చైనా దూకుడుకు భారత్‌ ‌కళ్ళెం


‘యుద్ధం చేయకుండానే శత్రువును జయించు’ అన్న సున్‌ ‌జో సూత్రాన్ని తుచ తప్పకుండా అనుసరించాలని చైనా చాలా ప్రయత్నం చేస్తుంటుంది. నేరుగా యుద్ధానికి దిగకుండా సరిహద్దు వివాదాలను సృష్టించి పొరుగుదేశాల భూభాగాలను కబళించడం ద్వారా సామ్రాజ్యాన్ని విస్తరించుకోవాలని చూస్తుంటుంది. అలాగే నాసిరకమైన వస్తువుల్ని పెద్దసంఖ్యలో తయారుచేసి ఇతర దేశాల మార్కెట్‌లను ముంచెత్తి ఆర్థిక విస్తరణకు పాల్పడుతోంది. చైనా ఇటీవల లఢఖ్‌ ‌ప్రాంతంలో పాల్పడిన చొరబాట్ల వల్ల భారత, చైనాల మధ్య తీవ్ర ఉద్రిక్తతలు నెలకొన్నాయి.

11 రోజుల్లో వెయ్యి పడకల ఆసుపత్రి నిర్మించిన రక్షన పరిశోధనాభివృద్ధి సంస్థ (డి.ఆర్.డి.ఓ)

ప్రపంచంలోనే అతిపెద్ద కోవిడ్‌ ఆసుపత్రిని అతితక్కువ కాలంలో నిర్మించి రికార్డ్ ‌సృష్టించింది రక్షణ పరిశోధనాభివృద్ధి సంస్థ (డి.ఆర్‌.‌డి.ఓ). ఢిల్లీలోని విమానాశ్రయానికి సమీపంలో ఉన్న వైమానిక దళ స్థావరం వద్ద  250 ఐసియూ గదులతో కూడిన వెయ్యి పడకల ఆస్పత్రిని కేవలం 11 రోజుల్లో నిర్మించింది. టాటా సన్స్ ‌సంస్థ సహాయంతో నిర్మించిన ఈ ఆస్పత్రిలో సాయుధ దళాలకు చెందిన వైద్య సిబ్బంది వైద్యసేవలు అందిస్తారు.

‌ప్రముఖుల మాట


ఉగ్రవాదులకు స్థావరంగా తమకు పేరు ఎందుకు వచ్చిందో పాకిస్థాన్‌ ఆత్మపరిశీలన చేసుకోవాలి. కరోనా సంక్షోభకాలంలోనూ ఆ దేశం భారత్‌పై సీమాంతర ఉగ్రవాదాన్ని ప్రోత్సహించడం మానుకోలేదు.
- మహవీర్‌ ‌సింఘ్వీ,  ఐక్యరాజ్యసమితిలో భారత్‌ ‌రాయబారి

మనదైన విద్య కావాలి (హితవచనం)


పాశ్చాత్య విద్యావిధానం భారతీయ సాంస్కృతిక వారసత్వాన్ని అగౌరపరచి భారతీయ విద్యార్థులను చిన్నబుచ్చే విధంగా ఉంది. ప్రజలకు మంచి విద్యను అందించటం ద్వారానే, వాళ్ళను మంచి పౌరులుగా తీర్చిదిద్దవచ్చు. ప్రతి భారతీయుడికి భారతీయ సంస్కృతి గురించి, భారతదేశపు ఔన్నత్యాన్ని గురించి బోధించాలి.

‌బెంగాల్‌ ‌విభజన అడ్డుకున్న శ్యామాప్రసాద్‌ ‌ముఖర్జీ (స్ఫూర్తి)

 
‘ఎక్‌ ‌దేశ్‌ ‌మే దో విధాన్‌, ‌దో ప్రధాన్‌, ‌దో నిశాన్‌ ‌నహి చలేగా, నహి చలేగా’ అంటూ జాతీయ సమైక్యత కోసం పోరాడారు డా.శ్యామాప్రసాద్‌ ‌ముఖర్జీ. ప్రముఖ స్వాతంత్య్రయోధుడు అశుతోష్‌ ‌ముఖర్జీ కుమారుడైన శ్యామాప్రసాద్‌ ‌రెండవసారి బెంగాల్‌ ‌విభజన జరగకుండా అడ్డుకున్నారు. 1946లో కలకత్తా విశ్వవిద్యాలయ నియోజకవర్గం నుంచి బెంగాల్‌ అసెంబ్లీకి ఎన్నికైన ఆయన ఆ తరువాత రాజ్యాంగసభలో బెంగాల్‌కు ప్రాతినిధ్యవహించారు.

