట్‌ ఆఫ్‌ ‌క్రిస్టియన్‌ ‌స్టడీస్‌ ఆధ్వర్యంలో నిర్వహించ తలపెట్టిన అంతర్జాతీయ సమావేశం ఆగిపోయింది. అమెరికాకు చెందిన ఎలోన్‌ ‌క్రైస్తవ యూనివర్సిటీతో కలిసి జులై 21 నుండి 24 వరకు చెన్నైలో ఈ సమావేశం నిర్వహించ తలపెట్టారు. ‘భారతదేశంలో మతాలపై అధ్యయనం’ కోసం నిర్వహించ తలపెట్టిన ఈ సమావేశంపై సర్వత్రా విమర్శలు తలెత్తాయి. హిందూ ఆచార వ్యవహారాలే లక్ష్యంగా అమెరికన్‌ ‌క్రైస్తవ యూనివర్సిటీలు, క్రైస్తవ మిషనరీ సంస్థల ప్రోద్బలంతో ఈ సమావేశం నిర్వహిస్తున్నట్టు వివిధ హిందూ సంఘాలు ఆగ్రహం వ్యక్తం చేశాయి.

చెన్నైకి చెందిన న్యాయవాది అశ్వత్థామన్‌ ‌తమిళనాడు రాష్ట్ర గవర్నరుకు, కేంద్ర హోమ్‌ ‌శాఖ, విదేశీ మంత్రిత్వ శాఖకు ఫిర్యాదు చేశారు. మద్రాసు యూనివర్సిటీలోని డిపార్ట్ ‌మెంట్‌ ఆఫ్‌ ‌క్రిస్టియన్‌ ‌స్టడీస్‌ ‌తలపెట్టిన అంతర్జాతీయ కార్యక్రమం హిందూ వ్యతిరేకమైనదని, దానిపై తగిన చర్యలు తీసుకోవాలని కోరారు.
ఈ కార్యక్రమంపై లీగల్‌ ‌రైట్స్ ‌ప్రొటెక్షన్‌ ‌ఫోరమ్‌ ‌కేంద్ర విదేశీ వ్యవహారాల మంత్రికి, మంత్రిత్వ శాఖ కార్యదర్శికి ఫిర్యాదు చేసింది. దీని వెనుక అమెరికా ప్రభుత్వానికి చెందిన ‘యునైటెడ్‌ ‌స్టేట్స్ ‌కౌన్సిల్‌ ‌ఫర్‌ ఇం‌టర్నేషనల్‌ ‌రిలీజియస్‌ ‌ఫ్రీడమ్‌’ (USCIRF) పాత్ర ఉందని పేర్కొంది. ఇప్పటికే అమెరికాకు చెందిన క్రైస్తవ యూనివర్సిటీలలో ఆ దేశ ఇంటలిజెన్స్ ‌సంస్థ ‘సెంట్రల్‌ ఇం‌టలిజెన్స్ ఏజెన్సీ’ (సిఐఎ) కార్యకలాపాలు తీవ్రంగా ఉండటం, అక్కడి విద్యార్థులను సిఐఎ తమ కార్యకలాపాల కోసం ఎంపిక చేసుకోవ డంతో పాటు, ఆయా క్రైస్తవ యూనివర్సిటీలకు ఈ ఇంటలిజెన్స్ ‌సంస్థ ఆర్ధిక సహాయం కూడా అందజేస్తున్న విషయాన్ని పలు మీడియా సంస్థలు బహిర్గతం చేసినట్లు ఫోరం గుర్తుచేసింది. ఈ నేపథ్యంలో అత్యంత అనుమానా స్పద, వివాదాస్పదమైన ఇటువంటి సమావేశానికి అనుమతి ఇవ్వడం ఏ విధంగానూ దేశానికి క్షేమం కాదని, దీనిపై వెంటనే చర్యలు తీసుకోవాలని లీగల్‌ ‌రైట్స్ ‌ప్రొటెక్షన్‌ ‌ఫోరమ్‌ ‌తమ ఫిర్యాదులో కేంద్ర విదేశీ మంత్రిత్వ శాఖను కోరింది. ఈ నేపథ్యంలో సమావేశాన్ని ‘కరోనా లాక్‌డౌన్‌’ ‌నేపథ్యంలో వాయిదా వేస్తున్నట్టు నిర్వాహకులు తమ అధికారిక వెబ్‌సైట్‌లో ప్రకటించారు. అయితే ఇది కరోనా నేపధ్యం కారణంగా వాయిదా పడటం కాదని, హోంశాఖ నుండి భద్రతాపరమైన అనుమతులు లేనందునే రద్దు అయివుంటుంది అని లీగల్‌ ‌రైట్స్ ‌ప్రొటక్షన్‌ ‌ఫోరమ్‌ ‌తమ ప్రకటనలో అభిప్రాయపడింది.