‌ప్రముఖుల మాట


ఉగ్రవాదం మానవత్వానికే శత్రువు. ప్రపంచ శాంతికి అడ్డంకి. ఈ ఉగ్రవాదాన్ని ప్రోత్సహించే దేశాలను ఒంటరి చేయాలి. దీనికి అన్ని దేశాలూ పూనుకోవాలి.
- ఎం. వెంకయ్యనాయుడు, ఉపరాష్ట్రపతి 


కరోనా వైరస్‌ ‌మూలంగా ప్రపంచంలో చైనాకు బాగా చెడ్డపేరు వచ్చింది. దానితో ఆ దేశం ఆత్మరక్షణలో పడింది. దీని నుంచి బయటపడటం కోసం, ప్రపంచం దృష్టిని మరల్చడం కోసం భారత్‌తో కయ్యానికి కాలుదువ్వింది.
- నిరుపమా రావు,  చైనాలో భారత మాజీ రాయబారి 


చెర్నోబిల్‌ అణు ప్రమాదాన్ని బయటపెట్టినట్లుగానే ఏదో ఒక రోజున కరోన వైరస్‌ ‌వ్యాప్తి గురించి నిజాలు బయటకు తెస్తాం. వూహాన్‌లో ఏం జరిగింది అనేది చైనా చెప్పడం లేదు, దర్యాప్తుకు అంగీకరించడం లేదు. అయినా అధ్యయనం చేసి వాస్తవాలు బయటపెడతాం.
- రాబర్ట్ ఒ‌బ్రీన్‌,  అమెరికా జాతీయ భద్రతా సలహాదారు