పర్యావరణ పరిరక్షణ ప్రతి పౌరుడి కర్తవ్యం


జూన్‌ 5‌న ప్రపంచవ్యాప్తంగా పర్యావరణ దినోత్సవంగా జరుపుకుంటారు. ఇది ఒక మహత్తర కార్యక్రమం.  ఈ కార్యక్రమం ప్రపంచవ్యాప్తంగా పర్యావరణంపై ఏర్పడే దుష్పరిణామాలను ఎదుర్కోవడానికి ప్రజలను జాగృత పరుస్తుంది.


ప్రపంచవ్యాప్తంగా వేగంగా విస్తరిస్తున్న కాలుష్యానికి ప్రముఖ కారణాలు :
1. జల కాలుష్యం, 2.వాయు కాలుష్యం,     3.భూ కాలుష్యం.
జల కాలుష్యం
భూగోళంపై 80శాతం జలం విస్తరించి ఉంది. అయినప్పటికీ తాగడానికి ఉపయోగపడే శుద్ధమైన నీరు దొరకడం లేదు. స్వచ్ఛమైన నీటి లభ్యత మూడు శాతం కంటే తక్కువగా ఉంది. ఎక్కువ శాతం నీరు కాలుష్యం అధికమై లేదా ఉప్పు నీటి రూపంలో ఉంది. లభించే కొద్దిపాటి శుద్ధజలం మానవ చర్యల వల్ల కలుషితమై కేవలం మానవులే కాక సమస్త ప్రాణి జగత్తు ముఖ్యంగా జలచరాలు తీవ్రంగా ప్రభావితం అవుతున్నాయి. జలకాలుష్యాన్ని ఆపడానికి మనం తీవ్రంగా ప్రయత్నం చేయాల్సి ఉంటుంది. ఎందుకంటే వ్యవసాయానికి, త్రాగడానికి స్వచ్ఛమైన నీరు అత్యంత ఆవశ్యకం. జలాన్ని సంరక్షించడం మరియు పరిశుభ్రంగా ఉంచడం మనందరి నైతిక బాధ్యత. పర్యావరణ పరిశోధకుల కథనం ప్రకారం వృక్షాలను నిర్దాక్షిణ్యంగా నరికి వేయడం కారణంగా నీటిని సంరక్షించే వృక్షజాతులు తరిగిపోయి అనావృష్టి సమస్య ఉత్పన్నమవుతుంది. కాబట్టి పెద్ద ఎత్తున మొక్కలు నాటడం చేపట్టాలి. మనం నదులను కాలువలను ఎప్పటికప్పుడు శుభ్రపరుస్తూ వాటిని సంరక్షించుకోవాలి.
వాయు కాలుష్యం
మానవ ప్రేరిత చర్యల వల్ల వాతావరణంలో కొన్ని విషపూరితమైన వాయువులు చేరి, ప్రాణ వాయువు కూడా కాలుష్యపూరితంగా మారిపో యింది. 2016లో వెలువడ్డ ఒక సర్వే రిపోర్ట్ ఆధారంగా ప్రపంచ వ్యాప్తంగా 90% ప్రజలు కాలుష్య పూరితమైన వాయువులు పీల్చుకునే దుస్థితిలో ఉన్నారు. దీని కారణంగా అనేక రకాలైన శ్వాసకోశ రోగాలు, క్యాన్సర్‌ ‌వంటి భయంకరమైన వ్యాధులు సంభవిస్తున్నాయి. వేగంగా విస్తరిస్తున్న ఈ కాలుష్యం వల్ల సహజంగానే సమస్త ప్రాణి కోటి మరియు వృక్ష జాతులు ప్రమాదంలో పడ్డాయి.
భూ కాలుష్యం
మానవుడు పుణ్యదాయిని పవిత్రమైన భూమిని తన స్వార్థ ప్రయోజనాలు సుఖభోగాల కోసం అనేక రకాలుగా నష్టపరుస్తున్నాడు. గృహ వ్యర్థాలు, చెత్తాచెదారం మన భూమి దెబ్బతింటోంది. వరల్డ్ ఎకనామిక్‌ ‌ఫోరం నివేదిక ఆధారంగా భారత్‌ ‌లో ఏటా యాభై ఆరు లక్షల టన్నుల చెత్త ఉత్పత్తి అవుతోంది. దీనివల్ల 2020 నాటికి 12 బిలియన్‌ ‌టన్నుల చెత్త పోగుపడి దాన్ని శుభ్రపరచడానికి వందల సంవత్సరాలు పట్టవచ్చు.
నేడు ప్రపంచ పర్యావరణ కాలుష్యము ఒక విపత్కర ఉపద్రవంలా నిలబడి ఉంది. ఈ ప్రమా దాన్ని నివారించడానికి రాష్ట్రీయ స్వయంసేవక్‌ ‌సంఘ్‌ అనేక కార్యక్రమాలు చేపట్టింది. ప్లాస్టిక్‌ ‌వాడకంవల్ల కలిగే అనర్ధాలను ప్రజలకు తెలియ జేస్తోంది. అలాగే పెద్ద ఎత్తున మొక్కలు నాటే కార్యక్రమం చేపట్టింది. మొక్కలు నాటిన తరువాత వాటి సంరక్షణ బాధ్యత స్థానిక ప్రజలకే అప్పజెపుతు న్నారు. 2018 సంవత్సరంలో రాష్ట్రీయ స్వయం సేవక్‌ ‌సంఘ్‌ 15 ఆగస్టు నుండి 22 ఆగస్టు వరకు చేపట్టిన ఒక కార్యక్రమంలో దేశ రాజధాని ఢిల్లీలో 10 లక్షలకుపైగా మొక్కలు నాటడం జరిగింది. పరిసరాల అవసరాలను దృష్టిలో ఉంచుకుని, ముఖ్యంగా నీడనిచ్చే, ఔషధ గుణాలున్న మొక్కలు నాటారు. ఈ మొక్కలు నాటే కార్యక్రమం ఢిల్లీలోని ప్రతి ప్రాంతంలో చేపట్టారు.