ఆది గురువు వేదవ్యాసుడు

 

ప్రతి సంవత్సరం ఆషాఢ శుద్ధ పౌర్ణమి రోజున గురుపూర్ణిమ లేదా వ్యాసపూర్ణిమ జరుపుకొంటారు.
వ్యాసాయ విష్ణు రూపాయ
వ్యాస రూపాయ విష్ణవే
నమో వైబ్రహ్మనిధయే
వాసిష్టాయ నమోనమః

కమ్యూనిజం : హింస, అణచివేతల సిద్ధాంతం


ఆధునిక కమ్యూనిజంలో హింస విడదీయరాని అంశమని అనేక ఆధారాల ద్వారా తెలుస్తుంది. బందీలను నిర్దాక్షిణ్యంగా కాల్చి చంపడం, నిరసనగళం వినిపించిన కార్మికులను చంపేయడం, రైతులను ఆకలిచావులకు గురిచేయడం వంటివి కేవలం ఎక్కడో జరిగిన ‘చెదురుమదురు’ సంఘటనలనే భ్రమ నుంచి మనం బయటపడాలి. ప్రపంచంలో ఎక్కడెక్కడ కమ్యూనిస్ట్ ‌వ్యవస్థ వేళ్లూనుకుందో అక్కడక్కడ ఇలాంటి సంఘటనలు కనిపిస్తూనే ఉంటాయి.

స్వదేశీ విధానమే అభివృద్ధికి తారకమంత్రం


స్వదేశీ అంటే మన దేశానికి సంబంధించినది అని అర్థం. ఏ దేశమైనా, ఏ సమాజపు జీవన విధానమైనా ప్రధానంగా ఆ దేశంలోని సాంస్కృతిక, భౌగోళిక పరిస్థితులపైన, ప్రకృతి వనరులపైనా ఆధారపడి ఉంటుంది. తమ సాంస్కృతిక, భౌగోళిక విలువలు దెబ్బతినకుండా స్వదేశంలోని వనరులను వినియోగించుకుంటూ అభివృద్ధి చెందటం ఒక విధానం. తమ దేశంలో లభించని వస్తువులను, ముడి సరుకును దిగుమతి చేసుకుని దానిని స్వదేశీ పరిజ్ఞానంతో అనుసంధానించి అభివృద్ధిచెందటం మరో విధానం. స్వదేశీ కేవలం ఆర్థిక సంబంధ మైనది మాత్రమే కాదు. విద్య, వైద్యం, నిర్మాణ, తయారీ రంగాల్లో మనదైన విజ్ఞానాన్ని ఉపయోగించుకుని ఎంతో ప్రగతి సాధించాం.

దివ్యాంగుల సాధికారతే సక్షమ్‌ ‌లక్ష్యం


‘సక్షమ్‌ (‌సమదృష్టి క్షమత వికాస ఏవం అనుసంధాన మండలి) అనేది గుర్తింపు పొందిన జాతీయ స్వచ్ఛంద సంస్థ. నాగపూర్‌లో 2008లో ప్రారంభించబడినది. దివ్యాంగుల సాధికారికత కోసం ఉద్దేశింపబడినది. పరిశోధన, ఉద్యోగ, న్యాయ, క్రీడా, సాంస్కృతిక రంగాలలో వారి సర్వతోముఖాభివృద్ధికి తోడ్పడుతుంది. ..

స్వదేశీ అంటే శాంతి, శ్రేయస్సు, భద్రతను రక్షించే ఒక గొప్ప తపస్సు


- ఆర్‌.ఎస్‌.ఎస్‌ ‌సహ సర్‌ ‌కార్యవాహ శ్రీ భాగయ్య 

స్వదేశీ అనేది ఒక నినాదం లేదా కేవలం ప్రచారం కాదని, ఇది శాంతి, శ్రేయస్సు మరియు భద్రతను ప్రోత్సహిస్తూ, పర్యవరణాన్ని రక్షించే ఒక గొప్ప తపస్సు అని రాష్ట్రీయ స్వయంసేవక్‌ ‌సంఘ్‌ ‌మాననీయ సహ సర్‌ ‌కార్యవాహ శ్రీ వి.భాగయ్య అన్నారు.

తెలంగాణ పండుగ - బోనాలు

 
సృష్టి అంతా అమ్మవారిమయమే...ప్రకృతి స్వరూపిణి అయిన ఆ పరమాత్మికను కొలడానికి అనేక మార్గాలు. అందులో బోనాలు ఒకటి. ఇది తెలంగాణాలో అసంఖ్యాక ప్రజలు జరుపుకునే ఆనందోత్సాహాల సంరంభం . దీన్ని తెలంగాణ తెలుగు వారి పండుగగా అభివర్ణిస్తారు. ఈ బోనాల పండుగ ఆషాఢ మాసం, కొన్ని చోట్ల శ్రావణ మాసంలో కూడా నిర్వహిస్తారు. ఎక్కువగా ఆదివారం నాడు జరుపుకుంటారు. అంతేకాదు తెలంగాణాలో ఆషాఢ నవరాత్రులను కూడా నిర్వహిస్తారు. 

నిమ్మకాయ (ఆకు)

ప్రస్తుతం కరోన సంక్షోభంలో కోవిడ్‌ ‌బారిన పడకుండా ఉండాలంటే శరీరంలో రోగనిరోధక శక్తిని పెంపొందించుకోవాలని డాక్టర్‌లు సలహా ఇస్తున్నారు. అందుకు సి విటమిన్‌ ఎక్కువగా ఉండే పదార్ధాలు తీసుకోవాలని సూచిస్తున్నారు. నిమ్మలో సి విటమిన్‌ ‌పుష్కలంగా ఉంటుంది. కాబట్టి ఈ సమయంలో బాగా ఉపయోగ పడుతుంది. అలాగే ఋతువు మారుతున్నప్పుడు కూడా కలిగే చిన్నపాటి ఇబ్బందులను కూడా తట్టుకునేందుకు ఇది ఉపయోగ పడుతుంది.

ఎస్సిలపై పాస్టర్ల దౌర్జన్యం.. చర్చి నిర్మాణం కోసం ఇండ్ల తొలగింపుకు యత్నం


యాచకమే జీవనోపాధిగా చేసుకుని జీవిస్తున్న ఎస్సి వర్గానికి చెందిన బుడగ జంగాల కుటుంబాలపై స్థానిక చర్చి దౌర్జన్యానికి పాల్పడ్డ ఘటన కడప జిల్లా ప్రొద్దుటూరు మండలం దొరసానిపల్లె గ్రామంలో జరిగింది. .
బాధితులు అందజేసిన వివరాల ప్రకారం.. దొరసానిపల్లె గ్రామంలో వెనుకబడ్డ బుడగజంగాల సామాజిక వర్గానికి చెందిన కొన్ని కుటుంబాలు గత 15 ఏళ్లుగా ఉపయోగంలో లేని భూమిలో చిన్నచిన్న టెంట్లు వేసుకుని జీవనం సాగిస్తున్నాయి. యాచనే ప్రధాన జీవనోపాధిగా వీరు రోజూ తమ పిల్లలతో కలిసి గ్రామాల్లో, పట్టణాల్లో యాచన చేస్తూ ఉంటారు.

‌క్రైస్తవ పాస్టర్‌ ‌దుశ్చర్య: వెంకటేశ్వరుని పాదాలు తొలగించి క్రీస్తు విగ్రహం ఏర్పాటు


ఎన్నో ఏళ్లుగా గ్రామస్థులు పూజించుకుంటున్న శ్రీ వెంకటేశ్వర స్వామి పాదాల నమూనాను స్థానిక పాస్టర్‌ ‌తొలగించివేసిన ఘటన తూర్పుగోదావరి జిల్లాలో చోటుచేసుకుంది.